350 నుంచి 750cc దాకా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ అప్‌కమింగ్ బైక్స్.. ఇప్పుడు హడావుడి చేసే సమయం వచ్చింది!

బైకుల రారాజు అంటే దేశంలో అందరికి గుర్తుకువచ్చే కంపెనీ ఏదంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield). తన క్లాసిక్ డిజైన్‌కు తోడుగా లేటెస్ట్ రూపాన్ని జోడిస్తూ టూవీలర్ విభాగంలో ప్రపంచంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. గత కొద్దికాలంగా, కంపెనీ కీలకమైన చర్యలు తీసుకుంటుంది. భారత వాహన మార్కెట్ మంచి లాభాదాయకంగా ఉండటంతో చాలా టూవీలర్ తయారీదారులు మార్కెట్‌ను కైవసం చేసుకోవడానికి వరుసగా కొత్త కొత్త టూవీలర్స్‌ను విడుదల చేస్తూ క్రమంగా ప్రజలకు తమ వాహనాలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి పోటీ వాతావరణం తట్టుకుని నిలబడటానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ పలు కొత్త బైకులను విడుదల చేయాలని చూస్తుంది.

ఒకవైపు తన పాత మోడళ్లతో మరిన్ని అదనపు ఫీచర్స్‌, స్వల్ప డిజైన్ మార్పులతో తీసుకొస్తూనే అదే సమయంలో మరిన్ని కొత్త మోడళ్లను తీసుకురావాలని భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. గత కొద్దికాలంగా, కంపెనీ తీసుకున్న చర్యలు దాని వ్యూహాత్మక దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పటికే క్లాసిక్ 350కి చేసిన అప్‌డేట్స్ కారణంగా వినియోగదారులు దీన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దానికి తోడు గోవన్ క్లాసిక్ వేరియంట్ విడుదల కావడం కూడా జరిగింది.

Royal Enfield Upcoming 350cc BIkes In India

ప్రత్యేక రైడింగ్ కావాలని కోరుకునే వినియోగదారుల కోసం విడుదలైన హంటర్ 350, యువతలో ట్రెండీ లుక్‌కి ప్రాధాన్యత ఇచ్చే వాహన ప్రియుల్ని బాగా ఆకట్టుకుంది. ఇవన్నీ చూస్తే, రాయల్ ఎన్ఫీల్డ్ తన వినియోగదారుల అభిరుచులపై ఎంత దృష్టి పెట్టిందో స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు కంపెనీ దృష్టి 450 సీసీ మోడళ్లపై పడింది. కొత్త మోడళ్లను తీసుకురావడం ద్వారా, ఇది అడ్వెంచర్, టూర్‌యింగ్, అగ్రెసివ్ రైడింగ్ కోరుకునే వినియోగదారులని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇది Himalayan 450 వంటి మోడళ్లతో మొదలై, మిగతా మోడళ్లను కొత్తగా మార్చాలనే దిశగా వెళుతోంది. అంతేకాదు, రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 650-750 సీసీ విభాగాల్లో కూడా చర్యలు మొదలుపెట్టింది. ఈ విభాగంలో కొత్త ఆఫర్‌లు కంపెనీకి గ్లోబల్ మార్కెట్‌లో మరింత ప్రాముఖ్యతను తీసుకురానున్నాయి. అధిక పని కోరుకునే ప్రొఫెషనల్ రైడర్లను ఆకట్టుకునేలా ఈ మోడళ్లు రూపుదిద్దుకుంటున్నాయి.

Royal Enfield Upcoming 650cc BIkes

రానున్న రోజుల్లో తన మోడళ్లను కొత్తగా మార్చి విడుదల చేయాలని చూస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీకి చెందిన బుల్లెట్ 350, మీటియోర్ 350 వంటి మోడళ్లలోనూ స్వల్ప మార్పులు తీసుకురాబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ మోడళ్లలో వచ్చే మార్పులు కాస్మెటిక్ దిశగా ఉండే అవకాశం ఉంది. అంటే వీటి కలర్స్, గ్రాఫిక్ డిజైన్ల పరంగా కొత్త మార్పులు ఊహించుకోవచ్చు. అయితే, 349 సీసీ ఎయిర్-అండ్-ఆయిల్-కూల్డ్ ఇంజిన్ మాత్రం మారదు.

అలాగే, గెరిల్లా 450 కేఫ్ రేసర్ వెర్షన్‌ను కూడా మార్చడానికి కంపెనీ సిద్ధమైందని సమాచారం. ఇది సంస్థ 450 సీసీ ప్లాట్‌ఫారంపై చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా అభివృద్ధి చెందుతోంది. ఈ మోడల్, స్ట్రీట్ రేసింగ్‌కి అనుగుణంగా డిజైన్ చేయబడుతుందని భావించబడుతోంది. క్లీన్ లైన్‌లు, స్టాన్సు లో తక్కువ పొజిషనింగ్, ఆగ్రెస్ శైలి కలగలిపిన ఈ కేఫ్ రేసర్ మోడల్, మోటార్‌సైకిల్ అభిమానుల గుండెను కొల్లగొట్టేలా ఉండనుంది.

Royal Enfield Upcoming 350cc BIkes

అంతేకాదు, ఇది రాబోయే ట్రయంఫ్ థ్రక్స్టన్ 400 వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా నిలవనుంది. ఇప్పటికే ఇది చాలా సార్లు పలు టెస్టింగ్‌లకు గురైంది. ఈ మోడల్, రాబోయే రోజుల్లో మధ్యస్థాయికి చెందిన ప్రీమియం కేఫ్ రేసర్ సెగ్మెంట్‌లో ఒక కొత్త మైలురాయికి చేరే అవకాశం ఉంది. అందుకే, ఈ బైకుకి సంబంధించిన అంచనాలు ఇప్పటికే బాగా పెరుగుతున్నాయి. గెరిల్లా 450 కేఫ్ రేసర్ వెర్షన్‌ 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ మొత్తాన్ని చూస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకవైపు తన క్లాసిక్ మోడళ్లను తాజా రూపంలో తీసుకొస్తూనే కొత్త అంశాలను జోడిస్తుంది. 650 సీసీ విభాగంపై కంపెనీ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టింది. దీనికి ప్రధాన కారణం. యువత ఎక్కువగా అధిక ఇంజిన్ కెపాసిటీ కలిగిన వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం వలన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ సెగ్మెంట్ మోడళ్లను అప్‌డేట్ చేయాలని నిర్ణయించింది.

Royal Enfield Upcoming 3650cc Shotgun BIkes

అలాగే, రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 సీసీ సిరీస్‌ ఆధారంగా చేసుకుని 750 సీసీ ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తోంది. దీనిని అంతర్గతంగా 'R' కోడ్‌నేమ్‌తో పిలుస్తున్నారు. ఈ కొత్త పవర్‌ట్రెయిన్‌ను సొంతంగా కలిగి ఉండే తొలి మోడల్ కాంటినెంటల్ GT-R అవుతుందని సమాచారం. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా R1E" అనే కోడ్‌నేమ్‌తో ప్రదర్శించబోతున్నట్టు తెలుస్తుంది. ఫెయిర్డ్ బాడీ వర్క్, అథ్లెటిక్ డిజైన్, స్ట్రీట్ రేసింగ్‌ వంటి అంశాలతో రాబోతుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ భవిష్యత్ పై చూపుతో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లపై కూడా దృష్టి పెట్టింది. 2026 ప్రారంభంలో సంస్థ తొలి ఎలక్ట్రిక్ మోడల్‌గా ఫ్లయింగ్ ఫ్లీ C6 విడుదల చేయాలని చూస్తోంది. ఇది బ్రాండ్ చరిత్రలో ఒక కీలకమైన మలుపు. దీనితో పాటు ఎలక్ట్రిఫైడ్ హిమాలయన్ మోడల్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు కొంత తెలుస్తుంది. ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో కూడా తన సత్తా చాటడానికి ఈ విధమైన ప్రణాళికలు చేసింది.

టూర్‌యింగ్, అడ్వెంచర్ బైకులను కూడా శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోడళ్లుగా మార్చడానికి కంపెనీ బాగా కృషి చేస్తుంది. ప్రస్తుతం ఈవీ టూవీలర్ విభాగంలో దేశీయంగా చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. అడ్వెంచర్ బైకులు కూడా క్రమంగా ఈవీలుగా అభివృద్ధి చెందుతుండటంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఈ దిశగా ఆలోచన చేస్తూ క్రమంగా తన ప్రసిద్ధ బైకులను మెరుగైన బ్యాటరీలతో రీప్లేస్ చేసి మార్కెట్లోకి విడుదల చేయాలని ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 ట్విన్ పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. దీని ద్వారా కంపెనీ బుల్లెట్ అభిమానులకు, మరింత శక్తివంతమైన ట్విన్-సిలిండర్ అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తోంది. ఈ మోడల్ వచ్చే ఏడాది లేదా ఆ తరువాత మార్కెట్‌లోకి రావచ్చని అంచనాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకే సారి అనేక దిశల్లో తన పరిధిని విస్తరించుతోంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు

More from DriveSpark

Article Published On: Friday, May 9, 2025, 15:40 [IST]
English summary
Royal enfield upcoming 350 750 cc motorcycles in india more details check
Read more on: #royal enfield #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+