ఈ ఎలక్ట్రిక్ బైక్ కొంటే పెట్రోల్ డబ్బు ఆదా చేయడమే కాకుండా లక్ష రూపాయల వరకు గెలవచ్చు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం వేగంగా ముందుకు సాగుతోంది. ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల విభాగంలో డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇంధన ధరలు పెరగడం, పర్యావరణంపై అవగాహన పెరగడం, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు ఈ మార్పుకు ప్రధాన కారణాలు. ఈ నేపథ్యంలో అనేక తయారీదారులు తమ సొంత ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. వాటిల్లో ప్రముఖ బ్రాండ్‌గా నిలిచినది రివోల్ట్ మోటార్స్ (Revolt Motors). ఈ సంస్థ ఇప్పటికే తన విభిన్నమైన డిజైన్, మెరుగైన పనితీరు, ఆధునిక టెక్నాలజీతో యువతలో మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడీ కంపెనీ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులను ఆకర్షించేలా ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.

రివోల్ట్ తన కస్టమర్ల కోసం అద్భుతమైన డిస్కౌంట్, బహుమతులు అందిస్తోంది. ఎలక్ట్రిక్ బైకులపై రూ.13,000 వరకు తగ్గింపు అందించగా, అదనంగా రూ.7,000 విలువైన ఉచిత బీమాను ప్రకటించినట్లు బైక్‌వేల్ తెలిపింది. ఈ ప్రయోజనాలతో రివోల్ట్ బైక్ కొనుగోలుదారులు సుమారు రూ.20,000 వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఆఫర్‌లు ఇక్కడితో ఆగడం లేదు. ఈ పండుగ సీజన్‌లో రివోల్ట్ బైక్ కొనుగోలు చేసే ప్రతి కస్టమర్‌కి హామీ బహుమతులు లభిస్తాయి.

Revolt Announced Diwali Dhamaka Offer Upto Rs 1 Lakh

బహుమతుల జాబితాలో టెలివిజన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, మైక్రోవేవ్ ఓవెన్లు, స్మార్ట్‌వాచ్‌లు, వెండి నాణేలు, అలాగే రివోల్ట్ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం, ఒక అదృష్ట కస్టమర్‌కు రూ.1 లక్ష విలువైన బంగారు వోచర్ గెలుచుకునే అవకాశం. ఈ ప్రత్యేక బహుమతి కంపెనీ పండుగ ప్రచారానికి గ్లామర్ జోడించింది. దీపావళికి రివోల్ట్ మోటార్స్ పెద్ద ప్రయోజనాలను, విలువైన బహుమతులను కూడా అందిస్తోంది.

దీపావళి సందర్భంగా రివోల్ట్ మోటార్స్ వినియోగదారులకు తీసుకొచ్చిన ఈ ఆఫర్ అక్టోబర్ 21, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే, ఈ కాల వ్యవధిలో రివోల్ట్ బైక్‌ను కొనుగోలు చేసే వారు భారీ డిస్కౌంట్లు, ఉచిత బీమా మాత్రమే కాకుండా, ఆకర్షణీయమైన బహుమతులను కూడా గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు. కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందడం కోసం రివోల్ట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.

Revolt Announced Diwali Dhamaka Offer Upto Rs 1 Lakh

అలాగే, తమ నగరానికి సమీపంలోని రివోల్ట్ హబ్ లేదా డీలర్‌షిప్ సెంటర్‌‌ను సందర్శించి వాహనాన్ని నేరుగా కొనుగోలు చేయవచ్చు. రివోల్ట్ ప్రస్తుతం మార్కెట్లో ప్రధానంగా అందిస్తున్న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ RV400, దీని ధర భారతదేశంలో రూ. 1.21 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతోంది. ఈ బైక్ తన సెగ్మెంట్‌లో టెక్నాలజీ, పనితీరు పరంగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇది 3 kW మిడ్-డ్రైవ్ మోటార్‌తో నడుస్తుంది,

ఇది 3.24 kWh లిథియం-ఐయాన్ బ్యాటరీ ప్యాక్‌తో. ఈ మోటార్ 5 kW పీక్ పవర్ అవుట్‌పుట్, 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా ఈ శక్తి చక్రాలకు చేరి స్మూత్, సైలెంట్ రైడింగ్ అనుభూతిని ఇస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్‌తో, అంటే 4.5 గంటల్లో RV400 ఒకే సారి 150 కి.మీ రేంజ్ ఇవ్వగలదు, అది ఎంచుకున్న రైడ్ మోడ్ ఆధారంగా మారుతుంది.

Revolt Announced Diwali Dhamaka Offer Upto Rs 1 Lakh

రతన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ ఆధ్వర్యంలోని రివోల్ట్, RV1, RV1+, BlazeX మొదలైన మోడళ్లను కలిగి ఉంది. రివోల్ట్ ప్రారంభించిన ఎంట్రీ-లెవల్ RV1 కమ్యూటర్ మోడల్‌పై నిర్మించబడిన బ్లేజ్‌ఎక్స్ ప్రత్యేకంగా రోజువారీ అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది. ప్రస్తుతం సేల్స్ గణంకాలను చూసినట్లయితే బ్రాండ్ అన్ని EVలు మార్కెట్లో బాగా అమ్ముడవుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, October 15, 2025, 14:34 [IST]
English summary
Revolt announced diwali dhamaka offer upto rs 1 lakh discount on electric bikes
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+