ఓలా షోరూమ్‌లలో కొత్త సంచలనం.. ఈ ఎలక్ట్రిక్ బైక్ చూస్తే మనసు ఆగదు.. కొనకుండా ఉండలేరు!

ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ మరో సంచలనానికి తెరలేపింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోడ్‌స్టర్ ఎక్స్ (Roadster X) ఎలక్ట్రిక్ బైక్‌ను త్వరలో విడుదల చేయనుంది. ధరలు ప్రకటించినప్పటికీ, డెలివరీలు ఆలస్యమవుతున్న ఈ బైక్ ఇప్పుడు నేరుగా షోరూమ్‌లకు చేరుకోవడం ప్రారంభించింది. దీంతో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడానికి వచ్చిన వారంతా ఈ స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్‌ను చూసి ముగ్ధులవుతున్నారు.

ఓలా ఎలక్ట్రిక్ తన రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్‌ను త్వరలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ బైక్ ధరలు ఇప్పటికే ప్రకటించినప్పటికీ డెలివరీలు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే, ఈ నిరీక్షణ త్వరలోనే ముగియనుంది. ఎందుకంటే ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్‌లు షోరూమ్‌లకు చేరుకోవడం మొదలైంది.

Ola Roadster X Arrives at Showrooms

తాజాగా, ఒక ఓలా షోరూమ్ నుండి రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. పెద్దగా హంగులు లేని, తక్కువ ధర కలిగిన ఈ రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో కొలువుదీరింది. దీని ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.74,999మాత్రమే. ఇది మాత్రమే కాకుండా, ఈ ఎలక్ట్రిక్ బైక్ మిడ్-వేరియంట్, ప్రీమియం వేరియంట్‌లలో కూడా విక్రయానికి ఉంది. ఈ వేరియంట్‌లు కూడా ఒక్కొక్కటిగా షోరూమ్‌లకు చేరుకోవడం మొదలవుతాయి.

చాలా కాలం క్రితం, ఓలా ఎలక్ట్రిక్ తన కర్మాగారంలో రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్‌ల ఉత్పత్తిని ప్రారంభించినట్లు చిత్రాలతో సహా ప్రకటించింది. తమిళనాడులోని హోసూర్‌లోని ఓలా కర్మాగారంలో తీసిన ఆ చిత్రంలో మొదటగా ఉత్పత్తి అయిన రోడ్‌స్టర్ ఎక్స్ బైక్‌లను చూడవచ్చు.

Ola Roadster X Arrives

బైక్ వేరియంట్‌ను బట్టి, దానిలో అమర్చబడే బ్యాటరీ కెపాసిటీ కూడా మారుతుంది. ఎంట్రీ-లెవెల్ వేరియంట్‌లో 2.5kWh బ్యాటరీ అమర్చబడి ఉంటుంది. దీనిని పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 140 కిమీ దూరం ప్రయాణించవచ్చని ఓలా సంస్థ పేర్కొంది. ఈ తక్కువ ధర కలిగిన రోడ్‌స్టర్ ఎక్స్ బైక్‌లో గంటకు 0 నుంచి 40కిమీ వేగాన్ని 3.4 సెకన్లలో చేరుకోవచ్చు.

ఈ వేరియంట్ గరిష్ట వేగం గంటకు105కిమీ. మిడ్-వేరియంట్‌లో 3.5kWh కెపాసిటీ కలిగిన బ్యాటరీ అమర్చబడి ఉంటుంది. పూర్తిగా ఛార్జ్ చేస్తే 196 కిమీ దూరం ప్రయాణించగల ఈ మిడ్-వేరియంట్ ధర రూ. 84,999. 0 నుండి 40kmph వేగాన్ని 3.1 సెకన్లలో చేరుకోగల ఈ మిడ్-వేరియంట్ గరిష్ట వేగం 118kmph.

Ola Roadster X Front

రోడ్‌స్టర్ ఎక్స్ బైక్ అత్యంత ఖరీదైన టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 94,999. ఇందులో 4.5kWh కెపాసిటీ కలిగిన బ్యాటరీ అమర్చబడి ఉంటుంది. దీనిని పూర్తిగా ఛార్జ్ చేస్తే 252 కిమీ దూరం ప్రయాణించవచ్చు. 0 నుండి 40kmph వేగాన్ని 3.1 సెకన్లలో చేరుకోగల ఈ టాప్ వేరియంట్ గరిష్ట వేగం కూడా 118kmph.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య : ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్‌లో ఏ వేరియంట్‌ను కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకోవడం కొంచెం కష్టమైన విషయమే. పైన పేర్కొన్నవి బైక్ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే, ఆన్-రోడ్ ధర మరో కొన్ని వేల రూపాయలు ఎక్కువగా ఉన్నప్పటికీ, రోడ్‌స్టర్ ఎక్స్ చాలా మందికి అందుబాటు ధరలోనే ఉంది.

Ola Roadster X Arrives

దానికి ముఖ్య కారణం, ఈ ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్-షోరూమ్ ధరలను ఓలా ఎలక్ట్రిక్ సంస్థ తక్కువగా నిర్ణయించడం. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎక్కువగా ఉండబోతున్నందున, ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ భవిష్యత్తులో ప్రస్తుత హీరో స్ప్లెండర్ వలె చాలా ఎక్కువ మంది కొనుగోలు చేసే బైక్‌గా మారవచ్చు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 16, 2025, 7:02 [IST]
English summary
Ola roadster x arrives at showrooms electric scooter buyers are going to choose this
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+