స్మార్ట్ ఫోన్ ధర కన్నా తక్కువకే ఎలక్ట్రిక్ స్కూటర్లు.. కానీ ఇప్పుడు బుక్ చేసుకుంటే డెలవరీ ఎప్పటికో.. కారణం ఇదే
ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) స్కూటర్లు అంటే యువతకు చాలా క్రేజ్. చూడగానే ఆకర్షించే డిజైన్, మంచి ఫీచర్లతో ఓలా స్కూటర్లు చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. గత సంవత్సరం (2025) ఓలా కంపెనీ మరికొంత మంది కస్టమర్లను ఆకర్షించడానికి గిగ్ (Gig), S1 Z (ఎస్1 జెడ్) అనే రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేసింది. వాస్తవానికి ఈ స్కూటర్ల డెలివరీలు ఈ 'మే' నెలలోనే మొదలవ్వాలి.
కానీ, ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్. డెలివరీలు సంవత్సరం చివరికి వాయిదా పడ్డాయి. మరి ఈ రెండు కొత్త ఓలా స్కూటర్ల విశేషాలు ఏంటి? వాటి డెలివరీలు ఎందుకు ఆలస్యమవుతున్నాయో ఈ వార్తలో తెలుసుకుందాం.

ఓలా ఎలక్ట్రిక్ అనేది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ. దేశీయ మార్కెట్‌లో ఈ-బైక్‌లు, స్కూటర్లను అమ్ముతోంది. ఇవి చాలా ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో వస్తాయి, కస్టమర్లు కూడా వీటిని ఇష్టపడి కొంటున్నారు. గత సంవత్సరం (2025) మరింత మంది కస్టమర్లను చేరుకోవడానికి కంపెనీ గిగ్ (Gig, S1 Z (ఎస్1 జెడ్) అనే రెండు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేసింది.
అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే, కొత్త ఓలా గిగ్, S1 Z ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు ఈ 'మే' నెలలోనే ప్రారంభం కావాలి. కానీ, పలు కారణాల వల్ల వీటిని సంవత్సరం చివరికి వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం, కంపెనీ 'రోడ్‌స్టర్' (Roadster) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఉత్పత్తి, అమ్మకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే ఈ స్కూటర్ల డెలివరీ ఆలస్యం అయిందని అంటున్నారు.
ఓలా గిగ్ (Ola Gig) ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 39,999 లక్షల నుంచి రూ. 49,999 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 1.5 kWh (కిలో వాట్ అవర్) సామర్థ్యం గల పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఉంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 112 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ 25 kmph (కిలోమీటర్ పర్ అవర్).

ఈ స్కూటర్‌లో రౌండ్ LED హెడ్‌లైట్, LED స్క్రీన్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. దీనికి ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ సెటప్, 12-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది.
ఓలా S1 Z (Ola S1 Z) ఇ-స్కూటర్ ధర రూ. 59,999 నుంచి రూ. 64,999 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది 1.5 kWh సామర్థ్యం గల రెండు బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 75 నుంచి 146 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
ఈ కొత్త ఇ-స్కూటర్ వివిధ వేరియంట్ల ఆప్షన్లలో లభిస్తుంది. దీని టాప్ స్పీడ్ 70 kmph. కేవలం 4.7 సెకన్లలో 0 నుండి 40 kmph వేగాన్ని అందుకుంటుంది. సిల్వర్ కలర్ పెయింట్ స్కీమ్‌లో వస్తుంది.
ఇందులో LCD స్క్రీన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ సెటప్ ఉంది. దీనితో పాటు 14-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: ఓలా గిగ్, S1 Z స్కూటర్లు బడ్జెట్ ధరలో మంచి రేంజ్, ఫీచర్లతో వస్తున్నాయి. అయితే, డెలివరీల ఆలస్యం కస్టమర్లకు కొంత నిరాశ కలిగించవచ్చు. 'రోడ్‌స్టర్' మోటార్‌సైకిల్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ ఆలస్యం జరుగుతుందని తెలుస్తోంది. ఈ స్కూటర్లు మార్కెట్‌లోకి వస్తే, ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో ఓలాకు మరింత బలం చేకూరుతుంది.


Click it and Unblock the Notifications








