అలాంటోడు మళ్లీ వస్తున్నాడు.. బుకింగ్స్ స్టార్ట్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఇక మార్కెట్లో పోటీ తప్పదు!
బైకుల రారాజు రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి గతంలో స్క్రామ్ 440 (Scram 440) ఎంతో అట్టహాసంగా విడుదల అయింది. దీనిపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికి ఆవిష్కరణ అనంతరం ఈ మోడల్ ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల్లా ఇంజిన్ వ్యవస్థలో కొన్ని సమస్యలు తలెత్తడంతో బైక్ ప్రాసెస్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ సమస్యలు బైక్ పనితీరుపై ప్రభావం చూపి, కంపెనీకి అవి వెంటనే పరిశీలించాల్సిన పరిస్థితి తీసుకొచ్చాయి. ప్రారంభంలోనే సమస్యలు రావడంతో బుకింగ్స్ నిలిపివేశారు. అయితే తాజాగా, రాయల్ ఎన్ఫీల్డ్ ఈ సమస్యలపై దృష్టి సారించి అవసరమైన పరిష్కారాలను చేసినట్లు తెలుస్తోంది. సమస్యలు సరిచేసిన తరువాత, స్క్రామ్ 440 బైక్ మళ్లీ బుకింగ్స్‌కి అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులకు సులభంగా డెలివరీలు చేయడం ద్వారా ఈ మోడల్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి బ్రాండ్ ప్రయత్నిస్తోంది.
లోపం అంత పెద్దది కాదనిపించినప్పటికీ, కొంతసేపు బైక్ నడిపిన తర్వాత ఇంజిన్ తిరిగి స్టార్ట్ కాకపోవడమే సమస్యకు కారణమైంది. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఇంజిన్ ఆగిపోవడం జరగకపోయినా, బైక్ ఆపిన తర్వాత మళ్లీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇంజిన్ స్టార్ట్ కాకపోవడం ఇబ్బంది కలిగించింది. మాగ్నెటోలో ఉన్న వుడ్‌ఫ్రఫ్ కీ అనే చిన్న భాగంలోనే సమస్య గుర్తించారు. అందులోనూ, డెలివరీ చేసిన మొత్తం యూనిట్లలో రెండు శాతం యూనిట్లకు మాత్రమే లోపం తలెత్తింది.

అయినప్పటికీ, కస్టమర్లకు అత్యుత్తమ అనుభవం అందించాలనే బాధ్యతతో, సమస్యను పూర్తిగా పరిష్కరించేవరకు బుకింగ్‌లు, డెలివరీలను నిలిపివేయాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పుడు సమస్యను పరిష్కరించి బైక్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి కంపెనీ అన్ని చర్యలు తీసుకుంటోంది. సమస్యను సరిచేసిన తర్వాతే బుకింగ్‌లను తిరిగి ప్రారంభించిందని సమాచారం. దీనిపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ భారతదేశం అంతటా డీలర్లు స్క్రామ్ 440 బుకింగ్‌లు తిరిగి తీసుకోవడం ప్రారంభించినట్లు సమాచారం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 తన శక్తివంతమైన కొత్త 440cc LS ఇంజిన్‌తో మరింత ఆసక్తికరంగా రూపుదిద్దుకుంది. నగర వీధుల్లో సౌకర్యంగా నడిపే విధంగానే, ఆఫ్-రోడ్ పరిస్థితుల్లోనూ దిట్టమని నిరూపించేలా బలమైన తక్కువ-మధ్య రేంజ్ టార్క్‌ను ఈ బైక్ అందిస్తుంది. 443cc సామర్థ్యం గల ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజిన్ 6,250 rpm వద్ద గరిష్టంగా 25.4 bhp శక్తిని, 4,000 rpm వద్ద 34 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ శక్తిని సమర్థవంతంగా వినియోగించడానికి బైక్‌లో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఏర్పాటు చేశారు. స్క్రామ్ 440 డైనమిక్ వీల్ కాంబినేషన్‌తో కూడా ప్రత్యేకతను కలిగి ఉంది. ముందుభాగంలో 19 అంగుళాల వీల్, వెనుకభాగంలో 17 అంగుళాల వీల్ ఉండే విధంగా రూపొందించారు, ఇది ఆఫ్-రోడ్ రైడింగ్‌కు మరింత స్థిరత్వం, కంఫర్ట్ ఇస్తుంది. వినియోగదారుల ఎంపికలకు అనుగుణంగా, ఈ మోడల్ అల్లాయ్ వీల్స్ లేదా స్పోక్డ్ వీల్స్‌తో లభిస్తోంది.
రాయల్ ఎన్ఫీల్డ్ ఈ బైక్‌ను ట్రైల్, ఫోర్స్ అనే రెండు వేరియంట్లలో అందిస్తోంది. ఈ రెండు వేరియంట్లలో వీటిలో ఫీచర్లు, స్టైల్, వీల్స్ వేరువేరుగా ఉంటాయి. ప్రీమియం లుక్, అధిక సామర్థ్యం కలిగిన ఈ మోడల్‌కి ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.2.08 లక్షలుగా నిర్ణయించారు. నగర జీవనశైలికి తగ్గట్టు, సాహసయాత్రల్లోను దిట్టగా నిలిచేలా స్క్రామ్ 440 రూపుదిద్దుకున్నదని స్పష్టంగా అనిపిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








