దేశంలో హిట్.. విదేశాల్లో సూపర్ హిట్! బుల్లెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్
రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) పేరు వినగానే బైక్ ప్రేమికుల్లో ఓ ప్రత్యేకమైన గౌరవం, ఓ రఫ్, రాయిడ్ ఇమేజ్ గుర్తుకు వస్తుంది. బుల్లెట్ బ్రాండ్ అనే బలం ఎప్పుడూ వెనకపడదు. అలాంటి రాయల్ ఎన్‌ఫీల్డ్, జూలై 2025లో కూడా మార్కెట్లో తన దూకుడు చూపింది. ఈ ఒక్క నెలలో కంపెనీ మొత్తం 88,045 మోటార్ సైకిళ్లు విక్రయించి మంచి గ్రోత్‌ను నమోదు చేసింది. గత సంవత్సరం జూలైతో పోలిస్తే ఈసారి అమ్మకాల్లో 31 శాతం పెరుగుదల కనిపించింది. ఇది సంస్థకు ఊపు ఇచ్చే విషయమే కాదు, మార్కెట్లో ఎలాంటి క్రేజ్ కొనసాగుతుందో కూడా చెప్తుంది. బుల్లెట్, క్లాసిక్, హిమాలయన్ వంటి మోడళ్లకు విపరీతమైన డిమాండ్ ఉండటం, కస్టమర్ల నమ్మకం రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌ను మరింత పటిష్టంగా నిలబెడుతోంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయాల ఊపు జూలై 2025లో మరింత వేగం పుంజుకుంది. దేశీయంగానైనా, అంతర్జాతీయంగానైనా ఈ బ్రాండ్ అభివృద్ధికి కొత్తగా రాసుకుంటోంది. జూలై నెలలో కంపెనీ మొత్తం 88,045 మోటార్ సైకిళ్లు విక్రయించగా, ఇందులో దేశీయ మార్కెట్‌కి 76,254 యూనిట్లు సరఫరా చేయబడ్డాయి. ఇది గతేడాది జూలైలో నమోదైన అమ్మకాలతో పోలిస్తే సరిగ్గా 25 శాతం వృద్ధి. ఒక్క దేశీయ మార్కెట్‌నే కాదు, ఎగుమతుల్లోనూ రాయల్ ఎన్‌ఫీల్డ్ అద్భుతంగా రాణించింది.

జూలై 2025లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ 11,791 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. గత సంవత్సరం ఇదే నెలలో ఎగుమతైన సంఖ్య 6,057 మాత్రమే. అంటే ఈసారి దాదాపు రెట్టింపు వృద్ధిని నమోదుచేసింది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ గ్లోబల్‌గా ఎలా నిలబడుతోంది అనే దానికి నిదర్శనం. పాత తరం రైడర్లు అయినా, కొత్త జనరేషన్ యువత అయినా... ఈ బ్రాండ్‌పై చూపుతున్న ఆసక్తి ఏ మాత్రం తగ్గడం లేదు.
ముఖ్యంగా టూర్ రైడింగ్ కోసం, రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి ఉన్న ప్రత్యేకతను మరే ఇతర బ్రాండ్ తాకలేదు. మొత్తం అమ్మకాలు చూస్తే మంచి గణాంకాలే. ఏప్రిల్ 2025 నుంచి జూలై 2025 మధ్యకాలంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మార్కెట్లో 3,05,033 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఇది ఎఫ్‌వై24లో ఇదే నాలుగు నెలల్లో నమోదైన సంఖ్య 2,65,894 మాత్రమే. అంతే కాదు, ఎగుమతులు ఈ నాలుగు నెలల్లో రికార్డ్ స్థాయిలో ఉన్నాయి.

ఈ మొత్తం గణాంకాలు చూస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పాత ఇమేజ్‌ను కొనసాగించడమే కాకుండా, ప్రస్తుత కాలానికి తగినవిధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నట్టు స్పష్టమవుతుంది. బ్రాండ్‌కు ఉన్న సాంకేతికత, డిజైన్, మార్కెటింగ్ వ్యూహాలు కలిసివచ్చి సంస్థను స్థిరమైన వృద్ధి దిశగా నడిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లకూ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉత్పత్తులు ఎగుమతి అవుతూ, ఇండియన్ మేడ్ ప్రీమియం బైక్‌లుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది.
ఇదే ఊపును కొనసాగించడానికి రానున్న రోజుల్లో మరిన్ని మోడళ్లు తీసుకురావడానికి ప్రయాత్నాలు చేస్తుంది. కంపెనీ 450 సిసి సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని మరింతగా పెంచేందుకు ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా, శక్తివంతంగా, క్లాసిక్‌గా ముందుకు సాగుతోంది. ఇప్పటికే హిమాలయన్ 450 వంటి మోడళ్లతో ఈ విభాగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్రాండ్, తాజాగా మరో వినూత్న ఉత్పత్తి అభివృద్ధిపై దృష్టిసారించింది, అదే గెరిల్లా 450 కేఫ్ రేసర్ వెర్షన్.



Click it and Unblock the Notifications








