ఇక పెట్రోల్ బైక్స్‌కు గుడ్‌బై..! ఓలా కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్‌తో 200 కి.మీలు..

రైడ్ షేరింగ్ కంపెనీగా మొదలై అంచెలంచెలుగా ఎదిగి ఇండియాలో ఎలక్ట్రిక్ టూవీలర్స్ విభాగంలో టాప ప్లేస్‌లో ఉన్నటువంటి ఓలా ఎలక్ట్రిక్(Ola Electric) దేశంలో మరో సంచలన ఆవిష్కరణ చేసింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ బైక్‌ను తాజాగా విడుదల చేసి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ బైక్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. ఈ కొత్త మోడల్ పేరు 'ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ (Ola Roadster X)'. ఈ బైక్ రాకతో దేశంలో సాధారణ పెట్రోల్ బైక్‌లకు గట్టి పోటీ తప్పేలా లేదు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసి ప్రజల చూపును తన వైపు తిప్పుకునేలా చేసుకుంది. రోడ్‌స్టర్ ఎక్స్ ఎంట్రీ లెవల్ ధర రూ.74,999. ఇది ఎక్స్ షోరూమ్ ధర.

మరో విషయం ఏమిటంటే ఇండియాలో పెట్రోల్ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హీరో స్ప్లెండర్ బైక్ ధరకే, దీన్ని కూడా లాంచ్ చేయడం గమనార్హం. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ (Ola Roadster X) కొత్తగా టూవీలర్ కొనుగోలు చేయాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అవుతుందని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఇ-స్కూటర్స్ విభాగంలో ఇప్పటికే మంచి స్థానంలో ఉన్న ఓలా ఇప్పుడు కొత్త బైక్‌తో తన మార్కెట్‌ను మరింత పెంచుకుంటుంది.

Ola Electric Bike Roadster X Design Price

ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 200 కి.మీల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో కొనుగోలుకు లభిస్తుంది. బేస్ వేరియంట్‌లో 2.5 kWh బ్యాటరీ ఉంటుంది. దీన్ని పూర్తిగా ఛార్జింగ్ చేసినట్లయితే 140 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. అదే మిడిల్ స్పెక్ వేరియంట్ 3.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. దీని ధర రూ. 84,999 ఎక్స్-షోరూమ్.

ఇది బ్యాటరీ పూర్తి ఛార్జింగ్‌తో 196 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. అదే టాప్ వేరియంట్ 4.5 kWh బ్యాటరీ ప్యాక్‌‌తో వస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 252 కి.మీల వరకు రేంజ్‌ను అందిస్తుందని ఓలా ఎలక్ట్రిక్ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ధర రూ.95,999గా ఉంది. వీటితో పాటు కంపెనీ రోడ్‌స్టర్ X+ అనే వెర్షన్‌‌ను కూడా విడుదల చేసింది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో కొనుగోలుకు లభిస్తుంది.

Ola First Electric Bike Roadster X

రోడ్‌స్టర్ X+ 4.5 kWh బ్యాటరీ ప్యాక్ ధర రూ.1.05 లక్షలు ఇది సింగిల్ ఛార్జ్‌తో 252 కి.మీల వరకు ప్రయాణిస్తుంది అలాగే , 9.1 kWh బ్యాటరీ ప్యాక్ ధర రూ.1.55 లక్షలుగా ఉంది. ఇది పూర్తి ఛార్జ్‌తో ఏకంగా 501 కి.మీల హై రేంజ్ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటాయి.

ఈ కొత్త బైక్స్‌లలో లేటెస్ట్ ఫీచర్స్‌కు ఎలాంటి కొదవ లేదు. రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్‌లో స్పోర్ట్స్, నార్మల్, ఎకో అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అలాగే, రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ వేరియంట్‌లో అడ్వాన్స్‌డ్ రీజెన్, ఎనర్జీ ఇన్‌సైట్స్, రివర్స్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయని ఓలా పేర్కొంది. ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్, TPMS,LCD స్క్రీన్ వంటివి ఉన్నాయి.

Ola Roadster X Details

ఓలా రోడ్‌స్టర్ X 2.5 kWh బ్యాటరీ వెర్షన్‌ టాప్ స్పీడ్ 105 kmph,3.5 kWh వేరియంట్ టాప్ స్పీడ్ 118 kmph, ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ గరిష్ట వేగం గంటకు 125 కి.మీగా ఉంది. ఓలా రోడ్‌స్టర్ X, X+ రెండు కూడా టెలిస్కోపిక్ ఫోర్క్స్‌తో కూడిన మెరుగైన సస్పన్షన్ సెటప్‌తో వచ్చాయి. కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS), బ్రేకింగ్ కోసం డిస్క్ బ్రేకులను అందించారు.

More from DriveSpark

Article Published On: Wednesday, February 5, 2025, 14:54 [IST]
English summary
Ola first electric bike roadster x launched in india starting price at rs 74999
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+