ఓలా ది రియల్ గేమ్ ఛేంజర్! రూ. 75 వేలకే స్పోర్టీ ఈ-బైక్ రోడ్‌స్టర్ ఎక్స్.. ఎంట్రీ అదిరిపోయింది

దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) స్కూటర్ల విభాగంలో ఇండియాలో అగ్రస్థానంలో ఉండగా, బైక్స్ సెగ్మెంట్‌లో కూడా తన సత్తాను చాటడానికి కొద్ది నెలల క్రితం మార్కెట్లోకి రోడ్‌స్టర్ (Roadster) బైక్ మోడల్‌ను విడుదల చేసింది. స్పోర్టీ లుక్‌తో కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ మోడల్ మూడు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో వచ్చింది. రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ X,రోడ్‌స్టర్ ప్రో అనే ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి వచ్చింది. కస్టమర్ బడ్జెట్, అవసరాల ఆధారంగా నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. రోడ్‌స్టర్ X లైనప్, ఈ మూడు మోడళ్లలోనూ అత్యంత తక్కువకు లభిస్తుంది. ఇదిలా ఉండగా, ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఈ బైక్ ఉత్పత్తి కార్యకలాపాలను ఇప్పటికే ప్రారంభించిందని తాజా సమాచారం.

దీనికి ధృవీకరణగా, ఓలా కంపెనీ తయారీ ప్లాంట్ నుంచి బయటకు వస్తున్న రోడ్‌స్టర్ బైక్స్ ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది బైక్‌ను త్వరలోనే డెలివరీ చేయనున్న సూచనలుగా భావిస్తున్నారు. ఓలా ఈ కొత్త ఈ-బైక్‌తో మార్కెట్‌లో ఎలక్ట్రిక్ బైక్స్ విభాగంలో కూడా తన సత్తాను చూపించడానికి సిద్ధమైంది. స్పోర్టీ లుక్, తక్కువ ధర, అధునాతన ఫీచర్స్‌తో ఇది విజయవంతం అవుతుందని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది.

Ola Electric Finally Rolls Out First Roadster X Ceo

ఓలా ఎలక్ట్రిక్‌కు చెందిన రోడ్‌స్టర్ ఎక్స్ బైక్ ఇప్పుడు ఏకంగా ఓ హైప్ క్రియేట్ చేస్తోంది. కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ స్వయంగా ఈ బైక్‌ను రోడ్డుపై టెస్ట్ డ్రైవ్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓలా నుంచి విడుదలయ్యే ప్రతి కొత్త వాహనాన్ని ముందుగా తానే ట్రై చేయడం భవిష్‌కు అలవాటు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రోడ్‌స్టర్ ఎక్స్ బైక్‌ను నడిపారు.

ప్రస్తుతం, ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ బైక్ రెండు వేరియంట్లలో భారత మార్కెట్లో లభిస్తోంది. రోడ్‌స్టర్ X ధర రూ. 74,999, రోడ్‌స్టర్ X ప్లస్ ధర రూ. 1.04 లక్షలు. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఈ రెండు వేరియంట్లు, స్టైలింగ్, ఫీచర్లు, కెపాసిటీ వంటి అంశాల్లో స్వల్ప తేడాలు కలిగి ఉంటాయి. కానీ రెండూ ప్రీమియం స్పోర్టీ లుక్‌తో వినియోగదారుల దృష్టిని ఆకర్షించడంలో పేరొందాయి.

Ola Electric Finally Rolls Out First Roadster X Electric Bike

ఈ బైక్‌కి సంబంధించిన ఫోటోలు, టెస్ట్ రైడ్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ క్రేజ్‌ను సంపాదించాయి. రోడ్‌స్టర్ ఎక్స్ బైక్ ఉత్పత్తిని ఓలా ఎలక్ట్రిక్‌కి ప్రారంభించింది. ఉత్పత్తి పనులు ప్రారంభమైన నేపథ్యంలో, త్వరలోనే ఈ మోడల్‌కి సంబంధించిన డెలివరీలు కూడా ప్రారంభమవుతాయని అంచనాలు ఉన్నాయి. వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బైక్ త్వరతో వారి చేతుల్లోకి రాబోతుంది.

ఓలా ఈ బైక్‌ను కొత్తగా అభివృద్ధి చేసిన మిడ్-డ్రైవ్ మోటార్ తో రూపొందించింది. ఇది చాలా పవర్‌ఫుల్ మోడల్. దులో MCU ఇంటిగ్రేషన్ వంటి ఆధునిక టెక్నాలజీ కూడా ఉంది. భద్రతా పరంగా చూస్తే, ఈ బైక్‌కి IP67 సర్టిఫైడ్ బ్యాటరీలు ఉన్నాయి. అంటే, వర్షం పడినా, దుమ్ముతో ఈ బ్యాటరీల పనితనంల ఎలాంటి తేడా ఉండదు. వాతావరణ మార్పులకు తట్టుకోగలిగే సామర్థ్యంతో ఈ బైక్‌ను డిజైన్ చేశారు.

First Roadster X Electric Bike

ఇది 118 కి.మీ/గం వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో 7 కిలోవాట్ల మోటారును అమర్చారు. రోడ్‌స్టర్ X ప్లస్ వేరియంట్ 11 kW మోటార్‌తో గంటకు 125 కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది. రోడ్‌స్టర్ X వేరియంట్ 2.5 kWh, 3.5 kWh, 4.5 kWh బ్యాటరీ ప్యాక్‌లో లభిస్తుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో ఈ కొత్త మోడళ్లు కూడా బాగా అమ్ముడుపోతాయని కంపెనీ భావిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, April 11, 2025, 17:40 [IST]
English summary
Ola electric finally rolls out first roadster x electric bike more details inside
Read more on: #ola electric #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+