గోవా సముద్ర తీరాన దేశంలోకి ఒక స్పెషల్ బైక్ అడుగుపెట్టింది.. రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్‌కు పండగే
గోవా సముద్రతీరాన జరిగే మోటోవర్స్ 2025 వేడుక ఈసారి ప్రత్యేకంగా బైక్ ప్రేమికులకు పండుగలా మారింది. ఎందుకంటే, ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన వేళలో రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త మీటియోర్ 350 సన్‌డౌనర్ ఆరెంజ్(Meteor 350 Sundowner Orange) స్పెషల్ ఎడిషన్‌ను అద్భుతంగా ఆవిష్కరించింది. వేలాది మంది ఉత్సాహభరితమైన రైడర్లు, బైక్ అభిమానులు, కమ్యూనిటీ సభ్యుల సమక్షంలో ఈ లాంచ్ జరగడంతో ఆ వేదిక ఒక్కసారిగా ఉత్సాహంతో నిండిపోయింది. మీటియోర్ 350 ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటి. దాని క్రూయిజర్ డిజైన్, ఆహ్లాదకరమైన రైడింగ్ పోజిషన్, సున్నితమైన రైడ్ క్వాలిటీ దూర ప్రయాణాలు చేసే వారికి ఇది ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా మారింది.
రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చిన సన్‌డౌనర్ ఆరెంజ్ స్పెషల్ ఎడిషన్ 2025 మోడల్ మరింత అప్‌గ్రేడ్ రూపంలో లాంగ్ రైడర్లను ధ్యాసలో పెట్టుకుని తయారుచేసిన ప్రత్యేక మోడల్‌గా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రత్యేక ఎడిషన్ కలర్ స్కీమ్ సన్‌డౌనర్ ఆరెంజ్ పేరు చెబుతున్నట్టుగానే అస్తమయ సమయంలో సూర్యుడు ఆకాశం మీద జార్చే ఆరెంజ్ టోన్ల నుంచి ప్రేరణ పొందిన ప్రకాశవంతమైన, ఆకర్షణీయమైన షేడ్.

రోడ్డుపై చూసిన వారు రెండుసార్లు తిరిగి చూసేలా ఉండే ఈ పెయింట్ జాబ్ బైక్‌కి స్పెషల్ స్టేటస్‌ను ఇచ్చింది. సూర్యాస్తమయం రంగును ప్రతిబింబిస్తూ ఈ క్రూయిజర్‌కు ఒక ప్రీమియమ్, ట్రావెల్-థీమ్ వైబ్ అందిస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సన్‌డౌనర్ ఆరెంజ్ ఎడిషన్‌ను ప్రత్యేకంగా లాంగ్ రైడ్స్‌ను ఇష్టపడే ప్రయాణికుల కోసం రూపొందించారు. సౌకర్యం, స్థిరత్వం, యుటిలిటీపై ఎక్కువ దృష్టి పెట్టి ఈ మోడల్‌ను ఫైన్‌ట్యూన్ చేశారు.
లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు రైడర్‌కు రిలాక్స్‌డ్ ఫీలింగ్ ఇవ్వడానికి మోడిఫైడ్ రైడింగ్ ఎర్గోనామిక్స్ ఉండే అవకాశం ఉంది. అదనంగా, స్టోరేజ్ అవసరం ఉన్న రైడర్లను దృష్టిలో పెట్టుకుని అదనపు యాక్సెసరీ ఆప్షన్లను కూడా అందించే అవకాశం ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 సన్‌డౌనర్ ఆరెంజ్ స్పెషల్ ఎడిషన్ నిజంగా లాంగ్ రైడింగ్‌ను ప్రేమించే రైడర్ల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన బైక్ అనే చెప్పాలి.

రూ. 2,18,882 (ఎక్స్-షోరూమ్) ధరతో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన ఈ మోడల్ కోసం బుకింగ్‌లు నవంబర్ 22, 2025 నుంచి ప్రారంభమవుతాయి. డిజైన్, రైడింగ్ కంఫర్ట్, మాడర్న్ టెక్నాలజీ.. ఈ మూడు అంశాలను ఒకే బైక్‌లో కలిపినట్లు ఈ సన్‌డౌనర్ ఆరెంజ్ ఎడిషన్ ప్రత్యేకతగా నిలుస్తుంది. 350cc విభాగంలో ఇంజిన్ పనితీరు పరంగా ఇది అద్బుతమైన రైడింగ్ పెర్ఫామెన్స్‌ను అందించనుంది.
ఈ బైక్‌లో అందించిన ప్రీమియం అల్యూమినియం ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ మొదటి చూపులోనే క్లాసిక్ స్టైల్‌ని గుర్తు చేస్తాయి. స్పోక్ వీల్స్ అందించే ఆ పాతకాలపు లుక్ అలాగే ఉండగా, ట్యూబ్‌లెస్ టైర్ల సౌకర్యం మాత్రం పూర్తిగా ఆధునికంగా ఉంటుంది. రహదారిలో పంక్చర్‌లాంటి సమస్యలు వచ్చినా, ట్యూబ్‌లెస్ టైర్ల కారణంగా రైడర్‌కు వచ్చే సౌకర్యం మరింత పెరుగుతుంది.

రాత్రి డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు LED హెడ్‌ల్యాంప్‌లు అద్భుతమైన ప్రకాశాన్ని అందిస్తాయి. లాంగ్ ప్రయాణాల్లో ఫోన్, GPS లేదా ఇతర పరికరాలను ఛార్జ్ చేసుకోవాల్సిన సందర్భాల్లో USB టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఎంతో ఉపయోగకరం. మొత్తంగా చూస్తే, సన్‌డౌనర్ ఆరెంజ్ ఎడిషన్ మీటియోర్ 350కు ఒక కొత్త ప్రీమియం లుక్ మాత్రమే ఇవ్వలేదు, రైడింగ్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా ఫీచర్‌లతో పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది.


Click it and Unblock the Notifications








