ఈ బైక్‌కు యువత ఫిదా కావాల్సిందే.. మార్కెట్లోకి మాస్ అట్రాక్షన్ బైక్.. కేవలం రూ.1.18 లక్షలకే
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఒడిస్సే (odysse) స్పోర్టీ డిజైన్, అత్యాధునిక ఫీచర్స్‌తో కూడిన శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని పేరు ఎవోకిస్ లైట్ (evoqis lite). ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు కొనగలిగే విధంగా కంపెనీ దీన్ని రూ. 1.18 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంత తక్కువ ధరలొ టాప్ మోడళ్లలో ఉండే విధంగా అధునాతన ఫీచర్స్‌ను అందించారు. ధర పరంగా ఇది అందుబాటులో ఉండటంతో పాటు, ఫీచర్ల విషయంలో ఒడిస్సే ఎక్కడా రాజీ పడలేదు. ఇది యువ రైడర్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది.
స్టైలిష్ డిజైన్, స్పోర్ట్స్ లుక్ అన్నిటినీ కలిపి అందించిన ఈ ఎవోకిస్ లైట్, కొత్తగా ఈవీ బైక్ కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది గంటకు 75 కి.మీ టాప్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. దీనిలో మంచి పెర్ఫామెన్స్ అందించగల ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. బ్యాటరీ ప్యాక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే దాదాపు 90 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుంది. ఇది తన డిజైన్, టెక్నాలజీతో యువతను ఆకర్షించేలా రూపొందించబడింది.

ఇది ప్రత్యేకంగా యమహా R15 తరహాలో రెండు వరుసల సీటు, షార్ప్ టెయిల్ సెక్షన్ ఇవ్వడం వల్ల, దీనికి ఫినిష్‌ను కలిగిస్తుంది. ఈ రూపంతో ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తూ, మార్కెట్లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ బైక్‌ల కంటే ముందంజలో నిలుస్తుంది. కేవలం ఎక్స్‌టీరియర్ విషయంలోనే కాకుండా ఫంక్షనాలిటీ విషయంలోనూ ఎవోకిస్ లైట్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో యాంటీ-థెఫ్ట్ టెక్నాలజీని ప్రత్యేకంగా అందించారు. దీంతో బైకును దొంగలించడం అసాధ్యం.
అలాగే, కీలెస్ స్టార్ట్ సిస్టం టెక్నాలజీ ఇచ్చారు. ఇది రైడింగ్‌ను మొదలుపెట్టడం మరింత ఈజీ చేస్తుంది. అలాగే, మోటార్ కట్-ఆఫ్ స్విచ్ అనేది అత్యవసర పరిస్థితుల్లో రైడర్‌కు అదనపు కంట్రోలింగ్‌ను అందిస్తుంది. ముఖ్యంగా, ఈ బైక్ మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది. దీంతో రైడర్లు తమ అవసరాలకు అనుగుణంగా రైడింగ్ ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కలిపి ఈ ఎలక్ట్రిక్ బైక్ సగటు వినియోగదారుడికి కూడా నచ్చుతుంది.

ఈ స్థాయిలో ఫీచర్లు అందిస్తూ కూడా ఒడిస్సే బైక్‌ను కేవలం రూ. 1.18 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేయడం గమనార్హం. డ్జెట్ పరిమితి ఉన్నా, అధునాతన డిజైన్, టెక్నాలజీని కోరుకునే వినియోగదారుల కోసం ఇది బెస్ట్ ఎంపికగా మారే అవకాశముంది. ఒడిస్సీ ఎవోకిస్ లైట్ బైక్ యమహా R15 మాదిరిగానే కాకుండా, అధిక శక్తి సామర్థ్యం కలిగిన కవాసకి నింజా 300 వంటి సూపర్‌బైక్‌లను కూడా గుర్తు చేస్తుంది.
ఈ బైక్‌లో స్పోర్టీ ఫ్రంట్ కౌల్, ట్యూన్ చేసిన క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్, ఆకర్షణీయమైన సీటింగ్ వంటి అంశాలు దాని రూపాన్ని మరింత డైనమిక్‌గా మార్చాయి. ఈ అంశాలన్నీ కలిసి ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో ఈ బైక్‌ను స్పోర్టీ వేరియంట్‌గా నిలబెట్టాయి. ప్రత్యేకించి యువతలో స్పోర్టీ ఫీల్‌తో కూడిన రైడింగ్ అనుభూతిని కోరుకునేవారికి ఒడిస్సీ ఎవోకిస్ లైట్ బైక్ అనుకూల ఎంపికగా నిలుస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








