రూ.1.27 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్క ఛార్జ్‌తో 175 కి.మీ.. గంటన్నరలో 80 శాతం ఛార్జ్

ఎలక్ట్రిక్ బైకులకు ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగింది. గతంతో పోలిస్తే ఈ సెగ్మెంట్‌లో సేల్స్ సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. ఈ విభాగంలో చాలా కంపెనీలు తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాయి. ఒబెన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఈ విభాగంలో తనదైన ముద్ర వేసుకుంటోంది. రోర్ మోడల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ట్-అప్ సంస్థ, ఇప్పుడు వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా మరింత స్మార్ట్‌గా, అప్‌డేట్ చేసిన మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తాజాగా కంపెనీ ఒబెన్ రోర్ ఈజెడ్ సిగ్మా (oben rorr ez sigma) పేరుతో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది గత వర్షన్ రోర్ ఈజీకి కొత్త రూపం అని చెప్పొచ్చు. ఇది వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రెండు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది.

ఈ కొత్త మోటార్‌సైకిల్ 3.4 kWh బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది, రెండవది 4.4 kWh సామర్థ్యంతో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ల ధరల్ని చూస్తే మొదటి వేరియంట్ ధర రూ. 1.27 లక్షలు కాగా, రెండవదాని ధర రూ. 1.37 లక్షలుగా నిర్ణయించబడింది. ఈ ధరలు పరిచయ ధరలుగా కంపెనీ పేర్కొనడం గమనార్హం. ఒబెన్ తన మోడళ్లకు ప్రత్యేకమైన స్టైల్, రంగులతో పాటు, లేటెస్ట్ ఫీచర్లను అందిస్తోంది.

Oben Rorr Ez Sigma New Electric Bike Launched At Rs 1 27 Lakh

తాజా వేరియంట్ రోర్ ఈజెడ్ సిగ్మాలో కూడా వినియోగదారులకు మరింత ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌ను తీసుకొచ్చారు. అర్బన్ యూత్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ మోడల్ లుక్, టెక్నాలజీ రెండింటినీ సమానంగా కలిగి ఉన్న మోడల్. ఒబెన్ రోర్ ఈజెడ్ సిగ్మా ఇప్పుడు పరిచయ ధరకు మాత్రమే అందుబాటులో ఉంది, కానీ ఇది శాశ్వతం కాదు. కంపెనీ వెల్లడించిన ప్రకారం, ఈ ప్రత్యేక ధరలు పరిమితకాలం పాటు మాత్రమే ఉండనున్నాయి.

తరువాత ఈ మోడళ్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. అందుకే ఆసక్తి ఉన్న వినియోగదారులు తొందరపడితే మేలు. బుకింగ్ ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉంది. కేవలం రూ. 2,999 టోకెన్ అమౌంట్‌ను చెల్లించి, ఒబెన్ రోర్ ఈజీ సిగ్మాను బుక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా తమ డీలర్‌షిప్‌లలో టెస్ట్ రైడ్‌లను ప్రారంభించింది. అంటే కొనుగోలు చేసేముందే బైక్‌ను పూర్తిగా ఒకసారి నడిపే అవకాశం లభిస్తుంది.

Rorr Ez Sigma New Electric Bike Launched At Rs 1 27 Lakh In India

బుక్ చేసిన కస్టమర్లకు డెలివరీలు ఆగస్టు 15, 2025 నుండి ప్రారంభమవుతాయి. ఒబెన్ రోర్ ఈజెడ్ సిగ్మా స్పెసిఫికేషన్‌, ఫీచర్ల పరంగా మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందేలా రూపొందించబడింది. బ్రాండ్ అభివృద్ధి చేసిన LFP బ్యాటరీ టెక్నాలజీను ఇందులో ఉపయోగిస్తున్నారు. దీనిలో అందించే రెండు బ్యాటరీ ప్యాక్‌ల‌తో 95 కిమీ/గం వేగంతో 0 నుంచి 40 కిమీ/గం వేగానికి చేరడానికి కేవలం 3.3 సెకన్లు మాత్రమే పడుతుందని కంపెనీ తెలిపింది.

ఓబెన్ ప్రకారం, ఒకే ఛార్జ్‌తో 175 కిమీ వరకు ప్రయాణించవచ్చు, ఇది డైలీ రైడింగ్‌కి బెస్ట్. సేఫ్టీ, టెక్నాలజీ పరంగా కూడా ఆకట్టుకుంటుంది. వినియోగదారులకు ఒక సంవత్సరం పాటు ఓబెన్ ఎలక్ట్రిక్ యాప్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కూడా కంపెనీ అందిస్తుంది. ఇది రిమోట్ డయాగ్నస్టిక్స్, యాంటీ థెఫ్ట్ లాక్, రైడ్ ట్రాకింగ్ , ఛార్జింగ్ స్టేషన్ లొకేటర్ వంటి స్మార్ట్ ఫీచర్లు వినియోగించవచ్చు.

Oben Rorr Ez Sigma New Electric Bike Launched At Rs 1 27 Lakh In India

భద్రతా అంశాల విషయానికి వస్తే, యూనిఫైడ్ బ్రేక్ అసిస్ట్ (UBA), డ్రైవర్ అలర్ట్ సిస్టమ్, జియో-ఫెన్సింగ్ వంటివి ఉన్నాయి. ఇది ఎకో, సిటీ, హవోక్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. ముఖ్యంగా ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి కూడా సపోర్ట్ చేస్తుంది. ఒబెన్ రోర్ ఈజీ సిగ్మా గంటన్నరలో 0-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని రోర్ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 5, 2025, 16:40 [IST]
English summary
Oben rorr ez sigma new electric bike launched at rs 1 27 lakh in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+