రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి అత్యంత పవర్‌ఫుల్ బైక్ వచ్చేస్తోంది.. కొత్త 750సీసీ బైక్ ఫీచర్లు లీక్

రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలో రాబోతోంది. కంపెనీ తమ లైనప్‌లో అత్యంత శక్తివంతమైన బైక్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750ను విడుదల చేయబోతోందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా కొత్త మోడల్స్, కాన్సెప్ట్ బైక్‌లను ప్రదర్శించడానికి EICMA షో ఒక గొప్ప వేదిక. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ కూడా ఈ వేదికను చాలా సందర్భాల్లో ఉపయోగించుకుంది.

ఈసారి కూడా, రాయల్ ఎన్‌ఫీల్డ్ తన అభిమానులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమైంది. కంపెనీ ఇంతవరకు తయారు చేసిన బైక్‌లలో కెల్లా అత్యంత పవర్ఫుల్ మోడల్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750ని EICMA 2025లో లాంచ్ చేయవచ్చని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

Royal Enfield s Most Powerful Bike to Launch Soon Set to Create a Buzz

ఈ సరికొత్త 750సీసీ బైక్ టెస్టింగ్ సమయంలో విదేశాల్లో చాలా సార్లు కనిపించింది. ఇదే కాకుండా, రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 750కూడా ఈ షోలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750లో సరికొత్త 750సీసీ ఇంజిన్ ఉంటుంది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ, ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రసిద్ధ 650సీసీ ఇంజిన్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ ఇంజిన్ సుమారుగా 50 నుంచి 55 బీహెచ్‌పీ శక్తిని, 60 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఈ పవర్‌ఫుల్ ఇంజిన్‌తో ఈ బైక్ హైవేల మీద, అడ్వెంచర్ రైడింగ్‌లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్‌ను చూపించగలదు.

Royal Enfield s Most Powerful Bike to Launch Soon Set to Create a Buzz

ఈ కొత్త 750సీసీ మోటార్‌సైకిల్ కేవలం పవర్‌ఫుల్ ఇంజిన్‌తో మాత్రమే కాకుండా, అనేక అధునాతన ఫీచర్లతో కూడా రాబోతోంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ బైక్‌లో 19 అంగుళాల ఫ్రంట్ వీల్, ట్యూబ్‌లెస్ టైర్లు ఉండనున్నాయి. సస్పెన్షన్ విషయానికొస్తే, ముందు వైపున యూఎస్‌డీ (అప్‌సైడ్ డౌన్) ఫోర్క్‌లు, వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ ఉండొచ్చు.

ఈ రెండూ కూడా అడ్జస్టబుల్ యూనిట్లు అయ్యే అవకాశం ఉంది. ఇది రైడర్‌కు మరింత సౌకర్యాన్ని ఇస్తుంది. ఈ బైక్‌లో పూర్తిగా కొత్త ఫ్రేమ్, సబ్‌ఫ్రేమ్ ఉండనుంది. ఇది బైక్‌కు మరింత బలాన్ని అందిస్తుంది. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ 750సీసీ బైక్‌లో అడ్వాన్సుడ్ టెక్నాలజీ ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

Royal Enfield s Most Powerful Bike to Launch Soon Set to Create a Buzz

ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, నేవిగేషన్ సపోర్ట్‌తో కూడిన TFT డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఈ ఫీచర్లు ఈ బైక్‌ను టూరింగ్ కోసం మరింత అనుకూలంగా మారుస్తాయి. ధర విషయానికొస్తే కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. అయితే, ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ 750సీసీ బైక్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 4 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న హిమాలయన్ 450 వెర్షన్ ధర రూ. 2.85 లక్షల నుంచి రూ. 2.98 లక్షల మధ్య ఉంది. దీంతో పోలిస్తే ఈ కొత్త 750సీసీ బైక్ ధర ఎక్కువగా ఉండొచ్చు. ఈ బైక్ లాంచ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ మార్కెట్‌లో ఒక సరికొత్త సంచలనం సృష్టించగలదని నిపుణులు భావిస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, August 8, 2025, 18:59 [IST]
English summary
Royal enfields most powerful bike to launch soon set to create a buzz
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+