ఇది బైక్ కాదు.. ఫ్యాన్స్‌కు ఎమోషన్! బుల్లెట్‌ బైక్ సొంతం చేసుకోవడానికి ఎగబడ్డ కస్టమర్లు

రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) అనే పేరు వినగానే చాలా మంది మోటార్‌సైకిల్ ప్రేమికుల గుండెల్లో ఓ ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ బ్రాండ్‌కు ఉన్న ఫాలోయింగ్ మరెవరికి లేదంటే అతిశయోక్తి కాదు. ఇండియాలో చాలా కాలంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒక దిగ్గజ టూవీలర్ తయారీదారుగా తన ప్రత్యేక గుర్తింపును నిలుపుకుంది. ఈ బ్రాండ్‌కు వయస్సు అనే అడ్డుకట్టే లేదు, యువతరానికి ఇది అడ్వెంచర్ సింబల్ అయితే, పెద్దవారికి ఇది గౌరవ ప్రతీక. వీధుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ సవారీ వస్తే, ఆ రిథమ్‌ శబ్దం వినగానే ప్రతి ఒక్కరి చూపు తారసపడకుండా ఉండదు.

బ్రాండ్ శక్తి, అసలు బలం దాని 350cc లైనప్. హంటర్ 350, బుల్లెట్ 350, క్లాసిక్ 350 వంటి ప్రతి ఒక్క మోడల్‌కు ప్రత్యేకమైన రైడర్ బేస్ ఉంది. వీటిలో బుల్లెట్ 350కి మాత్రం వేరే స్థానం ఉంది. బుల్లెట్ 350 ఒక బైక్ కాదు, ఒక లెజెండ్. 70 ఏళ్ల చరిత్రతో, తరతరాలకు మమేకమైన ఈ బైక్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇతర మోడళ్లతో పోలిస్తే చాలా ఎక్కువ.

Royal Enfield Bullet 350 September 2025 Sales 100 88 Percent Growth Compared To Previous

2025 సెప్టెంబర్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 25,915 యూనిట్ల బుల్లెట్ 350 బైకులను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 12,901 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే, 100.88 శాతం వృద్ధి సాధించింది. ఇదంతా బుల్లెట్‌కి ఉన్న నమ్మకం, ప్యాషన్‌కు నిదర్శనం. హంటర్ 350ను దాటేసి, రాయల్ ఎన్‌ఫీల్డ్ లైనప్‌లో రెండవ అత్యధికంగా అమ్ముడైన బైక్‌గా బుల్లెట్ 350 నిలిచింది.

ఇప్పుడు విక్రయాల విషయానికి వస్తే 2025 సెప్టెంబర్ నెల రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గోల్డెన్ మంత్‌గా చెప్పుకోవచ్చు. ఈ కాలంలో కంపెనీ 1,13,573 యూనిట్లను విక్రయించి, మళ్లీ తన సింహాసనం దక్కించుకుంది. గత సంవత్సరం ఇదే నెలలో విక్రయించిన 79,326 యూనిట్లతో పోలిస్తే, ఈసారి దాదాపు 43.17 శాతం వృద్ధి. కొత్త డిజైన్, ఫీచర్లు, మోడర్న్ టెక్నాలజీతో కలిపి కూడా తన క్లాసిక్ ఐడెంటిటీని కోల్పోకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ ముందుకు సాగుతోంది.

Royal Enfield Bullet 350 September 2025 Sales 100 88 Percent Growth Compared To Previous

బుల్లెట్ 350 సేల్స్ పెరగడానికి ముఖ్యమైన కారణం ధరల తగ్గింపే. ప్రజల మనసులో ఎప్పటికీ రాజుగా నిలిచిన బైక్ ఇప్పుడు మరింత సులభంగా అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం గత నెలలో 350cc వరకు ఉన్న బైకులపై GSTని 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించడం వల్ల, బుల్లెట్ ధరలో గణనీయమైన తగ్గుదల చోటుచేసుకుంది. గతంలో ఇది రూ. 1,76,625 నుండి రూ. 2,20,466 మధ్య ధరలో లభించింది.

అయితే జీఎస్టీ తగ్గడం కారణంగా బుల్లెట్, ఇప్పుడు మరింత తక్కువగా రూ.1,62,161 నుండి రూ.2,02,409కి చేరుకుంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. ధర తగ్గింపుతో మధ్య తరగతి యువత కొనడానికి షోరూమ్‌లకు వచ్చారు. దీని ఇంజిన్ విషయానికి వస్తే, 349cc సింగిల్-సిలిండర్ J-సిరీస్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో ఇది శక్తిని పొందుతుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిన ఈ ఇంజిన్ 20.2 bhp శక్తిని, 27 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

Royal Enfield Bullet 350 September 2025 Sales 100 88 Percent Growth Compared To Previous

ఈ బైక్‌లో ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ అమర్చబడగా, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు ఇచ్చారు. వీటివల్ల గట్టి రోడ్లపై కూడా సాఫీ రైడ్ అనుభవం లభిస్తుంది. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికొస్తే, దిగువ వేరియంట్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 300 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 130 mm రియర్ డ్రమ్ బ్రేక్ లను అందించింది. రైడింగ్‌లో రైడర్లకు కావాల్సిన అన్ని ఫీచర్స్ కూడా దీనిలో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, October 28, 2025, 9:07 [IST]
English summary
Royal enfield bullet 350 september 2025 sales 100 88 percent growth compared to previous
Read more on: #royal enfield #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+