ఓలా ఆట షురూ.. చకచకా సిద్ధమవతున్న ఎలక్ట్రిక్ బైకులు.. త్వరలోనే వినియోగదారుల ముందుకు

ఎలక్ట్రిక్ టూ- వీలర్ తయారీలో బెంగుళూరుకు చెందిన ఓలా సంస్థ అదరగొడుతోంది. తక్కువ కాలంలోనే టూ- వీలర్ ఈవీల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ స్కూటర్లతో వినియోగదారులను ఆకట్టుకున్న ఈ సంస్థ.. ఇప్పుడు మరో అడుగు మందుకు వేసింది. ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను కూడా వినియోగదారుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతోంది. గతేడాది ఆగస్టులోనే.. ఓలా ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను తయారు చేస్తున్నట్లు ప్రకటించిందీ సంస్థ. అయితే.. ఇప్పుడు వీటి ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఇక త్వరలోనే ఈ బైకులు భారత రోడ్లపై ప్రయాణం మొదలుపెట్టనున్నాయి. ఈ బైకు ఫీచర్లు ఏంటి? వీటి ధర ఎంత ఉంటుంది? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఓలా ఎలక్ట్రిక్ బైకుల ఉత్పత్తిని ప్రారంభించినట్లు ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ తెలిపారు. ఈ మేరకు ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతున్న ఓ చిత్రాన్ని ఆయన సోషల్ మీడియో వేదికగా షేర్ చేశారు. "ఈ రోజు ఫ్యాక్టరీలో మొదటి బైకులు తయారు అవుతున్నాయి" అని ఆయన పేర్కొన్నారు.

Ola electric motorcycle roadster production

ఓలా ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల లైనప్‌లో మూడు మోడల్స్ ఉన్నాయి. అవి రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో. వీటి ధరలు వరుసగా రూ.74,999, రూ.1,04,999, రూ.1,99,999గా ఉన్నాయి. ఈ ధరలన్నీ ఎక్స్- షోరూమ్ వద్ద కావడం గమనార్హం. ఈ బైకుల బుకింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. జనవరిలోనే వీటి డెలివరీలు అందిస్తామని ఓలా సంస్థ గతంలో ప్రకటించింది.

ఓలా రోడ్‌స్టర్ ప్రో: ఈ లైనప్‌లో ఇది టాప్- ఎండ్ మోడల్ బైకు. దీంట్లోని మోటార్ 52kW పవర్, 105Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీంట్లోని 16kWh వేరియంట్ 1.2 సెకన్లలోనే 40km/h వేగాన్ని అందుకుంటుంది. 1.9 సెకన్లలో 60 కి.మీ.ల వేగాన్ని అందుకుంటుంది. ఇది 194km/h గరిష్ఠ వేగాన్ని అందిస్తుంది.

దీంట్లో 16kW వేరియంట్ 579 కి.మీ.ల ఐడీసీ- సర్టిఫైడ్ రేంజ్ అందిస్తుంది. రోడ్‌స్టర్ ప్రో బైకులో 10 అంగుళాల TFT టచ్‌స్క్రీన్‌తో ఉంటుంది. USD(upside down) ఫోర్క్స్, టూ- ఛానల్ స్విచ్ ఎనేబుల్ ఏబీఎస్ సిస్టం, ఫ్రంట్, రియర్‌లలో డిస్క్ బ్రేకులతో ఉంటుంది. హైపర్, స్పోర్ట్, నార్మల్, ఎకో అనే నాలుగు రైడింగ్ మోడ్స్‌ను ఈ బైకు అందిస్తుంది. దాంతోపాటు రెండు కస్టమైజ్ డ్ DIY మోడ్స్ కూడా ఉంటాయి.

ఓలా రోడ్‌స్టర్ : ఇది మిడ్- వేరియంట్ బైకు. ఇది తమ కమ్యూటర్ కేటగిరీలో ఫాస్టెస్ట్ మోటార్ సైకిల్‌గా ఓలా సంస్థ చెబుతోంది. ఇది 13kW బ్యాటరీతో ఉంటుంది. ఇది 3.4kWh, 4.5kWh, 6kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ బైకు.. 126km/h టాప్ స్పీడ్‌తో ప్రయాణిస్తుంది. 248 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది.

దీంట్లో 6kWh వేరియంట్ కేవలం 2 సెకన్లలోనే సున్నా నుంచి 40 కి.మీ.ల వేగాన్ని అందుకుంటుంది. దీంట్లో కూడా హైపర్, స్పోర్ట్స్, నార్మల్, ఎకో అనే నాలుగు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. దీంట్లో MoveOS 5 ఉంటుంది. అంతేగాకుండా ఇది 6.8 అంగుళాల TFT టచ్‌స్క్రీన్‌తో వస్తుంది. దీంట్లో ప్రాగ్జిమిటీ అన్ లాక్, క్రూయిజ్ కంట్రోల్, పార్టీ మోడ్, ట్యాంపర్ అలర్ట్స్ వంటి ఆప్షన్లు ఉంటాయి.

అంతేగాకుండా దీంట్లో Krutrim assistant, స్మార్ట్ వాచ్ అప్లికేషన్, రోడ్ ట్రిప్ ప్లానర్ వంటి AI-driven ఫంక్షనాలిటీస్ కూడా ఉంటాయి. ఫ్రంట్, రియర్ వైపున డిస్క్ బ్రేకులతో ఈ బైకు వస్తుంది. దీంట్లో అడ్వాన్స్‌డ్ సింగిల్ - ఛానల్ ఏబీఎస్, బ్రేక్ బై వైర్ టెక్నాలజీ కూడా ఉంటుంది.

ఓలా రోడ్‌స్టర్ ఎక్స్: ఈ బైకు 2.5kWh, 3.5kWh, 4.5kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 2.8 సెకన్లలో 40km/h వేగాన్ని అందుకుటంటుంది. ఇది 4.5kWh బ్యాటరీ వేరియంట్‌తో 200 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది. దీంట్లో 4.3 అంగుళాల LCD సెగ్మెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ఓలా మ్యాప్స్ నేవిగేషన్, అడ్వాన్స్ డ్ రీజనరేటివ్ బ్రేకింగ్, డీఐవై మోడ్, TPMS అలర్ట్స్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, January 22, 2025, 13:05 [IST]
English summary
Ola electric motorcycle roadster production commence know full details here
Read more on: #ola electric #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+