ఇంటి పని నుండి ఆఫీసు వరకు.. ఈ అదిరిపోయే స్కూటర్ ఒక్కటి చాలంటున్న జనాలు! 120 కి.మీ రేంజ్‌తో హవా!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఎక్కువ దూరం ప్రయాణించగలగడం, తక్కువ ఖర్చుతో నడవడం, అలాగే పెట్రోల్ ధరల భారం లేకపోవడం వల్ల ప్రజలు ఇప్పుడు తమ పాత స్కూటర్లను అమ్మేసి కొత్త ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్ళుతున్నారు. ఇది మార్కెట్లో ఈ-వాహనాలపై డిమాండ్‌ను భారీగా పెంచుతోంది. ఈ మారుతున్న ట్రెండ్‌ను సరిగ్గా గమనించిన బెంగళూరుకు చెందిన స్టార్టప్ రివర్ మొబిలిటీ, నవంబర్ 2024లో తన ఎలక్ట్రిక్ స్కూటర్ 'రివర్ ఇండీ (river indie)'ను రిఫ్రెష్ చేసి మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, శక్తివంతమైన మోటార్, పెద్ద బూట్ స్పేస్, మల్టీపర్పస్ ఫీచర్లు ఇలా అన్నింటినీ కలిపి రివర్ ఇండీ ఇప్పుడు వినియోగదారుల మధ్య హాట్ ఫేవరెట్‌గా మారింది.
ప్రతి రోజు పెరిగే పెట్రోల్ ఖర్చుతో విసిగిపోయిన యువత, రోజూ పనులకు బయలుదేరే వారు ఇప్పుడు ఈ స్కూటర్‌ను తమ డైలీ రైడ్‌గా ఎంచుకుంటున్నారు. డిజైన్ పరంగా ప్రత్యేకంగా ఉండటం, ప్రయోజనాల పరంగా కూడా దీని పనితీరు ఇతర ఈ-స్కూటర్లతో పోలిస్తే ముందుంది. అన్ని వర్గాల వారు కొనుగోలు చేయగలిగేల అందుబాటు ధర, ప్రాక్టికల్ ఫీచర్లు, ఆకర్షణీయమైన స్టైలింగ్ కలగలిపిన 'రివర్ ఇండీ' ఇప్పుడు నిజంగానే హాట్ కేక్‌లా అమ్ముడవుతోంది.

బెంగళూరు కేంద్రంగా ఉన్న స్టార్టప్ రివర్ మొబిలిటీ రూపొందించిన ఇండీ EV తనదైన శైలిలో మార్కెట్‌ను ఆకర్షిస్తోంది. ఈ స్కూటర్‌ను పరిచయం చేసినప్పటి నుండి ఇప్పటి వరకూ దాదాపు 7,000 మందికి పైగా వినియోగదారులు దీనిని కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం జనవరి 1 నుండి జూన్ 18 వరకు 4,456 యూనిట్లు, గత సంవత్సరం, అంటే 2024లో ఇదే కాలంలో కంపెనీ 2,515 యూనిట్ల అమ్మకాలు చేసింది.
అప్పట్లో పెద్దగా డిమాండ్ కనిపించకపోయినా, ఇప్పుడు మాత్రం వినియోగదారుల దృష్టిలో ఇండీ EV ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది. దీనికి ప్రధాన కారణం, దీని ప్రాక్టికల్ డిజైన్, SUV తరహాలో ఉన్న బలమైన నిర్మాణం. ప్రస్తుతం Ola, Ather లాంటి కంపెనీల అమ్మకాలు స్వల్పంగా పడిపోతుండగా, అదే సమయంలో రివర్ ఇండీ వంటి ప్రత్యామ్నాయ స్కూటర్లు వినియోగదారుల మనసు గెలుచుకుంటున్నాయి. ఇండీ EVను ఎలక్ట్రిక్ స్కూటర్లలో SUV అని పిలుస్తుంటారు.

భారతీయ రహదారులకు, కుటుంబ అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దిన ఈ స్కూటర్, అత్యంత విశాలమైన స్టోరేజ్ స్పేస్ కలిగి ఉంది. కేవలం మీ డైలీ రైడ్‌కి మాత్రమే కాదు, ఇంటి పనులు సులభంగా పూర్తి చేయవచ్చు. ఉదాహరణకి, మీరు వంటగదికి కావలసిన పాత్రలు, బస్తాలు తీసుకెళ్లవచ్చు. ఆ పని కోసం ఆటో రిక్షా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవసరాలకు తగ్గ డిజైన్‌తో ఇండీ EV ఇప్పుడు ప్రజల మనసులను గెలుచుకుంటోంది.
ఎక్స్ షోరూమ్ ధర రూ.1.42 లక్షల నుంచి ఉంటుంది. నీరు, దుమ్ము నుంచి రక్షణ కలిగి ఉండటానికి బ్యాటరీ ప్యాక్ IP67 రేటింగ్‌ను కలిగి ఉంది. దీని 4kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఒకే ఛార్జ్‌తో 120 కిలోమీటర్ల రేంజ్ అందించగలదు. ఇది స్టాండర్డ్ ఛార్జర్‌తో 5 గంటల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది, అంటే దీన్ని ఒక రాత్రిపూట ఛార్జ్ చేస్తే, మరుసటి రోజు పూర్తిగా సిద్ధంగా ఉంటుంది.

కంపెనీ దీనిని 6.7 kW మోటార్‌తో రూపొందించింది, ఇది గరిష్టంగా 26 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 90 కి.మీ.0-40 కి.మీ వేగాన్ని కేవలం 3.9 సెకన్లలో అందుకుంటుంది. అంతేకాదు, వినియోగదారుల కోసం కంపెనీ 5 సంవత్సరాల లేదా 50,000 కి.మీ వారంటీని అందిస్తోంది. ఇండీ EVలో ఇండిగ్ కలర్ LCD డిస్‌ప్లే, మూడు రైడింగ్ మోడ్‌లు, ఎకో, రైడ్, రష్ ఉన్నాయి.
సేఫ్టీ రైడింగ్ కోసం సైడ్ స్టాండ్ కట్-ఆఫ్, పార్కింగ్ కోసం రివర్స్ అసిస్ట్, మోటార్‌కు రక్షణ కల్పించే క్రాష్ గార్డులు, ఇంకా సౌకర్యవంతమైన 90-డిగ్రీ వాల్వ్ స్టెమ్‌లు, రెండు USB ఛార్జింగ్ పోర్ట్‌లు లాంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి. ఈవీ రంగంలో వినియోగదారుడి రోజువారి అవసరాలకు సరిపోయేలా రూపొందించబడిన ఇండీ, టెక్నాలజీ, పనితీరు పరంగా బెస్ట్ మోడల్‌గా నిలవగలదు.


Click it and Unblock the Notifications








