రాయల్ ఎన్‌ఫీల్డ్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్.. మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడో తెలుసా?

పెట్రోల్ ధరలు ప్రస్తుతం భారీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో అందరి చూపు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక ప్రముఖ వాహన తయారీ సంస్థలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడంలో ఊపందుకున్నాయి. ఇప్పుడు అదే దారిలో బైకుల రారాజు రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా తన తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ విభాగంలో ఇతర ప్రసిద్ధ టూవీలర్ తయారీదారులు దూసుకుపోతుండటంతో ఎన్‌ఫీల్డ్ ఈవీలో కూడా తన సత్తాను చాటడానికి ఫ్లయింగ్ ఫ్లీ C6, S6 మోడళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ రెండింటి ద్వారా కంపెనీ కొత్త చరిత్రను మొదలుపెట్టాలని చూస్తుంది. ఈ రెండు మోడళ్లలో ప్రధానంగా ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎంతో ఆసక్తికరమైన మోడల్‌గా నిలవబోతోంది.

ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ వారసత్వాన్ని లేటెస్ట్ టెక్నాలజీతో కలిపి రూపొందించబడిన మోడల్. ఈ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్‌లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం విడుదలకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని కంపెనీ ప్రకటించనప్పటికీ, 2026 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం, అంటే జనవరి నుంచి మార్చి 2026 ధ్య ఈ బైక్‌ను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు, ఈ మోడళ్లు ఇప్పటికే రోడ్లపై టెస్టింగ్‌లో పలుమార్లు కనిపించాయి.

Royal Enfield Electric Bike Flying Flea C6

ఈ ఫ్లయింగ్ ఫ్లీ మోడళ్లు, ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని శక్తి, స్టైల్ మేళవింపుతో రాబోతున్నట్లు సమాచారం. రాయల్ ఎన్ఫీల్డ్ పేరుకు తగ్గట్టుగానే వీటిలో క్లాసిక్ డిజైన్‌కు ఆధునిక ఫీచర్లు జతచేయబడ్డాయని అంచనా. రాయల్ ఎన్ఫీల్డ్ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లుగా తీసుకొస్తున్న ఫ్లయింగ్ ఫ్లీ C6, S6 మోడళ్లలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఇవి కేవలం కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా ఆఫ్-రోడ్ ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటాయి.

ఈ బైక్‌‍లు స్క్రాంబ్లర్ తరహాలో డిజైన్ చేయబడ్డాయి. వీటిలో ఫ్లాట్ సీటు, ఎక్కువ దూరం ప్రయాణం చేసేలా కంఫర్ట్ మెత్తని సీటు, ఎత్తు, పల్లాలు ఉన్న రోడ్లపై కూడా సాఫీగా దూసుకుపోయేలా సస్పెన్షన్ సెటప్, డ్యూయల్ పర్పస్ టైర్లు ఉండటం వలన, నగరంతో పాటు మట్టి రోడ్లపై కూడా నడవగలదు. డిజైన్ పరంగా, వైర్-స్పోక్ వీల్స్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, స్లిమ్ సింగిల్ సీటు వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది.

Royal Enfield Electric Bike

టెక్నాలజీ విషయానికి వస్తే, ఇది పూర్తిగా లేటెస్ట్ అనుభూతిని అందిస్తుంది. ఇందులో ఇన్-హౌస్ డెవలప్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ ఉండటంతో పాటు, ప్రాసెసింగ్ కోసం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ QWM2290 ప్రాసెసర్ వినియోగించబడింది. ఈ శక్తివంతమైన చిప్‌ సెట్ వల్ల ఫాస్ట్ ప్రాసెసింగ్, మెరుగైన కనెక్టివిటీ, యూజర్-ఫ్రెండ్లీ అనుభూతి లభిస్తుంది. 4G, బ్లూటూత్, Wi-Fi సామర్థ్యాలను కలిగి ఉంది.

అంతే కాదు, రైడింగ్ సేఫ్టీ కోసం ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ABSవంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇంకా రౌండ్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా స్పష్టమైన డిస్‌ప్లేను అందించడంతో పాటు, ఇందులో ఇన్‌బిల్ట్ నావిగేషన్, డెడికేటెడ్ వాయిస్ అసిస్ట్ బటన్ కూడా ఉంటాయి. ఇవన్నీ వినియోగదారుల అనుభవాన్ని మరింత ఆధునికంగా మార్చేస్తాయి. దీని డిజైన్ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఎన్‌ఫీల్డ్ అభివృద్ధి చేసిన బైకులను గుర్తు చేస్తుంది.

Royal Enfield Electric Bike Flying Flea C6 Launch Timeline

ఫ్లయింగ్ ఫ్లీ C6 ఒక అల్యూమినియం ఫ్రేమ్ మీద తయారయ్యింది. ఇది బైక్‌ను బరువు పరంగా తేలికగా, కానీ బలంగా ఉంచుతుంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్ సస్పెన్షన్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ కలిగి ఉండటం వలన బైక్ నగర వీధుల్లో కూడా హాయిగా ప్రయాణించగలదు. బ్యాటరీ పనితీరు కూడా బాగానే ఉంటుంది. వింటేజ్ డిజైన్ కలిగిన ఈ బైక్‌కు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, May 16, 2025, 7:30 [IST]
English summary
Royal enfield electric bike flying flea c6 launch timeline revealed details
Read more on: #royal enfield #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+