ఇది బైక్ కాదు.. ఫాన్స్‌కు ఎమోషన్! ఈ బుల్లెట్ బండి కోసం ఎగబడుతున్నారు.. దీనికంటే మంచి ధరకు వేరే బైక్ లేదు!

రాయల్ ఎన్‌ఫీల్ట్ పేరు వినగానే భారత యువతలో ఎదో తెలియని క్రేజ్. చాలా మంది ఈ కంపెనీ నుంచి ఎప్పుడు కొత్త మోడల్ విడుదల అవుతుందా అని చాలా మంది ఎదురు చూస్తుంటారు. ప్రతి ఏడాది కూడా కంపెనీ తన సేల్స్ పరంగా విజయకేతనం ఎగురవేస్తుంది. ప్రతినెలా తన అమ్మకాల వివరాలను విడుదల చేస్తున్న రాయల్ ఎన్‌ఫీల్ట్ తాజాగా యూత్ కలల బైక్, దేశంలో బాగా డిమాండ్ ఉన్న ప్రసిద్ధ మోడల్ హంటర్ 350కి సంబంధించిన సేల్స్ డేటాను వెల్లడించింది. దీని ప్రకారం, హంటర్ 350 మరోసారి తన హవాను చూపించింది. భారత మార్కెట్లో ఈ బైక్‌కు ఉన్న క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో తాజా అమ్మకాల నివేదిక స్పష్టంగా చెబుతోంది.

ఫిబ్రవరి 2025 నెలలో హంటర్ 350 ఏకంగా 16,599 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసింది. ఇది గత ఏడాది అదే నెలలో నమోదైన 12,122 యూనిట్ల కన్నా గణనీయంగా అధికం. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది 37 శాతం వృద్ధి సాధించింది. హంటర్ 350 స్పోర్టీ లుక్, మస్కులర్ డిజైన్‌తో యంగ్ రైడర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్ట్ హంటర్ 350 అందుబాటులో ఉండే మోడల్‌గా పేరు తెచ్చుకుంది.

Royal Enfield Hunter 350 Design

ప్రస్తుతం ఈ మోడల్ భారత మార్కెట్లో ప్రారంభ ధర కేవలం రూ. 1.50 లక్షలు. టాప్ ఎండ్ వేరియంట్ విషయానికి వస్తే, ధర రూ. 1.75 లక్షలు మాత్రమే. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ వచ్చేసి స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది. హంటర్ 350 ఒక ఐకానిక్ మోటార్‌సైకిల్, ఇది క్లాసిక్ డిజైన్, శక్తివంతమైన పనితీరు, లేటెస్ట్ ఫీచర్స్‌ను కలిగి ఉంది. ఇది కొత్త రైడర్‌ల అవసరాలను తీర్చడానికి డిజైన్ చేయబడింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ 350 సీసీ ఫ్యూయల్ ఇంజెక్ట్ చేయబడిన లాంగ్ స్ట్రోక్ J ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 20.40 PS పవర్, 27 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ఇప్పుడు దేశీయ మార్కెట్‌ను మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగా కూడా తన ప్రాబల్యాన్ని కొనసాగిస్తోంది. రాయల్ ఎన్‌ఫీట్డ్ స్టైల్‌కు యువత ఆకర్షితులవుతుండటంతో, హంటర్ 350 పెద్ద విజయాన్ని అందుకుంది.

Royal Enfield Hunter 350 Sales Report

ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్ వంటి ప్రధాన మార్కెట్లలో ఈ బైక్‌కు మంచి డిమాండ్ ఉంది. భారత మార్కెట్‌లో ఇప్పటికే హిట్ అయిన హంటర్ 350, ఇప్పుడు గ్లోబల్ లెవెల్‌లోనూ అదే విధంగా ప్రభావం చూపుతోంది. ఆగస్టు 2022లో అమ్మకానికి విడుదల ఈ మోడల్‌కు ప్రజల నుంచి ఆదరణ రావడంతో గత జనవరిలో 5 లక్షల యూనిట్ల అమ్మకాల భారీ మైలురాయిని చేరుకోవడం విశేషం.

Take a Poll

కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే 5 లక్షల యూనిట్ల విక్రయాలను దాటి, ఈ బైక్ తన క్లాస్‌లో అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఒకటిగా నిలిచింది. ఇంత తక్కువ కాలంలో ఇన్ని లక్షల యూనిట్ల అమ్మకాలు పూర్తి చేసుకోవడం సాధారణ విషయం కాదు. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌ స్ట్రాంగ్ లెగసీకి నిదర్శనం అని చెప్పవచ్చు.

Royal Enfield Hunter 350

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, March 23, 2025, 11:00 [IST]
English summary
Royal enfield hunter 350 february 2025 sales recorded 16599 units more details
Read more on: #royal enfield #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+