బైక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. కొత్త రంగులో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ విడుదల.. ధర ఎంతంటే ?
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఒక ఫ్రెండ్లీ మోటార్‌సైకిల్‌గా గుర్తింపు పొందింది. ఆకర్షణీయమైన డిజైన్, అడ్వాన్సుడ్ ఫీచర్లతో కూడిన ఈ బైక్, ఇప్పుడు కొత్త రంగులో మార్కెట్‌లోకి వచ్చింది. హంటర్ 350 బైక్ బేస్ (రెట్రో), మిడ్ (డాపర్), టాప్ (రెబెల్) అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇప్పుడు మిడ్ (డాపర్) వేరియంట్‌ను కొత్త రంగులో విడుదల చేశారు. ఈ కొత్త బైక్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్‌ను ఇప్పుడు కొత్త గ్రాఫైట్ గ్రే రంగులో విడుదల చేశారు. ఈ కొత్త రంగు కేవలం మిడ్ (డాపర్) వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇంతకు ముందు ఈ వేరియంట్ రియో వైట్, డాపర్ గ్రే అనే రంగుల్లో లభించేది. కొత్తగా విడుదలైన ఈ గ్రాఫైట్ గ్రే రంగులోని రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ ధర రూ.1.77 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఈ బైక్ కోసం ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న కస్టమర్లు తమకు దగ్గరలో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌ను లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి బుక్ చేసుకోవచ్చు. ఈ బైక్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, ఎల్ఈడి టర్న్ సిగ్నల్స్‌తో ఇది ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
దీని పొడవు 2,055 ఎంఎం, వెడల్పు 810 ఎంఎం, ఎత్తు 1,070 ఎంఎం. అలాగే, దీని గ్రౌండ్ క్లియరెన్స్ 160 ఎంఎం, వీల్‌బేస్ 1,370 ఎంఎం. ఈ బైక్‌లో శక్తివంతమైన 349 సిసి జే-సిరీస్ సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది.

ఈ ఇంజిన్ 6,100 rpm వద్ద 20.2 PS హార్స్ పవర్‌ను, 4,000 rpm వద్ద 27 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. లీటరుకు 36 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది.
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్‌లో అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టైప్-సి యూఎస్‌బీ ఫాస్ట్ ఛార్జర్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్లిప్-అసిస్ట్ క్లచ్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ బరువు 181 కిలోల, ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు. సేఫ్టీ కోసం, ఇందులో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో 6-స్టెప్ అడ్జస్టబుల్ ప్రీలోడ్ ట్విన్ షాక్ అబ్సార్బర్ సస్పెన్షన్ సెటప్‌ను అమర్చారు. అల్లాయ్ వీల్స్‌తో పాటు, 110/70-17" 54P, 140/70-17" 66P కొలత గల ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్‌కు బజాజ్ అవెంజర్ 160 స్ట్రీట్, టీవీఎస్ రోనిన్, యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్, జావా 42, బజాజ్ డొమినార్ 250, హార్లే డేవిడ్‌సన్ ఎక్స్440 వంటి బైక్‌లు గట్టి పోటీని ఇస్తున్నాయి. అయితే, కొత్త గ్రాఫైట్ గ్రే రంగులో విడుదలైన ఈ హంటర్ 350 బైక్ భవిష్యత్తులో కూడా మంచి అమ్మకాలను సాధించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications








