ఓలా నుంచి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది... రైడ్ చేయడానికి రెడీగా ఉండండి.. ఫొటోల్లో ఎంత ముద్దొస్తుందో..!

ఎలక్ట్రిక్ టూ-వీలర్ రంగంలో బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ సంస్థ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమ విభిన్న ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లతో వినియోగదారులకు చేరువైంది. సేల్స్ పెంచుకుని ఈవీల్లో టాప్‌లో కొనసాగుతోంది. త్వరలోనే తమ బ్రాండ్ నుంచి ఎలక్ట్రిక్ బైకును లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించిందీ సంస్థ. ఈ ప్రకటన విన్నప్పటి నుంచి ఫ్యాన్స్ అంతా ఈ బైకు ఎప్పుడెప్పుడు వస్తుందా? ఎలా ఉండబోతుందా? అనే వివరాలు తెలుసుకోవడానికి తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. త్వరలోనే ఈ బైకు లాంఛ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ బైకు ఫొటోలను రిలీజ్ చేసింది. ఆ వివరాలు చూసేద్దాం.

ఓలా ఎలక్ట్రిక్ సంస్థ.. అనతి కాలంలోనే ఈవీల్లో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. పెట్రోల్ ఇంజిన్ల వాహనాలను కలుపుకుని చూసినా.. భారత్‌లో టాప్ 10 టూ- వీలర్ కంపెనీల్లో ఓలా పేరు ఉంటుంది. తాజాగా ఈ సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్ తమ సంస్థ నుంచి రాబోతున్న ఎలక్ట్రిక్ బైక్ ఫోటోలను విడుదల చేశారు. ఈ బైక్‌ విశేషాలు, ఇతర స్పెసిఫికేషన్స్‌ ఎలా ఉన్నాయంటే?

Ola New Electric Bike Images

ఓలా ఎలక్ట్రిక్ హెడ్‌క్వార్టర్ బెంగళూరులో ఉండగా దీని మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ తమిళనాడులోని హూసూర్‌లో ఉంది. ఇక్కడ తయారైన ఎలక్ట్రిక్ స్కూటర్లు దేశవ్యాప్తంగా విక్రయిస్తారు. ఇదే ఫ్యాక్టరీలో ఓలా ఎలక్ట్రిక్ బైకు ఉత్పత్తిని కూడా ఓలా సంస్థ ఇటీవల ప్రారంభించింది.

ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో జోరు ప్రదర్శించిన ఓలా సంస్థ.. ఇప్పుడు తమ బ్రాండ్ నుంచి రాబోతున్న బైకుతో ఎలక్ట్రిక్ బైకుల్లోనూ తన సత్తా చాటాలని భావిస్తోంది. ఈ బైకు తయారవుతున్న ఫోటోలను సీఈఓ భవీష్ అగర్వాల్ తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు.

Ola New Electric Bike Images

పసుపు రంగులో ఈ బైక్ ఫోటోలు కనిపిస్తున్నాయి. దీంట్లో హ్యాండిల్ బార్స్ కింద arrow-shaped ప్యానెల్స్ ఉన్నాయి. అట్రాక్టివ్ లుక్‌లో ఇది కనిపిస్తోంది. ఈ పోటోను భవీష్ అగర్వాల్ షేర్ చేస్తూ.. "త్వరలోనే దీన్ని నేను రైడ్ చేయబోతున్నాను. Arrowhead @Ola Electric" అని రాసుకొచ్చారు.

ఈ పోస్ట్ కింద నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒక వ్యక్తి "నేను ఇది ఎరుపు రంగులో వస్తుందని ఊహించాను" అని రాశారు. అయితే ఈ బైకును ఏయే కలర్ ఆప్షన్లతో తీసుకువస్తోందనే విషయంలో ఓలా సంస్థ ఇంకా వివరాలు వెల్లడించలేదు.

ఈ ఫోటోల్లో పసుపు రంగులో కనిపించడంతో... ఇది కచ్చితంగా ఎల్లో కలర్ ఆప్షన్‌తో ఉంటుందనైతే చెప్పవచ్చు. ఈ ఫోటోలో బైకుపై ఓలా ఎలక్ట్రిక్ లోగో కూడా కనిపించలేదు. అందువల్ల ఈ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది.

డ్రైవ్ స్పార్క్ వ్యాఖ్య: త్వరలోనే తమ తొలి ఎలక్ట్రిక్ బైకును రైడ్ చేయబోతున్నాని భవీష్ అగర్వాల్ రాసుకొచ్చారు కాబట్టి... త్వరలోనే మనం దీన్ని ఆయన రైడ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలను చూసే అవకాశం ఉంది. ఓలా సంస్థ ఈ కొత్త బైకుతో పాటు మరో రెండు ఎలక్ట్రిక్ బైకులను కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది‌.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, January 30, 2025, 19:09 [IST]
English summary
Ola new electric bike production pics revealed by ceo bhavish aggarwal check design here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+