కొత్త బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తావా..! మరింత స్టైలిష్‌గా, శక్తివంతంగా హంటర్ కొత్త మోడల్ వచ్చేస్తోంది!

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి గతంలో విడుదలైన హంటర్ 350 (Hunter 350) ఇప్పుడు భారతదేశంలో యువతని ఆకట్టుకుంటున్న అత్యంత ప్రజాదరణ పొందిన 350cc బైక్. క్లాసిక్ 350లాగే ఇది కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానుల మనసులను గెలుచుకుంటోంది. దీని ధర తక్కువగా ఉండటం, అలాగే స్టైలిష్ రెట్రో డిజైన్‌తో మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న మోడల్‌గా అవతరించింది. ఈ బైక్ మార్కెట్‌లో వచ్చినప్పటి నుంచి మంచి స్పందన దక్కించుకుంటూ, ఇప్పుడు దాని విభాగంలో నంబర్ వన్ బైక్‌గా నిలిచింది. అయితే, తాజాగా బైక్ మార్కెట్‌లో పోటీ బాగా పెరిగింది. హోండా, బజాజ్, జావా, TVS వంటి బ్రాండ్లు తమ తమ బైక్‌లను కొత్త ఫీచర్లతో విడుదల చేస్తూ, పోటీని పెంచుతున్నాయి.

ఈ నేపథ్యంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా తన హంటర్ 350 బైక్‌కు కొత్త రూపం ఇవ్వాలని సిద్ధమవుతోంది. లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త అప్‌డేట్‌లతో ఈ బైకును విడుదల చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. కొత్తగా రానున్న హంటర్ 350 మోడల్‌లో గణనీయమైన మార్పులు కనిపించనున్నాయి. ప్రస్తుతం కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న ఈ బైక్ ధర కేవలం రూ. 1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Royal Enfield 2025 Model Hunter 350 Launch

కొత్త మోడల్ రాకతో ఇప్పటివరకు వచ్చిన హంటర్‌లోనే అతిపెద్ద అప్‌డేట్‌గా భావించబడుతోంది. కొత్త హెడ్‌లైట్, రియర్ సస్పెన్షన్, ఇతర సాఫ్ట్‌వేర్, స్టైలింగ్ అప్డేట్లు దీనిలో ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ రైడింగ్ అనుభూతిని మరింత కొత్తగా అందించబోతుంది. ఈ అప్‌డేట్‌ల నేపథ్యంలో, ధర కూడా కొంత మేర పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు రూ. 10,000 వరకు అదనంగా పెరిగే అవకాశం కూడా ఉందని మార్కెట్ వర్గాల సమాచారం..

అంటే కొత్త హంటర్ 350 ధర సుమారు రూ. 1.60 లక్షల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది కూడా ఎక్స్-షోరూమ్ ధరే. ధర పెరిగినా, రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న అప్‌డేట్‌లను చూస్తే, ఈ పెరుగుదల సరైనదే అనిపిస్తుంది. అదీ కాకుండా, కొత్త టెక్నాలజీ, మెరుగైన సేఫ్టీ ప్రమాణాలు, ఇంకా శక్తివంతమైన లుక్ ఈ బైక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చనున్నాయి. మొత్తానికి, హంటర్ 350 మరింత అందంగా సరికొత్తగా మారబోతుంది.

Royal Enfield 2025 Model Hunter 350 Design

2025 రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 వెర్షన్ ఏప్రిల్ 26న కొత్త అప్‌డేట్‌లతో లాంచ్ కానుంది. ఈ రోజు రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు పెద్ద పండగే అని చెప్పవచ్చు. మార్కెట్‌లో పెరుగుతున్న పోటీని ధీటుగా ఎదుర్కొడానికి హంటర్ ఇప్పుడు మరింత ఆధునికంగా, ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటి వరకు హంటర్ 350 ఎనిమిది రంగుల్లో అందుబాటులో ఉంది. కానీ 2025 వెర్షన్‌లో కలర్స్ పరంగా కొన్ని ముఖ్యమైన మార్పులు జరగనున్నాయి.

అదే సమయంలో మార్కెట్‌లో అంతగా డిమాండ్ లేని కొన్ని పాత కలర్ ఆప్షన్‌లను నిలిపివేసే అవకాశముంది. అలాగే, తాజాగా రూపొందించిన ఫ్రెష్ కలర్ టోన్లు, బోల్డ్, మొదలగు వాటిని ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఇవి యువతను మళ్లీ ఆకట్టుకునేలా ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫీచర్ల పరంగా చూస్తే, హంటర్ 350లో పెద్ద మార్పులు లేవు గానీ, కొన్ని సరికొత్త, రైడర్లకు ఉపయోగకరమైన చిన్నచిన్న అప్‌డేట్స్ వస్తున్నాయి.

Royal Enfield 2025 Model Hunter 350 Price

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 23, 2025, 11:00 [IST]
English summary
Royal enfield 2025 model hunter 350 to be launch with updated features and colours
Read more on: #royal enfield #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+