సింగిల్ ఛార్జ్‌‌తో 320 కి.మీలు.. రూ.999కే బుకింగ్.. ఓలా సంచలన స్కూటర్ లాంచ్!

భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ ఓలా (Ola) కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, మార్కెట్లో ఇతర కంపెనీలకు బలమైన పోటీ ఇవ్వడానికి అధునాతన సాంకేతికతతో కూడిన S1 ప్రో స్పోర్ట్ (ola s1 pro sport) అనే S1 ఎలక్ట్రిక్ స్కూటర్ స్పోర్టి వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ విడుదలతో ఓలా ఎలక్ట్రిక్ మళ్లీ ఒక కొత్త అడుగు వేసింది. S1 ప్రో స్పోర్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ధరను రూ.1.49 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. స్కూటర్ డెలివరీలు వచ్చే సంవత్సరం జనవరి 2026 నుండి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్రస్తుత వెర్షన్‌తో పోలిస్తే, ఈ కొత్త మోడల్ మరింత మెరుగైన డిజైన్‌తో వస్తోంది. స్పోర్టీ టచ్, స్టైలిష్ లుక్ కలిపి యువతరాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

ఓలా ఎలక్ట్రిక్ S1 ప్రో స్పోర్ట్ స్కూటర్‌ను స్టైలిష్ రైడ్‌కు మాత్రమే కాకుండా, హై-పర్ఫార్మెన్స్ మిషన్‌గా రూపొందించింది. ఇప్పటికే దీని బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కేవలం రూ.999 అడ్వాన్స్‌తో బుక్ చేసుకోవచ్చు. ఈ మోడల్‌లో ప్రత్యేకంగా తయారు చేసిన 13 kW ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. దీన్ని ఓలా స్వయంగా డిజైన్ చేసి, డెవలప్ చేసింది. ఈ మోటార్ గరిష్టంగా 16 kW పవర్, 71 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Ola Electric S1 Pro Sport Scooter Launched In India

సాధారణ స్కూటర్లతో పోలిస్తే, ఇది పూర్తిగా భిన్నమైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఈ స్కూటర్‌లో 4680 సెల్స్‌తో కూడిన 5.2 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఈ కొత్త బ్యాటరీ టెక్నాలజీ వలన పనితీరు మాత్రమే కాకుండా, రేంజ్ కూడా విపరీతంగా పెరిగింది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, ఈ స్కూటర్ 320 కిలోమీటర్లు వరకు ప్రయాణించగలదు. ఇది 152 kmph టాప్ స్పీడుతో దూసుకుపోతుంది.

ఇది 2 సెకన్లలోనే 0 నుంచి 40 kmph వేగం అందుకుంటుంది. దేశంలో పెట్రోల్ ధరలు భారీగా ఉన్న నేపథ్యంలో తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణ దూరాన్ని కోరుకునే వినియోగదారులకు ఉపయోగపడుతుంది. సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 320 కిలోమీటర్లు వరకు ప్రయాణించగలదంటే ప్రతి ఒక్కరికి కూడా బెస్ట్ స్కూటర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ధర కూడా దాదాపు అందుబాటు ధరలో లభిస్తుండటం కూడా బాగా కలిసి వస్తుంది.

Ola Electric S1 Pro Sport Scooter Launched In India

తొలిసారి ఆవిష్కరించబడిన Ola S1 Pro Sport స్కూటర్, తన ప్రామాణిక వెర్షన్‌తో పోలిస్తే మరింత అప్‌డేట్‌డ్ డిజైన్‌తో ముందుకు వచ్చింది. కొత్తగా రూపకల్పన చేయబడిన ఆప్రాన్, మధ్యలో బ్రాండ్ లోగోను కలిగి ఉండి, కెమెరా కుడి వైపున అమర్చబడింది. ఈ కెమెరా కేవలం లుక్ కోసమే కాదు, భవిష్యత్తు టెక్నాలజీకి దారితీసే ADAS(Advanced Driver Assistance Systems) ఫీచర్లను, ముఖ్యంగా ఢీకొనడం గుర్తించే సిస్టమ్‌ను సపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది.

ఇక ఈ స్మార్ట్ ఫీచర్‌లకు పూర్తి మద్దతు ఇవ్వడానికి, స్కూటర్‌లో తాజా MoveOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. దీని వలన రైడింగ్ అనుభవం మరింత ఆధునికంగా మారింది. రైడ్ కంఫర్ట్ పరంగా కూడా మార్పులు కనిపిస్తాయి. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు ఉండగా, వెనుక భాగంలో ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అమర్చారు. సేఫ్టీ విషయంలో ఎటువంటి రాజీ పడకుండా, ముందు-వెనుక రెండుచక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఇవ్వబడ్డాయి.

వీల్ సైజ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 14 అంగుళాల అల్లాయ్ వీల్ స్కూటర్‌కు ఒక స్పోర్టీ లుక్‌ను తీసుకొచ్చింది. రైడర్‌కు అవసరమైన అన్ని సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని, స్కూటర్‌లో 34 లీటర్ల పెద్ద స్టోరేజ్ స్పేస్‌ను అందించారు. రైడింగ్ పొజిషన్ కూడా సౌకర్యంగా ఉండేలా 791 mm సీటు ఎత్తుతో రూపొందించారు.

More from DriveSpark

Article Published On: Saturday, August 16, 2025, 15:31 [IST]
English summary
Ola electric s1 pro sport scooter launched in india price battery range features details
Read more on: #ola electric #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+