డిక్కీలో 55 లీటర్ల ఖాళీ.. రూ.22,500 సేవింగ్స్‌తో పర్స్ ఫుల్..ఇంతకంటే మంచి డీల్ ఉంటుందా బాసూ ?
కొత్త సంవత్సరం ప్రారంభం కావడానికి ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రివర్ మొబిలిటీ (River Mobility) తమ రివర్ ఇండీ (River Indie) ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఇయర్-ఎండ్ ఆఫర్‌లను ప్రకటించింది. 2025 డిసెంబర్ 31 వరకు అమలులో ఉండే ఈ ఆఫర్‌లతో స్కూటర్ అమ్మకాలను పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎస్‌యూవీ అని పిలవబడే రివర్ ఇండీని మరింత సరసమైన ధరలో కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల కోసం ఈ మోడల్ ప్రత్యేకంగా రూపొందించారు.
రివర్ మొబిలిటీ ప్రకటించిన ఈ ఆఫర్‌లలో తక్కువ డౌన్ పేమెంట్, క్యాష్‌బ్యాక్, సులభ ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి. రివర్ ఇండీని కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ నెలలో రూ.7,500 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

అయితే, ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కంపెనీ సొంతంగా నిర్వహించే స్టోర్‌లలో మాత్రమే లభిస్తుంది. HDFC, ICICI, బ్యాంక్ ఆఫ్ బరోడా, కొటక్, వన్ కార్డ్ వంటి ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డులు ఉపయోగించే వినియోగదారులకు మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది.
వినియోగదారులు ఇప్పుడు కేవలం రూ.14,999 డౌన్ పేమెంట్‌తో రివర్ ఇండీ స్కూటర్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. IDFC,ఈవ్‌ఫిన్ (Evfin) సంస్థల సహకారంతో ఈ ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ పథకాన్ని కంపెనీ అందిస్తోంది. అంతేకాకుండా, స్కూటర్ యాక్సెసరీస్‌ను కూడా వినియోగదారులు సులభ వాయిదాల పద్ధతిలో (EMI) కొనుగోలు చేయవచ్చు. దాదాపు రూ.14,000 వరకు విలువైన యాక్సెసరీలను నెలవారీ వాయిదాలలో కొనుగోలు చేసే వెసులుబాటు లభిస్తుంది.

రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.25 లక్షలుగా ఉంది. ఇందులో 4 kWh NMC బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ 163 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ 0 నుంచి 80% వరకు ఛార్జ్ కావడానికి ఐదు గంటల సమయం పడుతుంది.
ఈ స్కూటర్ గరిష్టంగా 6.7 kW (9hp) శక్తిని, 26 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 3.7 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ వేగాన్ని చేరుకోగలదు, గంటకు 90 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. ఇందులో 55 లీటర్ల లాక్ చేయగల స్టోరేజ్ సామర్థ్యం, 14-అంగుళాల వీల్స్, ఎకో, రైడ్, రష్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.

రివర్ ఇండీ లాంచ్ అయిన కేవలం రెండు సంవత్సరాలలోనే 20,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకుంది. ఆరు నెలల క్రితం 10,000 యూనిట్ల అమ్మకాలను అధిగమించిన ఈ స్కూటర్, కర్ణాటకలోని హోస్కోట తయారీ కేంద్రం నుంచి 20,000వ యూనిట్‌ను విడుదల చేసింది.
ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా దాదాపు 40 స్టోర్‌లు ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, కోయంబత్తూరు వంటి దక్షిణ భారత దేశంలో ఉన్న ఇతర నగరాలతో పాటు కేరళలోని అనేక నగరాల్లో రివర్ మొబిలిటీ తమ ఉనికిని బలోపేతం చేసుకుంది.


Click it and Unblock the Notifications








