దేశమంతా బుల్లెట్ ఫీవర్! సింహాసనం కాపాడుకుంటున్న రాయల్ ఎన్‌ఫీల్డ్! దేశంలోనే కాదు, ప్రపంచంలోనూ తోపు
భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) బైకుకు ఏ రేంజ్‌లో క్రేజ్ ఉంటుందో అందిరికి తెలిసిందే. దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్రాండ్ చాలా కాలంగా ఇతర కంపెనీలకు బలంగా ఎదుర్కొని అమ్మకాల్లో దూసుకుపోతుంది. తాజాగా ఏప్రిల్ నెల ముగిసి మే నెల ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వాహన తయారీదారులు గత నెలలో సాధించిన సేల్స్ వివరాలను వెల్లడిస్తున్నారు. ఇప్పడు ఇదే క్రమంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా తన విక్రయాలను విడుదల చేసింది. దీని ప్రకారం, ఈ బ్రాండ్, 2025 ఏప్రిల్‌లో మంచి విజయాన్ని అందుకుంది. తాజా అమ్మకాల నివేదిక చూస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ మళ్లీ తన పేరుకు తగ్గట్టే విజయాన్ని నమోదు చేసిందని స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 86,559 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది గత ఏడాది 2024 ఏప్రిల్ నెలలో జరిపిన 82,043 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే దాదాపు 6 శాతం అమ్మకాల వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఇది కేవలం దేశీయ మార్కెట్‌కే కాకుండా, ఎగుమతులకు సంబంధించిన మొత్తం గణాంకం కావడం విశేషం. అంటే గత ఏడాది కంటే ఈ సారి చాలా ఎక్కువ సంఖ్యలో అమ్ముడయ్యాయి.

కంపెనీకి దేశీయంగా మళ్లీ పెరుగుతున్న ఆదరణ, అంతర్జాతీయంగా కలిగిన బ్రాండ్ విలువ, అలాగే కొత్తగా వచ్చిన మోడళ్లకు ఉన్న ఆదరణ కారణంగా అమ్మకాలు బాగా పుంజుకున్నాయి. అదే సమయంలో ఇదే కాలంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లు తమ క్లాసిక్ లుక్, స్టెబుల్ పెర్ఫార్మెన్స్, శక్తివంతమైన, నమ్మకమైన పనితీరు కారణంగా వినియోగదారుల్లో మరింత నమ్మకం కలిగి ఈ కంపెనీ టూవీలర్స్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు.
అలాగే, కంపెనీ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన కొన్ని స్పెషల్ ఎడిషన్లు, రీట్రో మోడళ్లకు చేసిన అప్‌డేట్స్ కూడా మార్కెట్ స్పందనలో కీలక పాత్ర పోషించాయి. దేశంలోనే కాకుండా విదేశీ మార్కెట్లలోనూ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల డిమాండ్ మరింత పెరుగుతుండడం, కంపెనీకి ఉత్సాహాన్ని ఇస్తుంది. భారతదేశ అమ్మకాలను మాత్రమే చూసినట్లయితే గత ఏడాది ఏప్రిల్‌లో 75,038 బైక్‌లను విక్రయించింది. ఈ ఏడాది అదే నెలలో ఇది 76,002 యూనిట్లకు పెరిగింది.

ఇది 1 శాతం మాత్రమే పెరుగుదల అయినప్పటికీ, నెమ్మదిగా అయినా స్థిరమైన వృద్ధిని సూచిస్తుంది. కంపెనీకి దేశీయ స్థాయిలో ఇప్పటికీ మద్దతు ఉంటుందన్నదానికి ఇది ఓ నిదర్శనం. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏప్రిల్ 2025లో చెన్నై కర్మాగారం నుంచి 10,557 యూనిట్ల బైక్‌లు ఎగుమతి చేసింది. ఇది గత సంవత్సరం ఏప్రిల్‌తో పోలిస్తే దాదాపు 55 శాతం వృద్ధికి సమానంగా ఉంటుంది.
ఇది ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్రాండ్‌కు పెరుగుతున్న ఆదరణను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ముఖ్యంగా యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా పసిఫిక్ దేశాల్లో దీని విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయి. అయితే ఈ విక్రయాల మధ్య మరో విషయం ఏమిటంటే, మార్చి 2025లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 1.01 లక్షల యూనిట్లను విక్రయించింది. దానితో పోలిస్తే, ఏప్రిల్‌లో దీనికంటే 14.32 శాతం తక్కువ అమ్మకాల నమోదయ్యాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








