బైక్‌ను టెస్ట్ చేయడానికి ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు.. అది కూడా లడఖ్ పర్వతాల్లో.. ఇంతకి ఆ వ్యక్తి ఎవరంటే?
రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హిమాలయన్ ఎలక్ట్రిక్ వెర్షన్ ఇప్పుడిప్పుడే చివరి దశలోకి అడుగుపెడుతోంది. బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిన అడ్వెంచర్ మోటార్‌సైకిల్ హిమాలయన్, ఇప్పుడు ఎలక్ట్రిక్ పవర్‌తో రోడ్డెక్కేందుకు సిద్ధమవుతోంది. ఇది కాకుండా, భారీ, శక్తివంతమైన 750cc ఇంజిన్ సామర్థ్యం కలిగిన హిమాలయన్ 750 మోడల్ కూడా త్వరలోనే మార్కెట్లోకి రానుంది. రెండు వేరియంట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ ,హైపర్ పర్ఫార్మెన్స్ బైక్ సెగ్మెంట్లలోకి ఒకేసారి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ CEO పి. గోవిందరాజన్ స్వయంగా ఈ కొత్త బైక్‌లను ప్రారంభానికి ముందు పరీక్షించారు. కానీ నిజంగా చర్చకు కారణమైన విషయం మాత్రం ఆయన ఈ బైక్‌లను ఎక్కడ నడిపారు అన్నదే.
ఎందుకంటే, ఇది సాధారణ పరీక్ష రైడ్ కాదు.. అడ్వెంచర్ రూట్‌లో రైడ్ చేయడం విశేషం. మనలో చాలామంది కలలు కనేది లడఖ్, కాశ్మీర్ వంటి సుదూర ప్రాంతాలకు బైక్‌పై ట్రిప్ చేయడమే. కానీ అలాంటి ట్రిప్‌లు కొందరికి మాత్రమే సాధ్యమయ్యే లగ్జరీ. ఎందుకంటే, అందుకు అవసరమయ్యే బైక్‌లు ఖరీదైనవి, శక్తివంతమైనవి కావాలి. అయితే CEO గోవిందరాజన్ ఇదే దారిని ఎంచుకున్నారు.

లడఖ్ బూడిద పర్వతాల మధ్య, ఖారదుంగ్ లా వంటి ఎత్తైన రూట్లపై కొత్త బైక్‌లను పరీక్షించారు. ఇది కేవలం బైక్‌ను పరీక్షించడం మాత్రమే కాదు, ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఎలా ఉండాలో, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎలా నిలబడాలో చూపించడానికి ఒక నిరూపణ. ఇప్పటివరకు కేవలం స్పై షాట్ల రూపంలోనే కనిపించిన రెండు రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లు.. ఇప్పుడు అధికారికంగా కంపెనీ స్వయంగా టీజ్ చేసింది.
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు చూసిన వారందరికీ, ఇది సాధారణ ఆఫ్‌రోడ్ రైడ్ కాదని అర్థమైపోయింది. రెండు బైకులు 750cc హిమాలయన్, మరొకటి ఎలక్ట్రిక్ హిమాలయన్ వేరియంట్ పూర్తిగా మాస్క్ కవర్‌లతో, ఇంకా పూర్తి డిజైన్ వివరాలు బయటపడకుండా జాగ్రత్తగా కప్పబడి ఉన్నాయి. ఇది ఇంకా అధికారికంగా పేర్లు, స్పెసిఫికేషన్లు వెల్లడించలేదు. త్వరలో వీటి గురించిన వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

ముఖ్యంగా, ఎలక్ట్రిక్ బైకుపై ఉన్న ఆసక్తి మరింతగా పెరిగింది. ఈ బైక్‌కి సంబంధించిన హైప్, 750cc హిమాలయన్ కంటే ఎక్కువగా ఉంది. ఒకవేళ ఇది 'ఫ్లయింగ్ ఫ్లీ' బ్రాండ్ కింద రానుందా అనే సందేహం ఉన్నా, కంపెనీ నుంచి వచ్చే సమాచారం ప్రకారం, హిమాలయన్ EV వేరుగా ఉంటుంది. ఇది కొత్తగా, ప్రత్యేకంగా నిలబడుతుంది. అదే సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండుని కూడా నిలుపుకుంటుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ EV ఇప్పుడు విద్యుత్ బైక్ మార్కెట్‌లో అత్యంత ఆసక్తికరమైన ఆవిష్కరణలలో ఒకటిగా మారుతోంది. ఇది గత సంవత్సరం ఇటలీలో జరిగిన ప్రఖ్యాత EICMA షోలో ప్రదర్శించిన "HIM-E" కాన్సెప్ట్ ఆధారంగా రూపుదిద్దుకుంది. ఆ షోలో ఈ కాన్సెప్ట్ బైక్ చూపించిన డిజైన్, బలమైన నిర్మాణం, టెక్నాలజీ వినియోగం ఈవీ ప్రపంచంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ తీసుకున్న కొత్త దిశకు నిదర్శనంగా నిలిచింది.

ఇక హిమాలయన్ 750 విషయానికొస్తే, ఇది పూర్తిగా కొత్త 750cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో నిర్మించబడింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పటికే తన 650cc ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో సక్సెస్ అందుకుంది, ఇది ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT వంటి బైక్‌లకు శక్తినిచ్చింది. అయితే, అలా ఉన్నప్పటికీ, హిమాలయన్ 750 కోసం ప్రత్యేకంగా కొత్త ఇంజిన్‌ను అభివృద్ధి చేయడం కంపెనీ ఈ బైక్‌ను ఎంత ప్రాముఖ్యతగా తీసుకుంటుందో తెలిపింది.


Click it and Unblock the Notifications








