కొత్తగా స్టన్నింగ్ లుక్‌తో బుల్లెట్ బండి.. రోడ్డుపై వెళ్తుంటే అందరి చూపు మీ మీదే.. ఫ్యాన్స్ ఫిదా కావాల్సిందే!

బైకుల రారాజు రాయల్‌ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) ఇండియాలో ప్రసిద్ధ టూవీలర్ తయారీ కంపెనీగా ఉంది. 350సీసీ నుంచి మొదలుకుని 650 సీసీ వరకు కూడా అదిరిపోయే స్టైలిష్ మోడళ్లను విక్రయిస్తుంది. యూత్ ఎక్కువగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులంటే పడిచచ్చిపోతారు. మార్కెట్లోకి ఏదైనా కొత్త వేరియంట్ విడుదల అయిందంటే చాలు దాని గురించి వాకబు చేసుకుని కొనుగోలు చేయడానికి షోరూమ్‌ల ముందు వాలిపోతారు. హంటర్, హిమాలయన్, కాంటినెంటల్ GT, ఇంటర్‌సెప్టర్ వంటి వాటికి దేశంలో భారీ డిమాండ్ ఉంది. రోడ్లపై ఈ కంపెనీ బైక్స్‌తో డుగ్ డుడ్ అంటూ సౌండ్‌తో వెళ్తుంటే ఆ రాజసమే వేరు. చుట్టుపక్కల అందరి చూపు కూడా మీ పైనే ఉంటుంది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్ ఇటీవల కాలంలో కొత్త మోడళ్లను విడుదల చేయడంపై కీలకంగా దృష్టి సారించింది.

కంపెనీ తన సేల్స్‌ను పెంచుకోవడానికి గత ఏడాది విడుదల చేసిన గెరిల్లా (guerrilla) బైకును కొత్తగా అప్‌డేట్ చేసి పీక్స్ బ్రాంజ్ కలర్ ఆప్షన్‌, డాష్ వేరియంట్‌ను స్మోక్ సిల్వర్ కలర్‌ ఆప్షన్‌లో విడుదల చేసింది, కొత్త కలర్స్‌తో వచ్చిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా ప్రీమియం లుకింగ్‌తో 450 సీసీ బైక్స్ విభాగంలో అదిరిపోయే మోడల్ అవుతుంది. కొత్తగా కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Royal Enfield Guerrilla 450 peix bronze

గెరిల్లా 450 పీక్స్ బ్రాంజ్‌ ప్రారంభ ధర రూ.2.49 లక్షల(ఎక్స్-షోరూమ్). ఆన్‌రోడ్ ధర మరింత ఎక్కువ ఉంటుంది. కంపెనీ ఈ బైక్‌‌ను రెండు కొత్త కలర్ ఆప్షన్లతో పాటు ఇప్పటికే ఉన్నటువంటి ప్లేయా బ్లాక్, బ్రావా బ్లూ వంటి పలు కలర్స్‌లలో కొనుగోలుకు ఉంచింది. కొత్త కలర్స్‌తో వచ్చిన గెరిల్లా 450 ను కొనుగోలు చేయాలనుకునే వారు మార్చి 10 నుంచి బుకింగ్స్ చేసుకోవచ్చు. డెలివరీలను కంపెనీ త్వరలో ప్రారంభించబోతుంది.

గెరిల్లా 450 ని కంపెనీ జులై 2024లో భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని డిజైన్ అడ్వెంచర్ టూరర్ బైక్ హిమాలయన్ ఆధారంగా రూపొందించబడినప్పటికీ, చూడటానికి మాత్రం అలా కనిపించదు. లుక్స్ పరంగా ఇతర ప్రీమియం బైక్స్‌కు సాటిలేనిది. ప్రస్తుతం మార్కెట్లో 450cc బైక్స్ చాలా ఉన్నప్పటికి రాయల్ ఎన్‌ఫీల్డ్‌ మోడళ్లకు ఉన్నంత డిమాండ్ మరే ఇతర కంపెనీ బైక్స్‌లకు లేకపోవడం గమనార్హం.

Royal Enfield Guerrilla 450 New Colour

రాయల్‌ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 హిమాలయన్‌లో ఉన్నట్లుగా 452cc సింగిల్-సిలిండర్ DOHC 4V లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 8,000 rpm వద్ద 39 bhp పవర్, 5,500 rpm వద్ద 40 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. స్లిప్పర్ అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌‌ను ఇంజిన్‌కు జోడించారు. కొత్త హిమాలయన్‌తో పోలిస్తే దీని బరువు తక్కువగా ఉంటుంది. ఇది 183 కిలోల బరువుతో వచ్చింది.

ఈ బైక్‌‌లో 4-అంగుళాల రౌండ్ TFT డిస్‌ప్లే, 15.3 లీటర్ల క్లాసిక్ ఫ్యూయల్ ట్యాంక్, డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గూగుల్ మ్యాప్స్‌తో ఫుల్ మ్యాప్ నావిగేషన్, ఫోర్క్ ట్యూబ్‌లు, హెడ్‌ల్యాంప్ కేసింగ్‌, సింగిల్-పీస్ సీటు, రైడర్లకు మరింత రక్షణ కోసం డబుల్ పిస్టన్ కాలిపర్‌తో 310 mm డిస్క్, వెనుక 270 mm సింగిల్ డిస్క్‌ ఉంది.

Royal Enfield Guerrilla 450 New Colour peix bronze

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు

More from DriveSpark

Article Published On: Tuesday, February 25, 2025, 14:39 [IST]
English summary
Royal enfield guerrilla 450 new colour variants launched here price details
Read more on: #royal enfield #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+