ఏకంగా రూ. 26 వేల భారీ తగ్గింపు.. అతి తక్కువ ధరకే ఓలా స్కూటర్లు! ఇంతకంటే బెటర్ ఆఫర్ ఇంకెక్కడా లేదు!

ఇండియాలో ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న ప్రముఖ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఇటీవల కాలంలో అమ్మకాల పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. దేశంలో ఈవీలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో పెద్ద వాహన తయారీ కంపెనీలే కాకుండా ఇతర స్టార్టప్ సంస్థలు సైతం పుట్టుకొచ్చి ట్రెండ్‌కు అనుగుణంగా కస్టమర్లను ఆకట్టుకోడానికి వెరైటీ డిజైన్లతో కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ను వరుసగా విడుదల చేస్తున్నాయి. దీంతో ప్యత్యర్థుల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడానికి ఓలా కంపెనీ తీవ్రంగా కష్టపడుతుంది. ఇప్పుడు కంపెనీ సేల్స్ పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గత నెల అమ్మకాలను చూసినట్లయితే ఫిబ్రవరిలో ఓలా ఎలక్ట్రిక్ నాల్గవ స్థానానికి పడిపోయింది. గతంలో మొదటి స్థానంలో ఉండగా, ఈ సారి సేల్స్ బాగా తగ్గిపోవడం కారణంగా తన స్థానాన్ని కోల్పోయింది.

గత నెలలో కంపెనీ మొత్తం 8,647 యూనిట్లను సేల్ చేసింది. దీనికంటే ముందు బజాజ్, టీవీఎస్, ఏథర్ ఎలక్ట్రిక్ టూవీలర్ విక్రయాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచాయి. అమ్మకాల డేటా ప్రకారం, మొత్తం 21,335 యూనిట్ల సేల్స్‌తో బజాజ్ చేతక్ దేశంలో నంబర్-వన్ ఎలక్ట్రిక్ కంపెనీగా అవతరించింది. తరువాత రెండో స్థానంలో 18,748 యూనిట్లతో టీవీఎస్ ఉంది. ఇక 11,789 యూనిట్ల అమ్మకాలతో ఏథర్ మూడవ స్థానం పొందింది.

Ola Electric Holi Flash Sale

ఈ నేపథ్యంలో తన సేల్స్ తగ్గిపోవడంపై ఓలా ఎలక్ట్రిక్ సీరియస్‌గా దృష్టి సారించింది. అందుకే కంపెనీ కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి, తన అమ్మకాల సంఖ్యను పెంచుకోవడానికి ఈ హోలీ పండుగకు తన స్కూటర్లపై భారీగా తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. దీని ద్వారా ఎలాగైనా కోల్పోయిన నంబర్ వన్ స్థానాన్ని తిరిగి పొందాలని చూస్తుంది. ఈ పండుగ ఆఫర్‌ (Holi Flash Sale)ను కంపెనీ పరిమిత కాలం వరకు మాత్రమే అందిస్తుంది.

హోలీ ఫ్లాష్ సేల్‌‌లో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ S1 ఎయిర్ స్కూటర్‌ను కస్టమర్లు రూ.26,750 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దీంతో దీని ధర రూ. 89,999 నుంచి మొదలువుతుంది. అలాగే, 2వ జనరేషన్ 1 X+ మోడల్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు కూడా భారీ తగ్గిపును ఆశించవచ్చు. దీనిపై కంపెనీ రూ. 22,000 వరకు తగ్గింపు ఇస్తుంది. దీంతో ఈ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.82,999 నుంచి మొదలవుతుంది.

Holi Offers On S1

వీటిపై మాత్రమే కాకుడా కంపెనీ S1 Gen 3 సిరీస్‌లోని అన్ని స్కూటర్లతో పాటు మిగిలిన S1 సిరీస్‌పై దాదాపు రూ. 25,000 వరకు తగ్గింపును అందిస్తుంది. పండుగ తగ్గింపు తర్వాత S1 Gen 2 మోడల్ ధర రూ.69,999 నుంచి మొదలవుతుంది. అలాగే Gen 3 ధర రూ.1,79,999 నుంచి ప్రారంభమవుతుంది. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇంత కంటే మంచి అవకాశం రాకపోవచ్చు.

ఈ తగ్గింపు ఆఫర్స్‌తో పాటు కంపెనీ మరిన్ని అదనపు ప్రయోజనాలను కూడా ఇస్తుంది. S1 Gen 2 స్కూటర్లపై రూ. 2,999 విలువైన ఒక ఏడాది ఉచిత MoveOS OS+ సబ్‌స్క్రిప్షన్, రూ. 14,999 విలువైన ఎక్స్‌టెండేట్ వారంటీని కేవలం రూ.7,499కే కొనచ్చు. హోలీ ఫ్లాష్ సేల్‌‌ను ఉపయోగించుకుని కస్టమర్లు అతి తక్కువ ధరకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తమ ఇంటికి తీసుకెళ్లవచ్చు.

Ola Electric Holi Flash Sale Offer

ఇది పరిమిత కాలం ఉంటుంది, కాబట్టి వెంటనే త్వరపడటం బెస్ట్. ఇక కంపెనీ విషయానికి వస్తే, బ్యాటరీ, ఇతర సేవలకు సంబంధించి వరుస ఫిర్యాదుల కారణంగా గత సంవత్సరం ఓలా బాగా తగ్గిపోయాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ ఈ సమస్యలపై దృష్టి సారించి సేల్స్ పెంచుకోవాలని చూస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 13, 2025, 16:37 [IST]
English summary
Ola electric announced limited time holi flash sale offer up to rs 26750 discount
Read more on: #ola electric #offers #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+