కేవలం రూ. 74,999లకే ఓలా బైక్‌.. రేపే అధికారికంగా మార్కెట్‌లోకి వచ్చేస్తుంది.. డెలివరీలు కూడా రేపే ఆరంభం!

దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీలో ఓలా సంస్థ దూసుకెళ్తుంది. ఏ కంపెనీకి అందని రేంజ్‌లో స్కూటర్ మార్కెట్‌ని అతలాకుతలం చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఇప్పటికే దేశంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. పెట్రోల్‌తో నడిచే బైకులకు సైతం ఈ కంపెనీ గట్టి పోటీని ఇస్తుంది. కేవలం తక్కువ రోజుల్లోనే ఈవీ టూవీలర్స్‌కి ఓలా కేరాఫ్ అడ్రస్‌గా అవతరించింది. ఈ కంపెనీ స్కూటర్‌ మార్కెట్‌లో ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇదే జోష్‌లో ఇప్పటికే చాలా తక్కువ ధరలో మోటార్‌సైకిల్స్‌ని విడుదల చేసింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హీరో స్ప్లెండర్ వంటి కమ్యూటర్ మోటార్ సైకిళ్లతో పోటీ పడేందుకు ఇప్పుడు చాలా తక్కువ ధరకే మోటార్‌సైకిల్స్‌ని ప్రవేశపెట్టనుంది.

ఇప్పటి వరకే ఈ బైక్స్‌ని విడుదల చేసినప్పటికీ వీటి డెలివరీలను కంపెనీ ఆరంభించలేదు. వీటిని ఓలా ప్రొడక్షన్‌ బైక్స్‌గా పిలుస్తోంది. అయితే రేపు (02-02-2025) ఈ రోడ్‌స్టర్‌ ఈవీ బైక్‌ మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. ఇది రెగ్యులర్, ఎక్స్, ప్రో అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో రివోల్ట్‌, ఒడిస్సీ, అల్ట్రావయాలెట్‌, ఒబెన్‌ రోర్‌ వంటివి మార్కెట్‌లో ఉన్నాయి. త్వరలోనే వీటి ఆధిపత్యానికి సైతం బ్రేక్‌ పడనుంది.

Ola Electric Roadster Motorcycle Launch

గత ఆగస్టులో దేశీయ మార్కెట్లో విడుదల చేసిన ఈ రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అత్యంత సరసమైన వేరియంట్ ఎక్స్‌గా ఉంది. ఇది కేవలం 2.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధరను కేవలం రూ.74,999గా కంపెనీ నిర్ణయించింది. ఇది అందరినీ షాక్‌కి గురిచేసింది.

ఇక 3.5 కిలోవాట్ల, 4.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్స్‌ ధరలు వరుసగా రూ.84,999, రూ.99,999గా ఉన్నాయి. ఈ ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ సేల్ ఫిబ్రవరి 5న (రేపటి) నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. దీంతో నాలుగు నెలల ఎదురుచూపులకు తెరపడనుంది. దీనికి సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కంపెనీ ఇదివరకే విడుదల చేసింది.

Ola Electric Roadster Motorcycle Series

ఈ బైక్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ని అందిస్తుంది. అలాగే ఇది రెగ్యూలర్‌ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే రోడ్‌స్టర్ ఎక్స్ గరిష్టంగా గంటకు 124 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ఓలా రోడ్ స్టర్ ఎక్స్ 11 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌తో పనిచేస్తుంది. మరోవైపు రోడ్‌స్టర్ రెగ్యులర్ వేరియంట్‌లో 13 కిలోవాట్ల యూనిట్ కలదు.

ఇందులో జీరో-ఎమిషన్ మోడల్ క్రూయిజ్ కంట్రోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లు కలవు. ఇందులో రైడర్స్‌ గైడ్ కోసం 4.3 అంగుళాల LCD డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ఈ బైక్‌లో ఇవే కాకుండా ఎల్ఈడీ లైటింగ్, రీజియన్ బ్రేకింగ్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ మోడ్, టైర్‌ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, జియో, టైమ్ ఫెన్సింగ్ వంటి ఫీచర్లు కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో ఉన్నాయి.

నాన్-టచ్ డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ స్పీడోమీటర్, రైడ్ మోడ్లు, రేంజ్, టాచీ మరెన్నో ఇన్ఫర్మేషన్‌ని అందిస్తుంది. 4.5 కిలోవాట్ల బ్యాటరీతో అమర్చిన రోడ్‌స్టర్ ఈవీ పెద్ద వేరియంట్ కేవలం 2.8 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ఇక 2.5 కిలోవాట్ల యూనిట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 117 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ మిడ్-లెవల్ 3.5 కిలోవాట్ల వెర్షన్ ఫుల్ ఛార్జ్ చేస్తే 159 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇక ఓలా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్‌, సస్పెన్షన్ కోసం వెనుక భాగంలో మోనోషాక్ సిస్టమ్‌ కలదు. ఇక ఇందులో బ్రేకింగ్ విషయానికి వస్తే, ఎబిఎస్ సిస్టమ్ సహాయంతో ముందు, వెనుక భాగంలో సింగిల్ డిస్క్ యూనిట్ కూడా కలదు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 4, 2025, 18:52 [IST]
English summary
Ola electric all set to launch production ready roadster motorcycles on tomorrow
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+