లగ్జరీ అంటే ఇదే..కోట్లు పెట్టినా దొరకదు.. ప్రపంచంలోనే అతి అరుదైన డుకాటి బైక్‌ మనోడి సొంతం

డుకాటి బైక్స్ గురించి తెలియని వారుండరు అంతే అతిశయోక్తి కాదు. అవి ఎంత అందంగా ఉంటాయో అంతే ఖరీదు కూడా ఉంటాయి. అందుకే మన దేశంలో ఆ బైక్‎లను కొనేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా యూత్ ఈ బైక్ మీద తమ లవర్‎తో రైడ్‎కు వెళ్లాలని కలలు కంటుంటారు.

ఒకవేళ ఎవరి దగ్గరైనా ఉంటే ఒక్కసారి అడిగైనా రైడ్ చేయాలని అనుకుంటారు. అయితే ప్రస్తుతం ఒక భారతీయుడు ఏకంగా అలాంటి ఓ రేరెస్ట్ డుకాటి బైక్‌ను కొనేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఆ బైక్ ఏంటో తెలుసా ?

కొంతమందికి గుర్తుండే ఉంటుంది. 2023లో డుకాటి అనే లగ్జరీ బైక్ కంపెనీ, బెంట్లీ అనే లగ్జరీ కార్ల కంపెనీతో కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఈ రెండు కలిసి ఒక స్పెషల్ డుకాటి బైక్‌ను, బెంట్లీ కారును తయారు చేయాలని డిసైడ్ అయ్యాయి. అంటే ఈ రెండు కంపెనీల డిజైన్‌లను కలిపి ఒక బైక్‌ను, ఒక కారును రూపొందించారన్నమాట.

Rare Ducati Diavel for Bentley

దీని ప్రకారం డుకాటి వాళ్ల సూపర్ హిట్ బైక్ అయిన డయావెల్‌కు ఒక లిమిటెడ్ ఎడిషన్‌ను తీసుకొచ్చారు. దాని పేరే 'డయావెల్ ఫర్ బెంట్లీ'. ప్రపంచవ్యాప్తంగా ఈ బెంట్లీ కోసం కేవలం 500 డయావెల్ బైక్‌లను మాత్రమే తయారు చేశారు. అలాంటి అరుదైన బైక్‌ను మన ఇండియన్ ఒకాయన కొనేశాడు.

ఢిల్లీలో ఉన్న ఒక డుకాటి షోరూమ్ నుండి ఆ వ్యక్తి తన కొత్త డుకాటి డయావెల్ ఫర్ బెంట్లీ బైక్‌ను డెలివరీ తీసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను పోస్ట్ చేసింది ఎవరో కాదు, ఆ డుకాటి డీలర్‌షిప్ వాళ్లే. ఆ వీడియోలో ఆ బెంట్లీ డయావెల్ బైక్ ఒక ప్రత్యేకమైన స్కార్ప్ గ్రీన్ కలర్‌లో మెరిసిపోతూ కనిపిస్తోంది.

ఇంకో విషయం ఏంటంటే, డుకాటి, బెంట్లీ కలిసి తయారు చేసిన ప్రతి డయావెల్ ఫర్ బెంట్లీ బైక్‌కు ఒక సీరియల్ నంబర్ ఇచ్చారు. ఇప్పుడు ఢిల్లీలో డెలివరీ అయిన ఈ పచ్చ రంగు బెంట్లీ డయావెల్ బైక్‌పై కూడా '417/500' అని రాసి ఉంది. అంటే మొత్తం 500 బైక్‌లను తయారు చేయాలని ప్లాన్ చేస్తే ఇది 417వ బైక్ అన్నమాట.

ప్రతి బైక్‌కు నంబర్ ఇవ్వడమే కాకుండా, బెంట్లీ కోసం తయారు చేసిన ఈ డయావెల్ బైక్‌లను విదేశాల్లోని డుకాటి ఫ్యాక్టరీలో చాలా జాగ్రత్తగా తయారు చేశారట. అందుకే ఈ లిమిటెడ్ ఎడిషన్ బైక్ ధర అక్షరాలా 58 వేల పౌండ్లు. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 61 లక్షల 44 వేలు.. రేటు విషయానికి వస్తే మామూలు బైక్ కాదని అర్థం అవుతుంది.

బెంట్లీ ఇప్పటివరకు తయారు చేసిన మోస్ట్ పవర్ఫుల్ కారు 'బాటూర్' డిజైన్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ డయావెల్ ఫర్ బెంట్లీ లిమిటెడ్ ఎడిషన్ బైక్‌ను తయారు చేశారు. లుక్‌లో ఇది చాలా స్పెషల్‌గా కనిపిస్తుంది కానీ, దీని ఇంజిన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. అంటే రెగ్యులర్ డుకాటి డయావెల్ బైక్‌లో ఉండే 1,158cc V4 గ్రాండ్‌టురిస్మో ఇంజిన్‌నే దీనిలో కూడా పెట్టారు.

ఈ ఇంజిన్ 10750 rpm వద్ద 166.28 BHP పవర్‌ను, 7500 rpm వద్ద 126 Nm టార్క్‌ను ఇస్తుంది. ఇంకా ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. గంటకు 299 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకుపోయే ఈ బైక్, పబ్లిక్‌గా అమ్మకానికి పెట్టిన ప్రపంచంలోనే టాప్ స్పీడ్ స్పోర్ట్స్ బైక్‌లలో ఒకటి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం : డుకాటి బైక్‌లు రోడ్డు మీద వెళ్తుంటేనే చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇక ఇది స్పెషల్ గ్రీన్ కలర్‌లో ఉంది కాబట్టి, రోడ్డు మీద ఎవరైనా దీనిని చూస్తే ఒక్క క్షణం ఆశ్చర్యపోకుండా ఉండలేరు. అలాంటి ఒక అద్భుతమైన బైక్ మన భారతీయ రోడ్ల మీద తిరుగుతుందంటే నిజంగా గ్రేట్ కదా!

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 13, 2025, 7:02 [IST]
English summary
Rare ducati diavel for bentley one of 500 worldwide delivered to indian owner
Read more on: #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+