డప్పు వాయిద్యాలతో సందడిగా ఓలా షోరూమ్‌లు.. ఎంతగానో ఎదురుచూసిన బైకు‌ను చేతుల్లోకి తీసుకున్న కస్టమర్లు

ఓలా ఎలక్ట్రిక్ తాజాగా ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో మరో ముఖ్యమైన అడుగు వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ బైక్ రోడ్‌స్టర్ X(Roadster X) ను మార్కెట్‌కు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో దేశవ్యాప్తంగా తన సత్తాను చాటుతున్న కంపెనీ ఇప్పుడు రోడ్‌స్టర్ ఎక్స్ మోడల్ ద్వారా పెట్రోల్ బైకులకు గణనీయమైన పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న ఓలా డీలర్‌షిప్‌ల ద్వారా వినియోగదారులకు రోడ్‌స్టర్ X బైక్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ఇ-బైక్ డిజైన్ చూసినవారంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేలా చేసే ఆకట్టుకుంటుంది. స్పోర్టీ లుక్స్, మోడర్న్ ఫినిషింగ్, యూత్‌ఫుల్ స్టైల్‌ను ఈ బైక్ ప్రతిబింబిస్తుంది.

దీనితోపాటు, అందరికీ అందుబాటులో ఉండేలా ఓలా ఎలక్ట్రిక్ ఈ మోడల్‌ను సరికొత్త ధరకే విడుదల చేసింది. వాస్తవానికి, ఈ బైక్ డెలివరీలు శుక్రవారం నాడే అధికారికంగా ప్రారంభమైనప్పటికీ, ఆదివారం నాడు పలువురు కొనుగోలుదారులు తమ బైక్‌లను స్వీకరించారు. ఆనందంలో మునిగిపోయిన వారు తమ కొత్త బైక్‌ల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఓలా ఎలక్ట్రిక్‌పై తాము ఉంచిన నమ్మకాన్ని మరోసారి తెలియజేశారు.

Ola Roadster X Delivery Details

బైకు డెలివరీ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్‌ల వద్ద గతవారం ఒక పండగ వాతావరణం నెలకొంది. శుక్రవారం నుంచి ప్రారంభమైన రోడ్‌స్టర్ X మోడల్ డెలివరీలతో, దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లు సందడితో మార్మోగిపోయాయి. కొనుగోలుదారుల కళ్లలో ఆనందం మెరుపులా మెరిసింది, ఎందుకంటే వారు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తమ కలల బైక్‌ను చివరకు చేతుల్లోకి తీసుకున్న సందర్భం అది. డీలర్‌షిప్ సిబ్బంది కూడా ఈ సందర్భంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

బైక్ కీలు వినియోగదారుల చేతుల్లో పెట్టిన ప్రతిసారీ, వారి ముఖాల్లో కనిపించే సంతోషం చూసి వారి ఆనందం రెట్టింపు అయింది. కొత్త బైక్‌ను స్వీకరించిన వినియోగదారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగుతూ, వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఓలా షోరూమ్‌ల ముందు చిన్నపాటి వేడుకలే జరుగుతున్నట్టుగా అనిపించింది. అంతకు ముందు మొదటి 5,000 మంది కస్టమర్లకు రూ.10,000 విలువైన ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడంతో, బుకింగ్‌లకు గిరాకీ ఏర్పడింది.

Ola Roadster X Delivery Started

ఓలా ఎలక్ట్రిక్ బైక్ రోడ్‌స్టర్ X గురించి చూసినట్లయితే, ఇది అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో కూడిన మోడల్. దీని ప్రారంభ ధర వచ్చేసి రూ.84,999 నుంచి ప్రారంభమవుతూ, బ్యాటరీ ప్యాక్‌కు అనుగుణంగా గరిష్టంగా రూ. 1.05 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్, బెంగళూరు) ఉంటుంది. ఈ ధర, రోడ్‌స్టర్ X బైక్‌ను మార్కెట్లో అత్యంత స్మార్ట్ ఎంపికగా నిలబెడుతోంది. ఈ బైక్‌కి సంబంధించి మూడు రకాల బ్యాటరీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

మొదటి బ్యాటరీ ప్యాక్ 2.5 కిలోవాట్ గంటల (kWh)‌తో వస్తోంది. ఇది పూర్తి ఛార్జ్‌పై సుమారు 117 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అంటే రోజూ నగర ప్రయాణాలు చేసే వారికి ఇది మంచి ఆప్షన్. రెండోది 4.5 kWh కెపాసిటీగల శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ ఉంది. పూర్తి ఛార్జ్‌తో 159 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. రోజూ ఎక్కువ దూరం ప్రయాణాలు చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Ola Roadster X Electric Motorcycle

మూడో వేరియంట్, కూడా 4.5 kWh బ్యాటరీ ప్యాక్ ఆధారంగా ఉన్నప్పటికీ, ఇది 200 కిలోమీటర్ల దాక ప్రయాణించగల కెపాసిటీని కలిగి ఉంది. బహుశా ఇది ఓలా ఇప్పటివరకు విడుదల చేసిన మోడల్స్‌లో అత్యధిక రేంజ్ కలిగిన బైక్ కావచ్చు. ఈ విధంగా, రోడ్‌స్టర్ X బైక్ ధర, రేంజ్ పరంగా విభిన్న అవసరాలను తీర్చగల మల్టీ-వేరియంట్ ఆప్షన్లను వినియోగదారులకు అందిస్తూ, ఓలా మరోసారి మార్కెట్‌ను తనవైపు తిప్పుకుంది.

More from DriveSpark

Article Published On: Monday, May 26, 2025, 15:41 [IST]
English summary
Ola roadster x electric motorcycle deliveries started in india more details inside
Read more on: #ola electric #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+