స్టైలిష్ లుక్, 45కిమీ పైగా మైలేజ్, రూ.80వేలలోపు లభించే హోండా యాక్టివాకు ఆల్టర్నేటివ్ స్కూటర్లు ఇవే !
హోండా యాక్టివా 110 (Honda Activa 110) గురించి తెలియని వారుండరు. రోజువారీ వాడకానికి ఇది చాలా పాపులర్ స్కూటర్. రూ.80,000 (ఎక్స్-షోరూమ్) ధర, 109.51 సీసీ పెట్రోల్ ఇంజిన్, 45 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్.. ఇలా దీనికి చాలా ప్లస్‌లు ఉన్నాయి. 4.2-అంగుళాల టీఎఫ్‌టీ (TFT) ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
సేఫ్టీ కోసం డ్రమ్ బ్రేక్‌లు ఇచ్చారు. అయితే, యాక్టివా 110 కాకుండా వేరే ఆప్షన్స్ కావాలంటే ఈ 3 స్కూటర్లను కూడా కొనుగోలు చేయొచ్చు. అవి ఏంటి, వాటి ప్రత్యేకతలు ఏంటి? ఈ వార్తలో వివరంగా తెలుసుకుందాం. హోండా యాక్టివా 110 (Honda Activa 110) కు ప్రత్యామ్నాయంగా ఈ 3 స్కూటర్లను కొనుగోలు చేయొచ్చు. వాటి వివరాలు ఇక్కడ ఉన్నాయి:

1. హీరో జూమ్ 110(Hero Xoom 110): హీరో జూమ్ 110 (Hero Xoom 110) అనేది ఒక ముఖ్యమైన స్కూటర్. ఇది 'హోండా యాక్టివా 110' కి అద్భుతమైన ప్రత్యామ్నాయం. దానికి తగ్గట్టుగా రూ.72,000 నుంచి రూ.84,000 (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉంది. చాలా నీట్‌గా డిజైన్ చేశారు. పోల్‌స్టార్ బ్లూ, స్పోర్ట్ రెడ్, బ్లాక్ మరియు మ్యాట్ అబ్రాక్స్ ఆరెంజ్ అనే రంగుల ఆప్షన్లలో కూడా లభిస్తుంది.
ఈ స్కూటర్ పవర్ ఫుల్ 110.9 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. లీటరుకు 53 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, బూట్‌లైట్ తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. రైడర్ల సేఫ్టీ కోసం డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.

2. టీవీఎస్ జుపిటర్ 110 (TVS Jupiter 110): దీన్ని కూడా 'హోండా యాక్టివా 110' కి ప్రత్యామ్నాయంగా కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ రూ.77,000 నుండి రూ.90,000 (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉంది. అంతేకాకుండా, చాలా ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. డాన్ బ్లూ, గెలాక్టిక్ కాపర్ మ్యాట్, స్టార్‌లైట్ బ్లూ గ్లోస్ తో సహా అనేక రంగుల ఆప్షన్లలో కూడా లభిస్తుంది.
కొత్త స్కూటర్ శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌ను కలిగి ఉంది. 113 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 7.91 పీఎస్ హార్స్‌పవర్, 9.8 ఎన్‌ఎం (Nm) పీక్ టార్క్ ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా, 48 కెఎంపీఎల్ వరకు మైలేజ్ ఇస్తుంది.

ఈ జుపిటర్ స్కూటర్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంటెలిజెంట్ స్టార్ట్/స్టాప్, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్, యూఎస్‌బీ ఛార్జర్ తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. 5.1 లీటర్ల కెపాసిటీ గల ఫ్యూయెల్ ట్యాంక్‌ను పొందింది. సేఫ్టీ కోసం డిస్క్/డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.
3. హీరో ప్లెషర్ ప్లస్ (Hero Pleasure Plus): ఇది కూడా ఒక ముఖ్యమైన స్కూటర్. 'హోండా యాక్టివా 110' కి మంచి ప్రత్యామ్నాయం. చాలా తక్కువ ధరలో కూడా లభిస్తుంది. రూ.71,000 నుండి రూ.83,000 (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉంది. పెర్ల్ సిల్వర్ వైట్, బ్లూయిష్ టీల్, అబ్రాక్స్ ఆరెంజ్ బ్లూ, బ్లూయిష్ టీల్ అనే రంగుల ఆప్షన్లలో కూడా లభిస్తుంది.

ఈ స్కూటర్ 110 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. లీటరుకు 50 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్‌సీడీ స్క్రీన్ తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. దీనితో పాటు, 4.8 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్‌ను పొందింది.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: హోండా యాక్టివాకు గట్టి పోటీగా ఈ మూడు స్కూటర్లు నిలుస్తున్నాయి. ధర, మైలేజ్, ఫీచర్ల పరంగా ఇవి మంచి ప్రత్యామ్నాయాలు. మీ బడ్జెట్, అవసరాలకు తగ్గట్టుగా ఈ మూడింటిలో ఏదైనా ఒకదాన్ని సెలక్ట్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








