రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల ధరలు భారీగా తగ్గుదల.. డుగ్గు డుగ్గు బైకులు మరింత తక్కువ ధరకే

ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాహనాలపై జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించడం దేశ వ్యాప్తంగా వినియోగదారులకు ఒక పెద్ద ఊరటగా మారింది. కేవలం కార్లకే కాకుండా టూవీలర్ వాహనాల ధరలు కూడా ఇప్పుడు గణనీయంగా తగ్గబోతున్నాయి. ముఖ్యంగా 350సిసి వరకు ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైక్‌లు, స్కూటర్లపై జీఎస్టీని 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించడం వల్ల, ధరల్లో స్పష్టమైన మార్పు కనిపించబోతోంది. ఈ తరుణంలో ఇప్పటికే TVS వంటి ప్రముఖ బ్రాండ్లు తమ వాహనాలపై కొత్త ధరలను ప్రకటించగా, మరిన్ని తయారీదారులు కూడా అదే దారిని అనుసరిస్తున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా అధికారికంగా జీఎస్టీ తగ్గింపు పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకు అందజేస్తామని ప్రకటించడం బైక్ ప్రియులకు ఆనందాన్ని కలిగించింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే బైకుల రారాజు. ముఖ్యంగా 350cc సెగ్మెంట్‌లో బలమైన స్థానం సంపాదించుకుంది. క్లాసిక్ 350, బుల్లెట్ 350, హంటర్ 350, మీటియోర్ 350 వంటి మోడళ్లు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఈ మోడళ్లపై ధరలు రూ.22,000 వరకు తగ్గడం ఒక పెద్ద బోనస్‌లా మారింది. దీంతో కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్న యువత, మధ్యతరగతి కుటుంబాలు మరింత ఉత్సాహంగా షోరూమ్‌లకు వెళ్లే అవకాశం ఉంది.

Royal Enfield Bikes Price Reduced To Rs 22000 After Gst Rate Cut

ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు కేవలం ఒక రవాణా సౌకర్యం మాత్రమే కాదు, చాలా మంది కల, స్టైల్ సింబల్. ఈ తగ్గింపు అన్ని వయసుల వారికీ పండగలా మారింది. పండుగ సీజన్ దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి ఆఫర్లు రావడం కంపెనీ అమ్మకాలను కూడా గణనీయంగా పెంచుతుందని అంచనా. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు ఒక గిఫ్ట్‌లా మారి, రాబోయే వారాల్లో బైక్ సేల్స్ మరింత పెరుగుతాయని చెప్పవచ్చు.

జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చిన తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సిసి లోపు బైక్‌లు పెద్దఎత్తున వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది. మొదటగా, హంటర్ 350 గురించి చెప్పుకుంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో ఎంట్రీ లెవల్ మోడల్‌గా బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ఈ బైక్ ధర రూ.1,49,900 నుండి రూ.1,74,655 మధ్య ఉంది. జీఎస్టీ తగ్గింపుతో హంటర్ టాప్-ఎండ్ మోడల్ ధర దాదాపు రూ.22,000 తగ్గి, ఇప్పుడు రూ.1,52,655 వద్ద లభిస్తోంది.

Royal Enfield Bikes Price Reduced To Rs 22000 After Gst Rate Cut

ఇది మొదటిసారి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనాలనుకునే పెద్ద అవకాశంగా మారింది. అదేవిధంగా, బుల్లెట్ 350 ఎన్‌ఫీల్డ్ ఐకానిక్ మోడల్. ప్రస్తుతం దీని ధర రూ.1,76,625 నుండి రూ.2,20,466 వరకు ఉంది. జీఎస్టీ తగ్గింపుతో బుల్లెట్ 350 టాప్-ఎండ్ మోడల్ ధర రూ.1,98,466కు పడిపోయింది. ఒక స్టైల్ సింబల్‌గా, తరతరాలుగా బైక్ లవర్స్ హృదయాల్లో చోటు చేసుకున్న ఈ మోడల్ మరింత సరసమైన ధరలో లభించడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.

ఇక మీటియోర్ 350 విషయానికొస్తే, ప్రస్తుతం ధర రూ.2,08,270 నుండి రూ.2,32,545 మధ్య ఉంది. ఈ క్రూయిజర్ బైక్ టాప్ వేరియంట్ ధర రూ.22,000 తగ్గడంతో, ఇప్పుడు కేవలం రూ.2,10,545 ఎక్స్-షోరూమ్ ప్రైస్ వద్ద దొరుకుతోంది. రోడ్డు మీద లాంగ్ రైడ్స్‌కు ఇష్టపడే వారికి ఇది బంపర్ ఆఫర్‌. చివరిగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ బెస్ట్ సెల్లింగ్ క్లాసిక్ 350. ప్రస్తుతం దీని టాప్ వేరియంట్ ధర రూ.2,20,466 ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

Royal Enfield Bikes Price Reduced To Rs 22000 After Gst Rate Cut

జీఎస్టీ తగ్గింపుతో ఇప్పుడు రూ.1,98,466 వద్ద దొరుకుతోంది. సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానున్న జీఎస్టీ ప్రభావం 350సిసి లోపు మోటార్‌సైకిళ్లపైనే కాదు, అధిక సామర్థ్యం బైక్‌లపైనా కనిపించనుంది. ఇప్పటివరకు ఈ బైక్‌లు 28 శాతం జీఎస్టీతో పాటు 3 శాతం సెస్స్ కింద వచ్చాయి. కానీ జీఎస్టీ 2.0 ప్రకారం, 350సిసి కంటే ఎక్కువ సామర్థ్యంవి 40 శాతం పన్ను శ్లాబ్‌లోకి వెళ్లబోతున్నాయి. దీంతో వీటి ధరలు పెరుగుతాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, September 10, 2025, 14:57 [IST]
English summary
Royal enfield bikes price reduced to rs 22000 after gst rate cut
Read more on: #royal enfield #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+