ఎప్పుడెప్పుడా అన్న తరుణం రానే వచ్చింది.. ఎస్1 జెన్3 స్కూటర్ల డెలివరీ షురూ చేసిన ఓలా
భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. భారతదేశం అంతటా తన ఎస్ 1 జెన్ 3 స్కూటర్‌ను పంపిణీ చేయడం ప్రారంభించింది. ఇందులో ఎస్1 ప్రొ+ తో పాటు ఎస్1 ప్రొ, ఎస్1 ఎక్స్ కూడా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ విస్తృతమైన స్టోర్ల నెట్‌వర్క్, హోమ్ డెలివరీ ద్వారా వీటిని వినియోగదారులకు అందిస్తున్నారు.
జెన్ 3 స్కూటర్లకు వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో ఓలా ఎలక్ట్రిక్ నిబద్ధతను ఇది తెలియజేస్తోంది. ఈ స్కూటర్లు లేటెస్ట్ టెక్నాలజీ, అద్భుతమైన పర్ఫామెన్స్, సేఫ్టీని అందిస్తున్నాయి. దీంతో ఓలా ఎలక్ట్రిక్ ఈ సరికొత్త స్కూటర్లతో భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది.

"మా ఎస్1 జెన్ 3 స్కూటర్లకు అఖండ స్పందన లభించింది. ఇది చూస్తే ఇండియా త్వరలోనే ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మారుతుందని అర్థం అవుతుంది. ఆ అంచనాలను అందుకునేందుకు మా కంపెనీ నిరంతరంగా కృషి చేస్తుంది. జెన్ 3 పోర్ట్‌ఫోలియో అందించే మంచి పర్ఫామెన్స్, సేఫ్టీ ఫీచర్స్ కారణంగా మా కస్టమర్లలో మేము విశ్వాసాన్ని కలిగించగలిగాం" అని కంపెనీ తెలిపింది.
జెన్ 3 ప్లాట్‌ఫామ్ నెక్ట్స్ లెవన్ పర్ఫామెన్స్, ఎఫీషియన్సీ, సేఫ్టీ, రిలయబిలిటీని అందిస్తుంది. మొత్తం పోర్ట్‌ఫోలియో ఇప్పుడు పర్ఫామెన్స్, రిలయబిలిటీ కోసం మిడ్-డ్రైవ్ మోటార్ , చైన్ డ్రైవ్‌ను కలిగి ఉంది. మెరుగైన రేంజ్, ఎఫీషియన్సీ కోసం ఇంటిగ్రేటెడ్ MCU (మోటార్ కంట్రోల్ యూనిట్) ఉంది.

జెన్ 2 కంటే, జెన్ 3 మాగ్జిమమ్ పవర్ లో 20 శాతం పెరుగుదల, ఖర్చులో 11 శాతం తగ్గింపు, రేంజ్లో 20 శాతం పెరుగుదలను అందిస్తుంది. జెన్ 3 ప్లాట్‌ఫామ్ ఈవీ స్కూటర్లకు మొదటి డ్యూయల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), పేటెంట్ పొందిన బ్రేక్-బై-వైర్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తుంది.
ఇది బ్రేక్ పొజిషన్ సెన్సార్ ఆధారంగా బ్రేక్‌లను అప్లై చేస్తుంది. రీజెన్, మెకానికల్ బ్రేకింగ్ మధ్య బ్రేకింగ్ టైప్‌ను డైనమిక్‌గా మారుస్తుంది. ఈ పేటెంట్ టెక్నాలజీ అన్ని రైడింగ్ పరిస్థితుల్లో అసమానమైన భద్రత, కంట్రోల్, మోర్ ఎఫెక్టివ్ బ్రేకింగ్‌ను అందిస్తుందని ఓలా పేర్కొంది.
S1 Pro+: ఎస్1 ప్రొ+ (5.3kWh, 4kWh) 13కిలో వాట్స్ మోటారుతో ఎనర్జీని పొందుతుంది. ఇది కేవలం 2.1, 2.3 సెకన్లలో 0 నుంచి 40కి.మీ రేంజ్ అందుకుంటుంది. దీని గరిష్ట వేగం వరుసగా గంటకు 141కి.మీ, గంటకు 128కిలో మీటర్లు. ఎస్ 1 ప్రో 320 కి.మీ (IDC) ఆకట్టుకునే రేంజ్ తో వస్తుంది.

S1 Pro: 11 kW మిడ్-డ్రైవ్ మోటార్‌తో నడిచే ఎస్ 1 ప్రో (4kWh, 3kWh) వరుసగా గంటకు 125కి.మీ, గంటకు 170కి.మీ.. గరిష్ట వేగంతో 242కి.మీ.. 176 కి.మీ (IDC) రేంజ్‌తో గణనీయమైన పర్ఫామెన్స్‌ను పొందుతుంది. రెండు వేరియంట్స్ కేవలం 2.7 సెకన్లలో గంటకు 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
S1 X+, S1 X: S1 X శ్రేణిలోని ఫ్లాగ్‌షిప్ స్కూటర్, S1 X+ క్వాలిటీ, టెక్నాలజీపై రాజీ పడకుండా పర్ఫామెన్స్, మిడిల్ క్లాస్ బడ్జెట్ ల కలయికతో వస్తుంది. ఇది నాలుగు రైడింగ్ మోడ్‌లలో లభిస్తుంది. ఇది ఒకే ABS ని అందిస్తుంది. 4kWh బ్యాటరీ, 11 kW మిడ్-డ్రైవ్ మోటారుతో నడిచే S1 X+ కేవలం 2.7 సెకన్లలోనే 0 నుంచి 40కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటూ 242కి.మీల రేంజ్‌తో వస్తుంది.
S1 X 4kWh, 3kWh, 2kWh బ్యాటరీ ప్యాక్‌లలో 7కిలో వాట్స్ మోటారుతో వస్తుంది. ఇవి వరుసగా 123 కి.మీ., 115 కి.మీ., 101 కి.మీ. వేగంతో దూసుకుపోతాయి. ఇది సంబంధిత బ్యాటరీ వేరియంట్లలో 242 కి.మీ, 176 కి.మీ., 108 కి.మీ (IDC) రేంజ్ అందిస్తుంది. అవి వరుసగా 3.0 సెకన్లు, 3.1 సెకన్లు, 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కి.మీ. వేగాన్ని అందుకుంటాయి.


Click it and Unblock the Notifications








