41 కి.మీ మైలేజ్ ఇచ్చే బుల్లెట్! డుగ్గు డుగ్గు అంటూ ఊళ్లు తిరుగుతుంది.. భారీ సంఖ్యలో అమ్ముడైంది
రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield), భారతీయుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న నమ్మకమైన టూవీలర్ బ్రాండ్. దీని బైకులు కేవలం రోడ్డుపై పరుగెత్తడానికే కాదు, ఒక భావోద్వేగాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. దశాబ్దాల కాలంగా అన్ని వయసుల వారి అభిమానాన్ని పొందుతుంది. కాలానుగుణంగా ఎన్నో మోడళ్లను పరిచయం చేస్తూ, ఇతర టూవీలర్ తయారీదారులకు బలమైన ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఈ కంపెనీ 350 సీసీ నుంచి మొదలుకుని 650 సీసీ వరకు పలు బైకులను విక్రయిస్తుంది. దీనిలో క్లాసిక్ స్టైల్‌పై ఉన్న ఆసక్తి ఇప్పటికి తగ్గలేదు. దీనిని రుజువు చేస్తూ, జూన్ 2025లో కంపెనీ అత్యధికంగా విక్రయించిన మోడల్‌గా క్లాసిక్ 350 (Classic 350) నిలిచింది. ట్రెడిషనల్ లుక్, విశ్వసనీయ ఇంజిన్ పనితీరు, ఆత్మవిశ్వాసం నింపే రైడింగ్ ఫీల్ కారణంగా ఈ బైక్‌పై ప్రజలకున్న ప్రేమ మరోసారి రుజువైంది.
ఇది కేవలం ఒక బైక్ కాదు, స్టేట్‌మెంట్. రోజువారీ రైడింగ్‌కి సరిపడేలా ఉండటం, లాంగ్ రైడ్స్‌లో నమ్మకంగా పనిచేయడం వంటి అనేక కారణాలు దీన్ని మార్కెట్లో టాప్ సెల్లర్‌గా నిలిపాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రీమియం బ్రాండ్‌గా ఉండి కూడా, మిడిల్ క్లాస్ బైక్ లవర్స్‌కి అందుబాటులో ఉండడం మరో ముఖ్యమైన అంశం. ఈ ట్రెండ్ చూస్తుంటే, ఇప్పటికీ ప్రజలు పాతతనాన్ని, స్టైల్‌ను, నమ్మకాన్ని కలిపిన బైక్‌ల వైపే మొగ్గుచూపుతున్నారనే స్పష్టమవుతుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 జూన్ 2025లో కూడా తన డిమాండ్‌తో ఆకట్టుకుంది. ఈ నెలలోనే మొత్తం 29,172 యూనిట్లు అమ్ముడవడం, ఈ బైక్‌పై ప్రజల ఆదరణ ఎప్పటికీ తగ్గదని మరోసారి రుజువు చేసింది. ఇది గత ఏడాది అంటే 2024 జూన్ నెలలో 24,803 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, క్లాసిక్ 350 అమ్మకాలు 17.61 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
ఇది సాధారణ పెరుగుదల కాదు. మోటార్ సైకిల్ మార్కెట్‌లో దీని ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉందో తెలిపే గణాంకం. ఈ బైక్‌కు ఉన్న ఆకర్షణకి ఎన్నో కారణాలున్నాయి. కలర్స్, క్లాసిక్ ఫ్యూయల్ ట్యాంక్, మెటల్ బాడీ, మరి ముఖ్యంగా మైలేజ్... ఇవన్నీ కలిపి దీనిని ఒక ప్రత్యేకమైన శైలిగా నిలబెడతాయి. అంతేకాదు, లేటెస్ట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇందులో పలు అత్యాధునిక అంశాలను జోడించారు.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350.. పేరుకే కాదు, పనితీరులోనూ, డిజైన్‌లోనూ నిజమైన క్లాసిక్ అనిపించే బైక్. హైదరాబాద్‌లో ఇది రూ. 2.34 లక్షల నుంచి కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ఈ ధరలో మధ్యతరగతి వినియోగదారుల నుంచి సంపన్న వర్గం వరకు అందరూ దీన్ని సులభంగా కొనుగోలు చేయగలుగుతున్నారు. దీన్ని ఎంచుకోవడం వారి కోసం కేవలం అవసరం కోసం కాదు, అది ఒక శైలి, ఆత్మవిశ్వాసానికి చిహ్నం.
క్లాసిక్ 350లో ఉన్న శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ దీన్ని ప్రత్యేకత కలిగిన బైక్‌గా నిలబెడుతుంది. ఇందులో 349 సీసీ సామర్థ్యం గల సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 6100 rpm వద్ద 20.2 PS పవర్‌ను, 4000 rpm వద్ద 27 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దానికి అనుగుణంగా 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జోడించారు. ఇది అన్ని రకాల రోడ్లపై ఈజీగా ప్రయాణించగలదు.

ఈ బైక్‌ని ప్రత్యేకంగా నిలబెట్టే మరో కీలక అంశం, దీని మైలేజ్. క్లాసిక్ 350 తరహా ఒక బలమైన బైక్ నుంచి 41.55 కిలోమీటర్ల మైలేజ్ లభించటం అనేది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ అదే ఈ బైక్ ప్రత్యేకత. శక్తి, శైలీ, సామర్థ్యం, మైలేజ్.. వీటిని సమానంగా కలిపిన బైక్‌గా ఇది వినియోగదారులకు మంచి అనుభూతిని అందిస్తోంది. అందుకే ఇది మార్కెట్‌లో ఎప్పటికీ మర్చిపోలేని క్లాసిక్‌గా నిలుస్తోంది.


Click it and Unblock the Notifications








