ఓలా సంకల్ప్ 2025.. ఆగస్టు 15 మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్స్.. ఈ సారి ఏం లాంచ్ చేయబోతున్నారంటే ?
ఓలా ఎలక్ట్రిక్ అంటే మనకు గుర్తొచ్చేది ఎలక్ట్రిక్ స్కూటర్లే. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ఓలా ఒక పెద్ద పేరు. ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున కొత్త మోడళ్లను, టెక్నాలజీలను పరిచయం చేయడం ఓలాకు ఒక ఆనవాయితీగా మారింది. ఈ సంవత్సరం కూడా ఆగస్టు 15న 'సంకల్ప్ 2025' పేరుతో ఒక పెద్ద ఈవెంట్‌ను నిర్వహించనుంది. మరి ఈ ఈవెంట్‌లో ఓలా ఎలాంటి కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయబోతుంది? ఈసారి ఏం కొత్తగా ఆవిష్కరించనుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఓలా ఎలక్ట్రిక్ ఎప్పుడూ ముందుంటుంది. ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓలా తమ 'సంకల్ప్' అనే వార్షిక కార్యక్రమంలో కొత్త ఉత్పత్తులు, టెక్నాలజీలను ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం కూడా ఆగస్టు 15న క్రిష్ణగిరిలో ఉన్న ఓలా గిగాఫ్యాక్టరీలో 'సంకల్ప్ 2025' కార్యక్రమం జరగనుంది.

'సంకల్ప్ 2025' ఈవెంట్ ద్వారా ఓలా తమ 'ఇండియా ఇన్సైడ్' అనే విజన్‌ను ప్రజలకు చూపించనుంది. భారతదేశంలో మొదటి లిథియం-అయాన్ సెల్ ఉత్పత్తి చేసే గిగాఫ్యాక్టరీలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇది విద్యుత్, ఇంధన రంగంలో భారతదేశం సాధించబోతున్న స్వతంత్రానికి నిదర్శనమని ఓలా చెబుతోంది. ఈ కార్యక్రమాన్ని ఓలా ఎలక్ట్రిక్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు.
ఈ కార్యక్రమంలో కొత్త ఉత్పత్తుల గురించి ప్రకటనలు ఉంటాయని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఓలా స్కూటర్ మార్కెట్‌లో దూసుకుపోతోంది. ఈసారి కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లు లేదా ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు. అయితే, దీనిపై ఓలా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ మార్కెట్లో సంచలనం సృష్టించే ప్రొడక్ట్స్ తీసుకొస్తుందని అంచనా.

ఉత్పత్తుల ప్రకటనలు మాత్రమే కాకుండా, ఈ కార్యక్రమంలో ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఓలా గిగాఫ్యాక్టరీ, ఫ్యూచర్‌ఫ్యాక్టరీలను సందర్శించే అవకాశం ఉంటుంది. అలాగే ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్‌తో ఇంటరాక్షన్ సెషన్, టెక్నాలజీ ప్రదర్శనలు, కమ్యూనిటీతో కలిసి పాల్గొనే కార్యక్రమాలు ఉంటాయి.
ఓలా ఎలక్ట్రిక్ బ్యాటరీ సెల్‌లతో సహా ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి భాగాల ఉత్పత్తిలో ప్రత్యేకత కలిగి ఉంది. తమిళనాడులో ఉన్న ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీ భారతదేశంలోని అతి ముఖ్యమైన ఈవీ కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. బెంగళూరులో ఉన్న బ్యాటరీ ఇన్నోవేషన్ సెంటర్లో ఓలా బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. భారతదేశం, యూకే, అమెరికాలో ఓలా ఆర్&డీ సెంటర్లు ఉన్నాయి. భారతదేశం అంతటా ఓలాకు 4,000 కంటే ఎక్కువ స్టోర్స్ ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








