రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. మైండ్ బ్లోయింగ్ డిజైన్, లేటెస్ట్ టెక్నాలజీ.. అదిరిపోతున్న మోడల్

ఇంగ్లాండ్‌ మట్టి మీద పుట్టి, ఇప్పుడు ఇండియాలో తన హావాను చూపిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ చాలా కాలంగా సేల్స్‌లో తన సత్తాను చాటుతుంది. క్లాసిక్, రెట్రో స్టైల్‌తో పాటు మరింత ఆధునికతను జోడిస్తూ, కొత్త మోడళ్లను విడుదల చేస్తూ, అమ్మకాల్లో దూసుకుపోతుంది. టూవీలర్ విభాగంలో పోటీ ఎక్కవగా ఉన్న నేపథ్యంలో ఈ బ్రాండ్, మరింత వేగంగా ముందుకు సాగేందుకు సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూవీలర్ వాహనాలకు డిమాండ్ పెరిగిన కారణంగా తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి అభివృద్ధి పనుల్లో నిమగ్నమైంది. గత సంవత్సరం 2024లో జరిగిన ప్రఖ్యాత EICMA ఎగ్జిబిషన్ సందర్భంగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ తన తొలి ఎలక్ట్రిక్ బైక్ పేరును ప్రకటించింది. అదే ఫ్లయింగ్ ఫ్లీ సీ6 (flying flea c6).

ఈవీ బైకు 2026 ప్రారంభంలో లాంచ్ కానుంది. తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను రోడ్డుపై పరీక్షించింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. ఎన్‌ఫీల్డ్ నుంచి ఈవీ బైక్ రానుందని సమాచారం తెలియడంతో బుల్లెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా దీని గురించి ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తన సాంప్రదాయ డగ్గు డగ్గు సౌండ్‌ను ప్రక్కకు పెటి సైలెంట్ మోడ్‌లో బైకును తీసుకొస్తుంది.

Royal Enfield Electric Bike

రాయల్ ఎన్‌ఫీల్డ్ 2027 వరకు ప్రతి మూడు నెలలకు ఒక కొత్త బైక్‌ను విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇది కేవలం సాధారణ అభివృద్ధి కాదని, బ్రాండ్ తమ అభిమానులకు ప్రతిసారి కొత్త అనుభూతిని అందించాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పటి వరకు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ టూవీలర్ రంగంలో అడుగుపెట్టలేదు. త్వరలో రాబోయే తన కొత్త మోడల్ ద్వారా ఈ సెగ్మెంట్‌లో కూడా తన సత్తా చాటడానికి సిద్ధమైంది.

రోడ్డుపై కనిపించిన ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్ టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలో పూర్తిగా కవర్లతో కప్పబడి ఉంది. అయితే ఆ కవర్ల మధ్య నుండి కనిపించిన కొన్ని కీలక విషయాలు, ఈ బైక్ డిజైన్‌ గురించి కొన్ని అంశాలను తెలియజేస్తున్నాయి. ముందు భాగంలో అమర్చిన LED లైట్లు చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాయి. రెండు అల్లాయ్ వీల్స్ స్మూత్‌గా నల్ల రంగులో మెరిసిపోతూ, స్పోర్టీ లుక్‌ని కలిగించేలా ఉన్నాయి.

Flying Flea C6 Spied For First Time

సీటింగ్ సెట్‌ప కూడా ప్రత్యేకంగా కనిపిస్తోంది. డ్రైవర్‌తో పాటు వెనుక కూర్చునే వారికి విడిగా రూపొందించిన సీట్లు ఉన్నాయి. ఇంకా, ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్‌లో ఏ విధమైన టెక్నాలజీ ఫీచర్లు ఉండబోతున్నాయన్న సమాచారం మాత్రం రాయల్ ఎన్‌ఫీల్డ్ బయటపెట్టలేదు. కంపెనీ 2026 తరువాతే ఈ మోడల్‌ను భారీగా ఉత్పత్తి ప్రారంభించాలనే దిశగా ఆలోచన చేస్తుంది. ఇది రిట్రో స్టైల్‌కు, మోడరన్ టెక్నాలజీతో కూడిన విధంగా ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్, 940లలో ఉపయోగించిన క్లాసిక్ మోటార్‌సైకిళ్ల డిజైన్‌ను ఆధారంగా తీసుకొని, అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దకుంటుంది. ఈ బైక్ మొదటి చూపులోనే అందరికి నచ్చేలా ఉంటుంది. ఎక్కువ కాలం మన్నికగా ఉండటానికి లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన బ్యాటరీని దీనిలో అందించే అవకాశం ఉంది. దీన్ని స్మార్ట్‌ఫోన్ ద్వారా కీ లేకుండా స్టార్ట్ చేసే కొత్త ఆప్షన్‌లో కూడా తీసుకురావచ్చు.

Royal Enfield Electric Bike Flying Flea C6 Spied For First Time

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, April 28, 2025, 10:55 [IST]
English summary
Royal enfield electric bike flying flea c6 spied for first time more details here
Read more on: #royal enfield #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+