స్టేటస్ సింబల్‎గా మారిపోయిన రాయల్ ఎన్ ఫీల్డ్..ప్రతి 25 సెకన్లకు 1 బైక్ అమ్మి రికార్డ్..కిక్కిరిస్తున్న షోరూమ్స

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ఉండే గౌరవం, ప్రత్యేకమైన స్థానం అందరికీ తెలిసిందే. చాలామంది భారతీయులు ఈ బైక్‌లను స్టేటస్ కోసమే కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ గత నవంబర్ 2025 నెలలో ఏకంగా లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటి కొత్త రికార్డు సృష్టించింది. అయితే, ఈ సంవత్సరం అక్టోబర్ నెలతో పోలిస్తే నవంబర్‌లో అమ్మకాలు కొంత తగ్గుముఖం పట్టాయి. మొత్తం అమ్మకాల గణాంకాలు, గత సంవత్సరం నవంబర్, ఈ సంవత్సరం అక్టోబర్‌తో పోలిక వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ నవంబర్ 2025లో మొత్తం 1,00,670 వాహనాలను విక్రయించి ఒక కొత్త రికార్డును నెలకొల్పింది. ఇది కంపెనీకి గణనీయమైన విజయం. ఈ విక్రయాలలో 90,405 యూనిట్లు దేశీయ మార్కెట్ నుంచి రాగా, 10,265 యూనిట్లు విదేశాలకు ఎగుమతి అయ్యాయి.

Royal Enfield Sales Cross 1 Lakh Units in November 2025 Strong Year-on-Year Growth

ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌కు పెరుగుతున్న ఆదరణను ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. దేశీయంగా విక్రయాలు భారీగా ఉండటం అనేది, భారతదేశంలో తమ ఉత్పత్తులకు నిరంతరంగా ఉన్న బలమైన డిమాండ్‌ను ధృవీకరిస్తోంది.

నవంబర్ 2025 విక్రయాలు, గతేడాది నవంబర్ 2024 విక్రయాలతో పోలిస్తే అద్భుతమైన వృద్ధిని కనబరిచాయి. 2024 నవంబర్‌లో కేవలం 82,257 వాహనాలు మాత్రమే అమ్ముడవగా, ఈసారి మొత్తం అమ్మకాలు 18,413 యూనిట్లు అధికంగా ఉన్నాయి. ఈ వార్షిక వృద్ధికి ప్రధాన కారణం, 350 సీసీ లోపు సెగ్మెంట్ . చౌకైన మరియు అధిక మైలేజీనిచ్చే క్లాసిక్ 350, హంటర్ 350 వంటి బైక్‌లు ఈ విభాగంలో ఉన్నాయి.

Royal Enfield Sales Cross 1 Lakh Units in November 2025 Strong Year-on-Year Growth

గత ఏడాదితో పోలిస్తే ఈ విభాగంలో ఏకంగా 19,051 వాహనాలు అధికంగా అమ్ముడయ్యాయి (మొత్తం 90,312 యూనిట్లు). అయితే, 350 సీసీకి పైబడిన ఇంజిన్ సామర్థ్యం గల (650cc twin-cylinders వంటివి) బైకుల విక్రయాలు మాత్రం స్వల్పంగా 638 యూనిట్లు తగ్గి, ఈ విభాగంలో చిన్నపాటి క్షీణత కనిపించింది.

వార్షికంగా వృద్ధి ఉన్నప్పటికీ, అంతకుముందు నెల అంటే అక్టోబర్ 2025 (మొత్తం 1,24,951 యూనిట్లు) తో పోలిస్తే నవంబర్‌లో అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మొత్తం విక్రయాల్లో 24,281 యూనిట్లు తగ్గి, 19.43 శాతం క్షీణత నమోదైంది. దేశీయ విక్రయాలలో కూడా 22.63 శాతం క్షీణత కనిపించింది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణం పండుగ సీజన్ ప్రభావం.

Royal Enfield Sales Cross 1 Lakh Units in November 2025 Strong Year-on-Year Growth

సాధారణంగా దీపావళి వంటి పండుగల సమయంలో మరియు జీఎస్టీ పన్ను తగ్గింపుల వల్ల వినియోగదారులు అక్టోబర్ నెలలోనే అధిక సంఖ్యలో వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈ భారీ కొనుగోళ్ల తర్వాత వచ్చే నవంబర్‌లో అమ్మకాలు కొంత తగ్గుముఖం పట్టడం అనేది పరిశ్రమలో సాధారణంగా జరిగే పరిణామం.

దేశీయ మార్కెట్‌లో అమ్మకాలు తగ్గినప్పటికీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎగుమతి విభాగంలో అద్భుతమైన పనితీరు కనబరిచింది. అక్టోబర్‌లో కేవలం 8,107 వాహనాలు ఎగుమతి కాగా, నవంబర్‌లో అది 10,265 యూనిట్లకు పెరిగింది. ఇది నెలవారీగా 26.62 శాతం వృద్ధి. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 వంటి ప్రీమియం బైక్‌లకు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను, అలాగే సరఫరా గొలుసు మెరుగుదలను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, December 2, 2025, 16:38 [IST]
English summary
Royal enfield sales cross 1 lakh units in november 2025 strong year on year growth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+