2026లో మార్కెట్ మీదకు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీల దండయాత్ర.. త్వరలోనే ఫ్లయింగ్ ఫ్లీ ఎస్6 స్క్రాంబ్లర్

దేశంలో పాపులర్ టూ-వీలర్ల తయారీ బ్రాండ్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్, తన ఎలక్ట్రిక్ సబ్-బ్రాండ్ ఫ్లయింగ్ ఫ్లీను 2026 ప్రారంభంలో సీ6 మోడల్‌తో పరిచయం చేయబోతోంది. అయితే, దాని రెండవ మోడల్ అయిన ఎస్6 స్క్రాంబ్లర్ కూడా అదే సంవత్సరం చివరి నాటికి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ఛార్జింగ్ సమయం వంటి వివరాలు ఇంకా గోప్యంగా ఉన్నాయి. విడుదల దగ్గర పడినప్పుడు ఈ గురించి మరిన్ని వివరాలు బయటకు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ రెండు బైకులను రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ఈవీ ప్లాట్‌ఫామ్‌లో తయారుచేస్తున్నారు. అయితే, ఎస్6 దాని స్క్రాంబ్లర్ స్టైలింగ్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది సీ6లోని పెద్ద వెనుక హాగ్గర్‌ను చిన్నదిగా చేసి, ఆఫ్-రోడ్-ఫ్రెండ్లీ టైర్లను పొందుతుంది.

Royal Enfield

మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్, రఫ్-రోడ్ కెపాసిటీ కోసం ముందు భాగంలో యూఎస్డీ ఫోర్క్‌లను కలిగి ఉంది. కొత్తగా డిజైన్ చేసిన సీటు, సైడ్-మౌంటెడ్ నంబర్ బోర్డు దాని లుక్‌ను మరింత పెంచుతాయి. ఎస్6 స్క్రాంబ్లర్‌ను ఈఐసీఎంఏ 2025లో ఆవిష్కరించనున్నారు. సంవత్సరం చివరిలో మోటోవర్స్‌లో ఇండియాలో పరిచయం చేయనున్నారు. దీని ధర సీ6 కన్నా రూ.20,000 నుండి రూ.30,000 వరకు ఎక్కువగా ఉండొచ్చని అంచనా.

ఫ్లయింగ్ ఫ్లీ సీ6ను అల్యూమినియం ఫ్రేమ్‌లో నిర్మించారు. దీని ముందు భాగంలో ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. దీని బ్యాటరీని మెగ్నీషియంతో కప్పారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అభివృద్ధి చేసిన చారిత్రక మోటార్‌సైకిళ్ల లాగా దీనిని డిజైన్ చేశారు.

Royal Enfield

ఈ బైకులలో అంతర్గతంగా అభివృద్ధి చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ ఉండనుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ క్యూడబ్ల్యూఎం2290 ప్రాసెసర్‌పై నడుస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, 4జీ, బ్లూటూత్, వై-ఫై కనెక్టివిటీ, రౌండ్ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్-బిల్ట్ నావిగేషన్, ప్రత్యేక వాయిస్ అసిస్ట్ బటన్ కూడా ఉండనున్నాయి.

సర్క్యూలర్ హెడ్ ల్యాంప్, టియర్ డ్రాప్ ఆకారపు ఇంధన ట్యాంక్, బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేసే సింగిల్ వృత్తాకార టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో ఇది వింటేజ్ లుక్‌ను కలిగి ఉంటుంది. ఇందులో స్టాండర్డ్‌గా సోలో సీటు ఉంటుంది, కావాలంటే పిలియన్ సీటు ఆప్షన్ కూడా అందిస్తారు.

Royal Enfield

అన్ని బ్రాండ్‌ల లాగే, రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడున్న యువతకు కావాల్సిన అన్ని ఫీచర్లను అందించి, ప్రస్తుత ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్‌లో గట్టి పోటీ ఇవ్వడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ సిద్ధంగా ఉంది. 2026ఆర్థిక సంవత్సరం నాలుగవ త్రైమాసికంలో సీ6 ప్రారంభమవుతుందని కంపెనీ ప్రకటించింది. మా అంచనా ప్రకారం 2026జనవరి-మార్చి మధ్య ఈ ఈవీ బైక్ విడుదలయ్యే అవకాశం ఉంది.

మొత్తంగా, ఫ్లాట్ సీటు, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, డ్యూయల్ పర్పస్ టైర్‌లతో పాటు ఆఫ్-రోడ్ సామర్థ్యం కోసం కూడా డిజైన్ చేసిన స్క్రాంబ్లర్-ప్రేరిత ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కూడా రాబోతోంది. దీని డిజైన్‌లో వైర్-స్పోక్ వీల్స్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, సన్నని సింగిల్ సీటు కూడా ఉండటం విశేషం.

More from DriveSpark

Article Published On: Monday, June 23, 2025, 17:30 [IST]
English summary
Royal enfields electric ambitions c6 to debut s6 scrambler to follow in 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+