వచ్చాడు.. వచ్చాడు! పులి గర్జనతో రోడ్లను దడదడలాడించడానికి! తుఫానులా దూసుకువచ్చిన కొత్త ఎన్‌ఫీల్డ్

భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే ఏదో తెలియని ప్రత్యేకమైన అభిమానం. లం మారినా, తరాలు మారినా, ఈ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గకుండా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పాత కొత్త కలయికలతో కూడిన అదిరిపోయే డిజైన్లతో పలు మోడళ్లను విడుదల చేస్తూ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ప్రత్యేకమైన గుర్తింపును కొనసాగిస్తోంది. యువత నుంచి పెద్ద వయస్సు గల వారికి ఈ బ్రాండ్ నుంచి విడుదలయ్యే బైకులంటే చాలా ఇష్టం. తన వినియోగదారుల కోసం కంపెనీ కొత్త బైకును విడుదల చేసింది. ఈ మోడల్ పేరు 'హంటర్ 350 (Hunter 350)'. హంటర్‌హుడ్ ఫెస్టివల్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త హంటర్ 350ని తీసుకొచ్చి బుల్లెట్ లవర్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే యువత హృదయాలను గెలుచుకున్న హంటర్, ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన రూపంలో మన ముందుకొచ్చింది.

కొత్త హంటర్ 350 మునుపటి మోడల్‌తో పోలిస్తే ఇది మరింత స్టైలిష్‌గా, స్పోర్టీగా మారింది. కేవలం రూపమే కాదు, ఈసారి పర్ఫార్మెన్స్ పరంగాను కొన్ని కీలకమైన మార్పులు తీసుకొచ్చారు. మెరుగైన సస్పెన్షన్ సెట్టింగ్‌లు, అధునాతన టెక్నాలజీ టచ్‌లు దీనికి ఇచ్చారు. ఈసారి రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త హంటర్‌ను మరిన్ని ఆకర్షిణీయమైన కలర్స్‌లలో అందించింది. కొత్త గ్రాఫిక్స్ డిజైన్ అందరిని చూపు తిప్పుకోకుండా చేస్తుంది.

Royal Enfield Launched New Updated Hunter 350

ప్రస్తుతం ఈ బైక్ డాపర్ గ్రీన్, ఫ్యాక్టరీ బ్లాక్, డాపర్ వైట్, రెబెల్ బ్లాక్, డాపర్ గ్రే, ,రెబెల్ బ్లూ, రెబెల్ రెడ్ అనే కలర్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. పాత మోడళ్లను గమనించిన వారికీ, కొత్త హంటర్ 350లో వచ్చిన మార్పులను ఈజీగా గుర్తుపట్టవచ్చు. కొత్త రౌండ్ ఆకారపు LED హెడ్‌ల్యాంప్ బైక్ ముందు భాగంలో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇది బైక్‌కు స్టైలిష్ లుక్‌ను కలిగిస్తుంది.

ఈ కొత్త మోడల్‌లో గ్రౌండ్ క్లియరెన్స్‌ను కొద్దిగా పెంచడం వల్ల, విభిన్న రోడ్లపై కూడా నిశ్చింతగా ప్రయాణించవచ్చు. సీటింగ్ పొజిషన్‌ను సైతం మరింత సహజంగా, సౌకర్యంగా మార్చారు, దీని వలన లాంగ్ జర్నీలు చేసే సమయంలో రైడర్ అలసటకు గురికావడానికి వీలుండదని తెలుస్తుంది. ఇటీవల కాలంలో చాలా మంది యువత బైక్ టూర్స్ లాంటివి ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో అలాంటి వారు హాయిగా ఈ మోడల్‌ను కొనుగోలు చేయవచ్చు.

Hunter 350 New Model

సస్పెన్షన్ సిస్టమ్‌ కూడా కొత్తగా అప్‌డేట్ చేశారు. దీంతో అన్ని రకాల రోడ్లపై ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. మరో విషయం ఏమిటంటే, ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ 350cc విభాగంలో స్లిప్-అసిస్ట్ క్లచ్ పొందిన తొలి మోడల్. దీని వలన గేర్‌లను మార్చడం మరింత ఈజీగా ఉంటుంది. ట్రాఫిక్‌లో నడిపేటప్పుడు ఒత్తిడి తక్కువగా ఉంటుంది. బైక్‌ను నడిపే రైడర్లకు ఉపయోగకరంగా ఉండటానికి అధునాతన ఫీచర్స్‌ను అందించారు.

రాత్రి ప్రయాణాలలో రోడ్డును క్లియర్‌గా చూడటానికి LED హెడ్‌ల్యాంప్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్, ప్రయాణాల్లో ఫోన్లు చార్జ్ చేసుకోవడానికి టైప్-C USB ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఈ బైకులో ఉంటుంది. ఇది దాని పాత మోడల్ వలే, అదే 349 సీసీల సింగిల్ సిలిండర్ ఎయిర్, ఆయిల్-కూల్డ్ OHC ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్‌‌తో రన్ అవుతుంది. 20.2 bhp గరిష్ట శక్తిని, 27 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Royal Enfield Hunter 350 Design

ఈ శక్తివంతమైన ఇంజిన్‌ను 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు. 36 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదని అంచనా. ఒక సారి నింపితే 450 కి.మీలపైనే ప్రయాణించవచ్చు. దీని బేస్ రెట్రో ఫ్యాక్టరీ వేరియంట్ ధర రూ.1.50 లక్షలు, మెట్రో డాపర్ వేరియంట్లు రూ.1.70 లక్షలు, మెట్రో రెబెల్ వేరియంట్ల ధర రూ.1.75 లక్షల వరకు ఉంది. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు.

More from DriveSpark

Article Published On: Sunday, April 27, 2025, 7:30 [IST]
English summary
Royal enfield launched new updated hunter 350 motorcycle all top things details
Read more on: #royal enfield #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+