Ola S1 Gen 3 Scooters: ఓలా నుంచి 8 స్కూటర్లు.. ఒక్కో స్కూటర్ ఒక్కో ఆణిముత్యం.. ధర ఎక్కువేం కాదు!
మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. అందులో భాగంగా చాలా వరకు కంపెనీలు టాప్ క్లాస్ స్కూటర్లను మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. ఇటీవలె హోండా, సుజుకి, బజాజ్, టీవీఎస్ వంటి టాప్ బ్రాండ్స్ సైతం ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ప్రవేశించాయి. అయితే చాలా వరకు ఈ సెగ్మెంట్‌లో ఓలా ఎలక్ట్రిక్ తనదైన శైలిలో దూసుకెళ్తుంది. బెంగళూరుకు చెందిన ఈ బ్రాండ్ తక్కువ ధరలో టాప్ క్లాస్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది. అదే విధంగా ఈ స్కూటర్ కంపెనీకి ప్రతికూల రెస్పాన్స్ వస్తున్నప్పటికీ ఓలా వాటన్నింటినీ పరిష్కరించుకుంటూ రెట్టింపు ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తోంది.
ఇటీవల ఈ కంపెనీ తన మోడల్ లైనప్‌లో జెన్ 3 వెర్షన్లను లాంచ్ చేసింది. ఈ జనరేషన్‌లో మొత్తం 8 కొత్త మోడళ్లను ఓలా జోడించింది. ఈ స్కూటర్లు రూ.79,999 నుంచి రూ.1.69 లక్షల ధరతో (ఎక్స్-షోరూమ్, ఇండియా) విడుదల అయ్యాయి. ఇవి పాత జెనరేషన్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే మరింత స్మార్ట్‌గా వచ్చాయి.

ఈ జెన్ 3 మోడళ్లలో బ్రాండ్ బ్రేక్-బై-వైర్ టెక్నాలజీని అలాగే సింగిల్ ఇంటిగ్రేటెడ్ బోర్డును ప్రవేశపెట్టారు. ఓలా కొత్త మోడళ్లలో కొత్త సీట్లతో పాటు మొత్తం డిజైన్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దీని ద్వారా ఈ స్కూటర్‌లో మెరుగైన ఎర్గోనామిక్స్, కొత్త బాడీ గ్రాఫిక్స్ ద్వారా ఈవీలు లుక్‌లో సరికొత్త ఆవిష్కరణలు చేయగలిగాయని చెప్పాలి.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో గ్రాబ్ హ్యాండిల్స్, ఐదు కొత్త కలర్ ఆప్షన్లతో వస్తున్నాయి. వీటితో ఈ స్కూటర్ మూవ్‌ఓఎస్ 5 (MoveOS 5) అప్‌డేట్ ద్వారా స్మార్ట్ పార్క్, భారత్ మూడ్ (Bharat Mood), రోడ్ ట్రిప్ మోడ్, లైవ్ లొకెషన్ షేరింగ్ వంటివి ఉండనున్నాయి. ఈ అప్‌డేట్ ఫిబ్రవరి నుంచి అన్ని S1 సిరీస్‌లో అందుబాటులోకి రానుంది.

ఈ స్కూటర్లలోని బేస్ వేరియంట్ లోనూ బ్రేక్-బై-వైర్, ఇంటిగ్రేటెడ్ మిడ్-మౌంటెడ్ మోటార్, పొడవైన సీటు, కొత్త స్పోర్టీ డెకాల్, చైన్ డ్రైవ్, కలర్ LCD డిస్ప్లే వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ స్కూటర్లు 2 కిలోవాట్, 3 కిలోవాట్, 4 కిలోవాట్ అనే వేరియంట్లలో లభిస్తుంది. ఓలా ఎస్ 1ఎక్స్ ఈవీ 7 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 123 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
ఇక ఈ స్కూటర్లు బ్యాటరీ ప్యాక్‌ని బట్టి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 242 కిలోమీటర్ల నుంచి 320 కి.మీ రేంజ్‌ని అందిస్తుంది. ఈ స్కూటర్లు కేవలం 3 సెకన్లలో 0-40 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ మోడల్ (2 కిలోవాట్ల) బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ధర రూ.79,999గా ఉంది.

ఇక 3 కిలోవాట్ల, 4 కిలోవాట్ల బ్యాటరీ స్కూటర్ల ధరలు రూ.89,999, రూ.99,999గా ఉన్నాయి. ఈ జెన్ 3 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్స్‌లో ఎస్1 ఎక్స్ (2kWh) బేస్ వేరియంట్‌గా ఉంది. ఇక ఎస్ 1 ప్రో ప్లస్ టాప్ వేరియంట్ 5.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ధర రూ. 1,69,999 గా ఉంది.
S1X, S1 ప్రో 8 స్కూటర్లతో పాటు వాణిజ్య అవసరాల కోసం ఓలా ఎలక్ట్రిక్ గిగ్, ఓలా గిగ్+, ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్+ గిగ్, ఎస్1 జెడ్ స్కూటర్ రేంజ్ స్కూటర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 39,999, రూ. 49,999, రూ. 59,999, రూ. 64,999 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.
ఈ స్కూటర్లు వ్యక్తిగత, వాణిజ్య ఉపయోగం కోసం రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్స్‌ని కలిగి ఉన్నాయి. ఈ స్కూటర్లను కేవలం రూ. 499 చెల్లించి రిజర్వ్ చేసుకోవచ్చు. గిగ్ సిరీస్‌కి ఏప్రిల్ 2025లో S1 Z సిరీస్‌కి మే 2025లో డెలివరీలు ప్రారంభించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. వాణిజ్య మార్కెట్‌లోనూ ఓలా నంబర్1 గా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది.


Click it and Unblock the Notifications








