దమ్మున్న ఓలా రోడ్‌స్టర్ Vs దుమ్ములేపే హీరో స్ప్లెండర్.. ఈ రెండు బైకులలో ఏది కొంటే బెటర్‌?

ఓలా ఎలక్ట్రిక్.. ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో బెంగళూరుకు చెందిన ఈ సంస్థ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన ఈవీలు భారత వినియోగదారులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సంస్థకు లాభాల్ని కూడా తెచ్చిపెట్టాయి. ఇదే జోష్‌తో ఈ సంస్థ.. రోడ్‌స్టర్ పేరుతో ఎలక్ట్రిక్ బైక్‌ను త్వరలో కూడా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. అలాగే హీరో స్ప్లెండర్.. ఈ బైకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఏళ్లుగా పల్లెల నుంచి పట్టణాల వరకు అందరికీ చేరువైన టూ- వీలర్. ఇప్పుడు ఓలా నుంచి ఎలక్ట్రిక్ బైకు రానున్న నేపథ్యంలో.. ఈ ఎలక్ట్రిక్ బైకుకు, చాలా మందికి ఫేవరేట్‌గా పేరుగాంచిన స్ప్లెండర్ బైకుకు మధ్య ఉన్న పోలికలు, తేడాలు ఏంటో ఈ కథనంలో చూసేద్దాం.

పవర్ ట్రెయిన్: ఈ ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ బైకు.. 4 బ్యాటరీ ఆప్షన్లతో రానుంది. అవి.. 2.5kWh, 3.5kWh, 4.5kWh and 9.1kWh. అదే విధంగా ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్.. 7kW, 11kW అనే రెండు కెపాసిటీలతో అందుబాటులో ఉండనుంది. ఈ ఈవీ బైక్స్‌ ఫర్పామెన్స్‌ పరంగా మంచి అవుట్‌పుట్‌ని అందిస్తుంది.

Ola Roadster Vs Hero Splendor Motorcycle

మరోవైపు హీరో స్ప్లెండర్ బైకు 94.2 సీసీ సింగిల్- సిలిండర్ ఇంజిన్‌తో ఉంటుంది. ఈ ఇంజిన్ 7.91 BHP గరిష్ఠ పవర్, 8.05 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే.. ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ బైకు గరిష్ఠంగా ఎంత మేర టార్క్ ఉత్పత్తి చేస్తుందనే సమాచారం లేదు. కానీ రెండు బైక్స్‌ ఈ విషయంలో బెస్ట్ అని చెప్పవచ్చు.

మైలేజీ/రేంజ్: రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ బైకు.. 252 నుంచి 501 కి.మీ.ల రేంజ్ అందించగలదని ఓలా సంస్థ చెబుతోంది. అంటే... దీన్ని ఫుల్‌ఛార్జ్ చేస్తే ఇది అందించే గరిష్ఠ దూరం 501 కి.మీ.లుగా చెప్పవచ్చు. అయితే.. వాస్తవ పరిస్థితుల్లో ఈ రేంజ్ కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. ఇక స్ప్లెండర్ బైకు విషయానికి వస్తే ఇది లీటరుకు 60 కి.మీ.ల మైలేజీ అందించగలదు.

Ola Roadster Vs Hero Splendor

సస్పెన్షన్: రోడ్‌స్టర్ బైకు ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్‌తో ఉంటుంది. వెనుకవైపు షాక్ అబ్సార్బర్స్ ఉంటాయి. అదే సమయంలో స్ప్లెండర్ బైకు.. ముందు వైపున టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్సార్బర్స్ ఉంటాయి. వెనుకవైపు అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ అబ్సార్బర్స్ ఉంటాయి. రెండు బైక్స్‌ సస్పెన్షన్స్‌లో ఆన్‌ పేపర్‌ పరంగా బాగానే ఉన్నాయని చెప్పవచ్చు.

ధర: ఓలా రోడ్‌స్టర్ బైకు X, X+ అనే రెండు వేరియంట్లలో లాంఛ్ చేయనున్నారు. ఈ బైకు ధర రూ.74,999 నుంచి రూ.1,54,999 మధ్య ఉండనుంది. ఇక స్ప్లెండర్ బైకు విషయానకి వస్తే దీని ఎక్స్- షోరూమ్ ధర రూ.74,931 నుంచి రూ. 76,449 మధ్య ప్రస్తుతం కొనసాగుతోంది.

Ola Roadster Vs Hero Splendor Motorcycle

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: ఓలా రోడ్‌స్టర్ బైకు, హీరో స్ప్లెండర్ బైకు కచ్చితంగా పోటీ అని చెప్పలేం. అయితే.. ప్రస్తుతం టాప్‌లో కొనసాగుతున్న స్ప్లెండర్ స్థానాన్ని రానున్న రోజుల్లో ఓలా రోడ్‌స్టర్ ఆక్రమించే అవకాశం ఉంది. ఓలా సంస్థ.. ఈ రోడ్‌స్టర్ బైకులో వివిధ వేరియంట్లను రానున్న రోజల్లో తీసుకురానుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, February 6, 2025, 11:15 [IST]
English summary
Ola roadster vs hero splendor motorcycles features and price comparison in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+