పెట్రోల్ బంక్ సిబ్బంది తిట్టారేమో? 175 కి.మీ రేంజ్ బైక్ ధరను భారీగా పెంచిన కంపెనీ.. ఇప్పుడెంతంటే?

దేశంలో అన్ని రాష్టాల్లో కూడా పెట్రోలో ధరలు దాదాపు రూ.100కు పైనే ఉంది. పెద, మధ్య తరగతి ప్రజలకు టూవీలర్ లేనిదే రోజు గడవని పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగాలకు, వ్యాపారాలకు, కాలేజ్‌లకు, ఇంటి అవసరాల కోసం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బదులుగా చాలా మంది టూవీలర్ ఉపయోగిస్తున్నారు. అయితే భారీగా ఉన్న పెట్రోల్ ధరలతో సామాన్యుడు భయపడిపోతున్నాడు. చాలి చాలని జీతంతో ఇంటిని గట్టేక్కిస్తున్న పరిస్థితుల్లో సంపాదనలో టూవీలర్ మెయింటనెన్స్‌కే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఇటీవల కాలంలో చాలా మంది ఎలక్ట్రిక్ బైక్‌లను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. రోజూ పెట్రోల్ కొట్టించాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే హాయిగా బ్యాటరీ ఛార్జ్ చేసుకుని రోజంతా తిరిగే ఈవీ బైకులను ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. అందుకే వాహన తయారీదారులు కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నారు.

ఈ విభాగంలో ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్రముఖ స్టార్టప్ కంపెనీల్లో ఒబెన్ (oben) ఎలక్ట్రిక్ టూవీలర్ ఒకటి. మిగతా కంపెనీల నుంచి బలమైన పోటీ ఉన్నప్పటికీ కూడా వాటన్నింటిని తట్టుకుని మార్కెట్లో బలంగా నిలబడటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ కంపెనీ నుంచి గతంలో విడుదలైన ప్రసిద్ధ మోడల్ రోర్ EZ ఎలక్ట్రిక్ బైక్ ప్రస్తుతం కస్టమర్ల నుంచి మంచి ఆదరణ సంపాదిస్తుంది. తక్కువ ధరకే దీన్ని తీసుకొచ్చింది.

Oben Rorr Ez Electric Bi

కంపెనీ ఈ బైక్‌ను రూ.89,999 ప్రారంభ ధరతో లాంచ్ చేయడంతో దేశీయ ప్రజల నుంచి మెరుగైన స్పందన రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ ధరలో బైక్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటే మాత్రం కుదరదు. ఎందుకంటే బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్ బ్రాండ్ తన ప్రసిద్ధ మోడల్ ధరను పెంచి కొత్త కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. కంపెనీ ఈ బైక్‌పై ఏకంగా రూ.10000 పెంపుదల చేసింది.

అయితే ప్రారంభ వేరియంట్ ధర రూ.89,999 నుంచి మొదలవుతుంది. కానీ ఈ ధర పెరుగుదల ఒబెన్ రోర్ EZ టాప్ వేరియంట్‌లపై వర్తిస్తుంది. బేస్ మోడల్‌ను కాకుండా టాప్ ఎండ్‌ను ఎంచుకునే వారు ఇంకా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంది. రోర్ EZ ప్రస్తుతం మార్కెట్లో మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో కొనుగోలుకు లభిస్తుంది. కస్టమర్లు తమ అవసరాల మేరకు నచ్చిన బ్యాటర్ ప్యాక్ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు.

Rorr Ez Electric Bike Price Hiked Rs 10000

ఒబెన్ రోర్ EZ ఎలక్ట్రిక్ బైక్ 2.4 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ప్రారంభ ధర రూ.89,999 , 3.4 kWh వేరియంట్ ధర రూ.1.09 లక్షలు, ఇది ధర పెరగకముందు రూ,99,999లకే కొనుగోలు చేయడానికి లభించింది. చివరగా 4.4 kWh బ్యాటరీ ప్యాక్ పాత ధర రూ.1.09 లక్షలు కాగా, ఇప్పుడు కొత్త ధర రూ. 1.19 లక్షలుగా ఉంది. ముఖ్య విషయం ఏమిటంటే ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు.

Take a Poll

2.6 kWh బ్యాటరీ ప్యాక్‌‌ 45 నిమిషాల ఛార్జింగ్‌తో 110 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. అదే 3.4 kWh బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జింగ్ సమయం 1.30 గంటలు. సింగిల్ ఛార్జ్‌తో 140 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. టాప్ ఎండ్ 4.4 kWh బ్యాటరీ ప్యాక్ 2 గంటల్లో పూర్తి ఛార్జింగ్ అవుతుంది. ఇది పూర్తి ఛార్జ్‌తో 175 కి.మీల వరకు రేంజ్‌ను అందిస్తుంది.

Rorr Ez Electric Bike New Price

మరో విషయం ఏమిటంటే ఈ ఛార్జింగ్ టైం ఫాస్ట్ ఛార్జర్‌ను బట్టి మారుతాయి. ఒబెన్ రోర్ ఈజెడ్ PMS ఎలక్ట్రిక్ మోటారుతో 10 bhp పవర్‌ను, 52 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 3.3 సెకన్లలో గంటకు 0-40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 95 కిలోమీటర్లు.

More from DriveSpark

Article Published On: Friday, March 14, 2025, 14:45 [IST]
English summary
Oben rorr ez electric bike price hiked by up to rs 10000 more details chcek here
Read more on: #electric bike #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+