ఓ మై గాడ్! రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ కలర్ ఆప్షన్ చూస్తేనే మనసు దోచేస్తుంది! షాడో యాష్ ఎడిషన్ లాంచ్
రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) మళ్లీ తన అభిమానులను అలరించేలా కొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. బైకుల ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ బ్రాండ్, తన గెరిల్లా 450 (Guerrilla 450) లైనప్‌ను మరింత బలోపేతం చేస్తూ, ఇప్పుడు ఆకర్షణీయమైన షాడో యాష్ అనే కొత్త కలర్ వేరియంట్‌ను పరిచయం చేసింది. 450 సీసీ విభాగంలో గెరిల్లా 450 ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆఫ్-రోడ్ రైడింగ్‌కి సరిపోయే రగ్గడ్ లుక్, రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ప్రత్యేకమైన క్లాసిక్ డిజైన్ టచ్ ఈ బైక్‌ను మిగతా పోటీదారుల కంటే ఒక మెట్టు ముందుకు నిలబెడతాయి.ఈ కొత్త షాడో యాష్ కలర్ వేరియంట్ బైక్‌కు మరో ప్రత్యేకతను తెస్తోంది.
బ్లాక్-అవుట్ డిటెయిలింగ్‌తో కూడిన ఆలివ్-గ్రీన్ ఫ్యూయల్ ట్యాంక్, దానికి తోడుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ సిగ్నేచర్ ట్రిప్పర్ డాష్ కన్సోల్ ఉండటం బైక్‌ను మరింత ప్రీమియమ్‌గా చూపిస్తోంది. ఈ కలర్ జోడించడం ద్వారా బైక్ రూపం మరింత అగ్రెసివ్‌గా, కానీ స్టైలిష్‌గా అనిపించేలా తీర్చిదిద్దబడింది. దీనితో పాటు, రాయల్ ఎన్‌ఫీల్డ్ తన గెరిల్లా 450కి పీక్స్ బ్రాంజ్, స్మోక్ సిల్వర్ కలర్ వేరియంట్లను కూడా అందిస్తుంది. ఈ కలర్స్ కస్టమర్‌ను ఆకర్షించనున్నాయి.

ధర విషయానికొస్తే, ఈ కొత్త వేరియంట్‌ను రూ.2.49 లక్షల (ఎక్స్‌షోరూమ్) వద్ద లాంచ్ చేశారు. ఇది ప్రీమియమ్ ఆఫరింగ్ అయినప్పటికీ, దీని ఫీచర్లు, పనితీరు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ విలువలతో ఈ ధర సమంజసంగా కనిపిస్తోంది. ఈ కొత్త కలర్ వేరియంట్ మార్కెట్లోకి రావడంతో గెరిల్లా 450 అమ్మకాలు మరింత పెరిగి, రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం సేల్స్‌లో కూడా గణనీయమైన వృద్ధిని సాధించే అవకాశం ఉంది.
అనలాగ్, డాష్, ఫ్లాష్ వేరియంట్లలో లభిస్తున్న ఈ బైక్, ఇప్పుడు డాష్ వేరియంట్‌లో ప్రత్యేకంగా షాడో యాష్ అనే ఆకర్షణీయమైన కొత్త కలర్ ఆప్షన్‌ను పొందింది. డ్యూయల్-టోన్ ఫ్యూయల్ ట్యాంక్‌తో వచ్చే ఈ కొత్త కలర్, గెరిల్లా 450 లుక్‌ను మరింత స్టైలిష్‌గా, ప్రీమియమ్‌గా మార్చింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, గెరిల్లా 450కి శక్తినిచ్చేది హిమాలయన్ 450తో పంచుకున్న అదే 452 సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ షెర్పా ఇంజిన్.

ఈ శక్తివంతమైన మోటారు 40 బిహెచ్‌పి పవర్, 40 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి తోడు ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్ కలయిక, నగర రోడ్లపై సాఫ్ట్ రైడింగ్‌కి, హైవేల్లో తగ్గట్టుగా వేగానికి ఒకేసారి తగిన అనుభూతిని ఇస్తాయి. గెరిల్లా 450 మొదటి చూపులోనే ఇది రైడర్‌ను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దబడింది. ముందు భాగంలో ఉన్న రౌండ్ LED హెడ్‌లైట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ సిగ్నేచర్ స్టైల్‌ను ప్రతిబింబిస్తాయి.
అదే రౌండ్ ఆకృతిలోనే ఉన్న ట్రిప్పర్ డ్యాష్‌బోర్డ్, వింగ్ మిర్రర్లు క్లాసిక్ లుక్‌కు మరింత బలం చేకూరుస్తాయి. వెనుక భాగంలో టర్న్ ఇండికేటర్లలోనే ఇంటిగ్రేట్ చేసిన LED టెయిల్ లైట్లు బైక్‌కు ఒక లేటెస్ట్ టచ్‌ను ఇస్తాయి. క్లాసిక్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ గెరిల్లా 450కు ప్రత్యేకతను తీసుకువస్తే, ఫోర్క్ గైటర్లు, 160-సెక్షన్ వైడ్ టైర్లతో కూడిన క్లీన్ టెయిల్ సెక్షన్ బైక్‌ను మరింత రగ్గడ్‌గా, స్పోర్టీగా చూపిస్తాయి.

సొగసైన అల్లాయ్ వీల్స్, సిల్వర్‌లో పూర్తి చేసిన బాడీ ప్యానెల్స్ దీని ప్రీమియమ్ ఫీల్‌ను మరింత పెంచుతాయి. ముఖ్యంగా, డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్స్ బైక్‌ను రోడ్డుపై ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ అన్ని డిజైన్ అంశాలు కలిపి, గెరిల్లా 450ను రాయల్ ఎన్‌ఫీల్డ్ లైనప్‌లో ఒక ప్రత్యేకమైన మోడల్‌గా నిలబెట్టాయి. రైడింగ్ అనుభవం మాత్రమే కాదు, చూసే వారికి కూడా ఈ బైక్ ఓ క్లాస్ చూపిస్తుంది.


Click it and Unblock the Notifications








