ఊర మాస్ ఇక్కడ.. బైక్ లవర్స్‌కు ఇక నిద్రపట్టదు.. దుమ్ములేపే మోడల్‌ను దింపిన రాయల్ ఎన్‌ఫీల్డ్
ప్రీమియం మోటార్ సైకిళ్ల తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ (royal enfield) భారతీయ మార్కెట్లో చాలా ఏళ్లుగా తన టూవీలర్స్‌ను విక్రయిస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్లు, అధునాతన ఫీచర్లతో అన్ని రకాల రోడ్లపై రయ్ మంటూ దూసుకుపోయేలా బైక్స్‌ను లాంచ్ చేస్తుంది. 350 సీసీ నుంచి మొదలుకుని అన్ని ఇంజిన్ సీసీలలో కూడా టూవీలర్స్‌ను లాంచ్ చేస్తూ, ప్రతి ఏడాది అమ్మకాల్లో మెరుగైన గణంకాలను సాధిస్తుంది. ప్రధానంగా ఎన్‌ఫీల్డ్ తన వాహనాలను భారతీయ వినియోగదారులకు కోసం అందుబాటు దరల్లో మోడళ్లను విక్రయిస్తుంది. యూత్ ఎక్కువగా ఈ కంపెనీ బైకులను ఇష్టపడుతుంటారు. రోడ్డుపై డుగ్గు డగ్గు సౌండ్‌తో వెళ్తుంటే అందిరి చూపు కూడా బైక్ పైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కంపెనీ కొత్త మోడళ్లను విడుదల చేయడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. తాజాగా కొత్త ఏడాది ప్రారంభంలోనే రాయల్ ఎన్‌ఫీల్డ్ 'స్క్రామ్ 440 (scram-440)' అనే బైకును విడుదల చేసింది.
ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్స్‌ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు. స్క్రామ్ 440 ట్రైల్ , ఫోర్స్ అనే రెండు వేరియంట్లలో కొనుగోలుకు లభిస్తుంది. మొదటి మోడల్ ట్రైల్ ప్రారంభ ధర రూ. 2,08,000 నుంచి మొదలవుతుంది. ఇది బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలుకు ఉంది. రెండో వేరియంట్ ఫోర్స్ ప్రారంభ ధర రూ.2.15 లక్షల నుంచి మొదలవుతుంది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు.

ఆన్‌రోడ్ ధర మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ మోడల్ బ్లూ, గ్రీన్, టీల్ కలర్స్‌లలో అందుబాటులో ఉంటుంది. స్క్రామ్ 440 శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌తో వచ్చింది. ఇది 443 సీసీ ఎయిర్/ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జత చేశారు. ఇది 6,250 rpm వద్ద 25.4 PS హార్స్‌పవర్, 4,000 rpm వద్ద 34 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంది. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ను అందించారు. బ్రేకింగ్ సిస్టం కూడా చాలా వరకు కొత్తగా అనిపిస్తుంది. డ్యూయల్ ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను కలిగి ఉంది. దీనిలో డ్యూయల్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందించారు. రైడర్లు కూర్చోవడానికి ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వని మెత్తని మంచి సీటు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.

స్క్రామ్ 440 ముందు మెరుగైన LED హెడ్‌లైట్ సెటప్‌ను కలిగి ఉంది. ఆకర్షణీయమైన డిజైన్‌కు తోడుగా టర్న్ ఇండికేటర్‌లు ఉన్నాయి. ఇది డజన్ల కొద్దీ లేటెస్ట్ ఫీచర్స్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్లను ఛార్జ్ చేయడానికి USB ఛార్జర్ సపోర్ట్, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. హ్యాండిల్‌బార్ కూడా రైడర్లకు గట్టి గ్రిప్ ఇస్తుంది. 19-17-అంగుళాల స్పోక్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లను ఈ బైక్ కలిగి ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 డిజైన్, పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ పేర్కొంటుంది. ఇది ముఖ్యంగా యూత్ వినియోగదారులు ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ మోడల్ ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X, యెజ్డీ స్క్రాంబ్లర్ బైక్‌లకు ఇది గట్టి పోటీగా నిలిచే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








