ఇదిగో.. వస్తున్నాడు! సింహగర్జనలా దూసుకొస్తున్న బైకుల రారాజు.. అత్యంత శక్తివంతమైన బుల్లెట్‌కు సిద్ధంగా ఉండండి!

రాయల్ ఎన్‌ఫీల్డ్ పేరు వినగానే, యువత హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానం కలిగిన 'బుల్లెట్' మోడల్ కళ్ల ముందుకు వస్తుంది. ఇది కేవలం ఒక బైక్ మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. తరతరాలుగా బుల్లెట్ బైక్ భారత యువతను మాత్రమే కాక, ప్రతి వయస్సు వారినీ ఆకర్షిస్తూ, దేశం అంతటా తన గంభీరమైన సౌండ్‌తో ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పలు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నద్ధమైంది. తన మార్కెట్‌న మరింత విస్తరించే ప్రయత్నంలో భాగంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ అదిరిపోయే బుల్లెట్ 650 ట్విన్ బైకును త్వరలో లాంచ్ చేయాలని చూస్తుంది. . ఇది ఇప్పటి వరకు మనం చూసిన బుల్లెట్లకంటే కొంచెం కొత్తదైన, మరింత శక్తివంతమైన రూపంలో రాబోతుంది.

బలమైన 650సీసీ ట్విన్-సిలిండర్ ఇంజిన్, దానికి తగిన స్టైలింగ్ కలసి ఈ మోడల్‌ను బైక్ లవర్స్ కలల మోడల్‌గా మార్చబోతున్నాయి. ప్రత్యేకంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి సంస్థలకు, కొత్త మోడల్ లాంచ్ చేయడానికి ముందే దాని పేరును ట్రేడ్‌మార్క్ చేయడం ఒక సాధారణ ప్రక్రియ. ఇప్పుడు కంపెనీ 'బుల్లెట్ 650 ట్విన్' పేరును భారతదేశంలో అధికారికంగా ట్రేడ్‌మార్క్ చేసింది. అంటే ఈ బైకు రానున్న రోజుల్లో మార్కెట్లో అమ్మకానికి రావచ్చు.

Royal Enfield Bullet 650 Twin Will Be Launch

ఇప్పటికే ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ బైక్ బుల్లెట్ బ్రాండ్‌కు ప్రత్యేకత తీసుకొచ్చే క్లాసిక్ లుక్‌తో పాటు‌ మరింత కొత్తగా కనిపించబోతుంది. మొత్తంగా దీని డిజైన్‌ను చూస్తే, అదే పాత రుచి, కానీ కొత్తతనంతో నిండిన మోడల్‌ లాగా ఉండేలా తీర్చిదిద్దారు. దాని రౌండ్ షేప్ హెడ్‌లైట్ ఆకట్టుకుంటుంది. రాత్రిపూట రోడ్డుపై మంచి వెలుతురును అందిస్తుంది. ఇంధన ట్యాంక్ టియర్‌డ్రాప్ ఆకారంలో ఉంటుంది.

టర్న్ ఇండికేటర్ల విషయంలో కూడా ఆ క్లాసిక్ రూపాన్ని వదలకుండా, పాత బుల్లెట్ల తరహాలోనే డిజైన్‌ను కొనసాగించింది. ఈ బైక్ క్లాసిక్ మూలాలపై ఆధారపడినా, అది కచ్చితంగా ఇప్పటి యువతకు కూడా చేరువవుతుంది.ఈ బైక్‌కు మెరిసే LED లైటింగ్ సిస్టమ్ ఆకర్షణీయంగా మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది. సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా రైడర్లు తమకు అవసరమైన సమాచారాన్ని చూసుకోవచ్చు. ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ సపోర్ట్ కూడా ఉంది.

రైడింగ్ సమయంలో రైడర్లకు సురక్షిత బ్రేకింగ్ కోసం ముందు వెనుక డిస్క్ బ్రేక్‌లు అమర్చారు. ఈ బ్రేకింగ్ సిస్టంను డ్యూయల్-ఛానల్ ABS ద్వారా ఇచ్చారు. రైడింగ్ కంఫర్ట్ పరంగా చూస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు అమర్చారు. దీంతో మీరు ఎలాంటి రోడ్లపై ప్రయాణించిన కూడా మృదువైన సస్పెన్షన్ ఫీలింగ్‌ను పొందుతారు. బైక్‌లో ఆకర్షణీయమైన స్పోక్ వీల్స్‌ ఉన్నాయి.

ఇవి రెగ్యులర్ స్పోక్ డిజైన్‌‌తో ట్యూబ్‌లెస్ టైర్లతో కూడి ఉంటాయి. ఇది ప్రయాణంలోనూ నమ్మకమైన పనితీరును అందిస్తుంది. వీల్స్ డిజైన్ బైక్‌కు క్లాసిక్ లుక్ ఇవ్వడంతో పాటు, సాంకేతికంగా కూడా మెరుగైన ట్రాక్షన్‌ను అందించేందుకు రూపొందించారు. ఇది 648సీసీ ట్విన్-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇదే శక్తివంతమైన ఇంజిన్ గతంలో క్లాసిక్ 650, ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ GT మోడళ్లలో ఉపయోగించారు.

ఈ ఇంజిన్ 47 bhp పవర్, 52 nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను దీనికి జత చేశారు. హైవే పై లేదా లాంగ్ రైడ్‌లలో, ఈ ఇంజిన్ బలమైన పనితీరును అందిస్తుంది. అయితే, ఈ బైక్ అధికారికంగా ఎప్పుడు విడుదలవుతుందనేది కంపెనీ ఇప్పటివరకు వెల్లడించలేదు. అయినప్పటికీ, ఇప్పటికే పలుమార్లు ఈ బైక్ పరీక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇటీవల కనిపించాయి.

More from DriveSpark

Article Published On: Friday, April 25, 2025, 17:20 [IST]
English summary
Royal enfield bullet 650 twin will be launch soon in india here some expected things
Read more on: #royal enfield #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+