రాయల్ ఎన్‌ఫీల్ట్ బైక్స్‌లో దీన్నే ఎక్కువగా కొంటున్న జనాలు.. రెండున్నరేళ్లలో 5 లక్షల మంది

బైకుల రారాజు రాయల్ ఎన్‌ఫీల్ట్ అంటే దేశంలో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ కంపెనీ నుంచి ఒక మోడల్ మార్కెట్లోకి విడుదల అయిందంటే చాలు, వాటిని కొనడానికి చాలా మంది ఎగబడుతుంటారు. ముఖ్యంగా యూత్ అయితే ఈ బైకులంటే పడిచచ్చిపోతారు. మార్కెట్లో ఎన్ని కొత్త బైకులు లాంచ్ అయినప్పటికి కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే ఆ మజాయే వేరె లెవల్లో ఉంటుంది. కంపెనీ 350 సీసీ నుంచి మొదలుకుని 650 సీసీ వరకు కూడా టూవీలర్లను విక్రయిస్తుంది. ప్రతి ఏడాది కూడా బైక్స్ అమ్మకాల్లో దూసుకుపోతున్న కంపెనీ తాజాగా తన ఫేవరెట్ మోడల్‌కు సంబంధించిన సేల్స్ వివరాలను వెల్లడించింది. ఈ మోడల్ పేరు 'హంటర్ 350 (Hunter 350)'. ఈ బైక్ తన సరికొత్త డిజైన్, పెర్ఫామెన్స్‌తో అందరిని ఆకట్టుకుంటుంది. ఇది మార్కెట్లోకి లాంచ్ అయిన తక్కువ కాలంలోనే భారీగా అమ్మకాలను సాధించింది.

రాయల్ ఎన్‌ఫీల్ట్ నుంచి వెల్లడైన డేటా ప్రకారం, హంటర్ 350 మార్కెట్లోకి అడుగుపెట్టిన రెండున్నరేళ్లలోనే ఏకంగా 5 లక్షల యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసింది. మొత్తం కంపెనీ అమ్మకాలు పెరగడానికి ఈ మోడల్ బాగా దోహదపడింది. ఈ బైక్ ఇండియాలో మొదటిసారిగా 2022 ఆగస్టులో విడుదల అయింది. లాంచ్ అయినప్పటి నుంచి ప్రతి నెలా కొత్త కస్టమర్లకు చేరువ అవుతూనే ఉంది. లాంచ్‌కు ముందు దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

Royal Enfield Hunter 350 Bike Design

విడుదల అయిన తర్వాత దీని ఆకట్టుకునే స్టైలిష్ రూప్, ఇంజిన్ పనితీరు, బలమైన బాడీ కారణంగా దేశవ్యాప్తంగా కస్టమర్ల నుంచి ఆదరణ పొందుతూనే ఉంది. ఇన్నేళ్ల కాలంలో దీనిని రికార్డు స్థాయిలో 5 లక్షల మంది కొనుగోలు చేయడం విశేషం. అయితే ఇప్పటికి కూడా మార్కెట్లో మెరుగైన సేల్స్‌ను నమోదే చేస్తుండటం గమనార్హం. తక్కువ కాలంలోనే ఇన్ని సేల్స్ సాధించడంతో ఆటోమొబైల్ పరిశ్రమలో ఇప్పుడు దీని గురించే చర్చించుకుంటున్నారు.

రాయల్ ఎన్‌ఫీల్ట్ హంటర్ 350 దేశంలో వినియోగదారులకు తక్కువ ధరలోనే లభిస్తుంది. మార్కెట్లో దీని ధర రూ.1.50 లక్షల నుంచి రూ. 1.75 లక్షల వరకు ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్ రోడ్ అయింత మరింత ఎక్కువగా ఉంటుంది. హంటర్ 350 ఇంజిన్‌ను కంపెనీ J-సిరీస్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించింది. ఇది 349 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది.

Royal Enfield Hunter 350 Bike

దీనిలో ఫ్యూయల్ ఇంజెక్ట్, SOHC ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 20.2 bhp పవర్, 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హంటర్ 350 ఫ్లోటింగ్ స్టైల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సర్క్యులర్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. బ్లాక్ అల్లాయ్ వీల్స్ బైకుకు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ముందు 41 mm టెలిస్కోపిక్ ఫోర్క్స్, ట్విన్ గ్యాస్ చార్జ్డ్ షాక్ అబ్జార్బర్‌లను అందించారు.

రాయల్ ఎన్‌ఫీల్ట్ హంటర్ 350 బైక్‌లో ఇవి మెరుగైన రైడ్ అనుభవం కోసం అందించబడ్డాయి. మరింత రక్షణ కోసం ముందు 300mm డిస్క్ బ్రేక్, 270mm డిస్క్ బ్రేక్ అందించారు. అదనంగా రక్షణ కోసం డ్యూయల్ ఛానల్ ABS బ్రేకింగ్ సిస్టమ్‌ను అమర్చారు.

Hunter 350 Bike Price

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు

More from DriveSpark

Article Published On: Tuesday, January 28, 2025, 9:10 [IST]
English summary
Royal enfield hunter 350 bike recorded 5 lakh sales units since its launch
Read more on: #royal enfield #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+