ఓలా ఎలక్ట్రిక్‌కు గట్టి షాక్ తగిలింది.. తగ్గిన స్కూటర్ విక్రయాలు.. వీటి కోసం మాత్రం కస్టమర్లు ఎగబడ్డారు

బెంగళూరు‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఇండియాలో ఇ-స్కూటర్ల సెగ్మెంట్‌లో అమ్మకాలతో దూసుకుపోతుంది. కంపెనీ మోడళ్లపై దేశంలో పలు ఆరోపణలు వచ్చిన్నప్పటికి వాటన్నింటిని నెమ్మదిగా పరిష్కరించుకుంటూ, ఇంకా కొత్త మోడళ్లను విడుదల చేస్తూ, ఈవీ టవీలర్ వాటాను క్రమంగా పెంచుకోవడానికి కీలకంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఇ స్కూటర్‌లో తన సత్తాను చాటుతున్న ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఇటీవల 'రోడ్‌స్టర్' అనే ఈవీ బైక్‌ను కూడా విడుదల చేసి సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇప్పుడు కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు బైక్స్ విభాగంలో ప్రత్యర్థులకు బలమైన పోటీగా నిలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓలా ఫిబ్రవరి నెలకు సంబంధించిన అమ్మకాల వివరాలను వెల్లడించింది. డేటా ప్రకారం, గత నెలలో ఓలా ఎలక్ట్రిక్ 25,000 కంటే ఎక్కువ స్కూటర్లను విక్రయించింది.

ఇది 2024 ఫిబ్రవరి నెలలో జరిగిన సేల్స్‌తో పోలిస్తే 25.86 శాతం తక్కువ కావడం గమనార్హం. అయితే ఏడాది ప్రాతిపదికన అమ్మకాలు తగ్గినప్పటికీ కంపెనీ దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో 28 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉండటం విశేషం. గత సంవత్సరం ఇదే నెలలో కంపెనీ 33,722 యూనిట్లను విక్రయించగా, ఈ సారి మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. ఇటీవల వచ్చిన ఆరోపణల కారణంగా సేల్స్ తగ్గినట్లు తెలుస్తోంది.

Ola Electric Sales

జనవరి నెలలో కూడా ఓలా ఎలక్ట్రిక్ 24,000కు పైగా అమ్మకాలను సాధించింది. ఫిబ్రవరి నెల అమ్మకాల్లో S1 సిరీస్ ఈ-స్కూటర్స్ కీలక పాత్ర పోషించాయి. మొత్తం అమ్మకాల్లో దాదాపు 4,000 కంటే ఎక్కువ సేల్స్‌ను నమోదు చేశాయి. మెజార్టీ కస్టమర్లు పలు వేరియంట్లలో లభిస్తున్న ఓలా S1 సిరీస్‌ను కొనుగోలు చేశారు. ఇది మార్కెట్లో S1X, S1 X ప్లస్, ప్రో, ప్రో ప్లస్ వంటి మోడళ్లలో కొనుగోలుకు లభిస్తుంది.

ఓలా S1X 2 కిలోవాట్(kWh), 3 కిలోవాట్(kWh) బ్యాటరీ ప్యాక్‌లో అందుబాటులో ఉంది. చిన్న బ్యాటరీ మోడల్ ధర రూ.79,999, పెద్ద ఆప్షన్ అయితే రూ.89,999 నుంచి ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఫుల్ ఛార్జ్‌తో 108 నుంచి 176 కి.మీల రేంజ్ వరకు అందిస్తాయి. అదే S1 X ప్లస్ రూ. 1,07,999 (ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది.

Ola Electric Sales Recorded 25000 Units

ఇది 4 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.1,07,999 (ఎక్స్-షోరూమ్). ఈ ఇ-స్కూటర్ పూర్తి ఛార్జ్‌తో ఏకంగా 242 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 125 కి.మీగా ఉంది. టాప్ వేరియంట్లు S1 ప్రో ధర రూ. 1,14,999 (ఎక్స్-షోరూమ్). దీనిలో 3 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. పూర్తి ఛార్జ్‌తో 176 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది.

ప్రో ప్లస్ వేరియంట్ విషయానికి వస్తే, ప్రారంభ ధర రూ.1,54,999. దీనిలో 4 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌తో వచ్చింది. ఫుల్ ఛార్జ్‌తో 242 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. కంపెనీ ఇటీవల ఎలక్ట్రిక్ బైక్స్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చి రోడ్‌స్టర్ X ను తీసుకొచ్చింది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది.

Ola Electric Roadster X

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, March 2, 2025, 7:30 [IST]
English summary
Ola electric sales recorded 25000 units in 2025 february more details here
Read more on: #ola electric #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+