ఓలా ఎలక్ట్రిక్‌కు షాక్.. 248 కి.మీ రేంజ్‌తో మార్కెట్లోకి కొత్త స్కూటర్.. స్టన్నింగ్ లుక్స్‌తో కట్టిపడేస్తుంది

దేశంలో సాంప్రదాయ ఇంధన వాహనాల కంటే ఈవీలకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. చాలా మంది కొత్త వినియోగదారులు వీటిపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం ఓ రేంజ్‌లో పెరిగింది. మంచి బ్యాటరీ పనితీరు, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ కలిగిన మోడళ్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈవీ మార్కెట్లో పోటీ వాతావరణంలో మాములుగా లేదు. పెద్ద కంపెనీల నుంచి మొదలుకుని స్టార్టప్ సంస్థలు సైతం తమకు అందుబాటులో ఉన్న బడ్జెట్‌లోనే పలు మోడళ్లను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మోడళ్లు ఇటీవల కాలంలో మార్కెట్లోకి విడుదల అయ్యాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ సింపుల్ ఎనర్జీ (Simple Energy) సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొత్తగా అప్‌డేట్ చేసి మరి తాజాగా తీసుకొచ్చింది. పోటీ మార్కెట్లో ఈ స్కూటర్ ద్వారా కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.

కొత్త సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌‌‌లో 5 కిలోవాట్ల బ్యాటరీని రెండు ప్యాక్‌లుగా విభజించారు. దీనిలో 3.7 కిలోవాట్ స్థిర బ్యాటరీ అలాగే, పోర్టబుల్‌గా 1.3 కిలోవాట్ ప్యాక్‌ను అందించారు దీనిలో అమర్చిన ఎలక్టిక్ మోటార్ 11.4bhp పవర్, 72Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్లయితే దాదాపు 248 కిమీల దూరం వరకు ప్రయాణిస్తుంది.

Simple One Electric Scooter Updated Model

అదే పాత మోడల్ అయితే దీని కంటే 36 కి.మీల తక్కువ రేంజ్‌ను అందిస్తుంది. కొత్త సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌‌‌ టాప్ స్పీడ్ గంటకు 105 కిమీల వేగంతో దూసుకుపోతుంది. దీనిలొ రెండు బ్యాటరీ ప్యాక్.‌లను అందించడం ద్వారా కస్టమర్లు ఆప్షన్లు ఇచ్చినట్లయింది. దీని సాఫ్ట్‌వేర్‌లో కూడా చాలా మార్పులు చేశారు. ముందు ఇచ్చిన డిస్‌ప్లేలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే, పార్క్ అసిస్ట్, మ్యాప్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్(TPMS), కొత్త డ్రైవింగ్ మోడ్స్, యాప్ ఇంటిగ్రేషన్, స్కూటర్ సేఫ్టీకి సంబంధించిన పలు ఫీచర్స్, రీజెనరేటివ్ బ్రేకింగ్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఈ స్కూటర్‌లో ఉన్నాయి. దీని బరువు విషయానికి వస్తే, ఇది 136 కిలోలు ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సింపుల్ వన్ ఈవీ స్కూటర్లలో ఇది అత్యంత బరువుగల వాటిలో ఇది ఒకటి.

Simple One Electric Scooter Price

సీటు రైడర్లకు చాలా కంఫర్ట్‌గా అనుకూలంగా ఉంటుంది. దాని ఎత్తు 796 మిమీ గా ఉంది. ఇక సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌‌‌ ధర విషయానికి వస్తే, రూ. 1.66 లక్షల వరకు ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర మాత్రమే. అదే ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉంటే సింపుల్ ఎనర్జీ తన వ్యాపారాన్ని పెంచుకోడానికి కొత్తగా షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.

సింపుల్ ఎనర్జీ (Simple Energy) కంపెనీ 2026 నాటికి దేశవ్యాప్తంగా 150 షోరూమ్‌లను ప్రారంభించాలని చూస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీకి కేవలం 10 డీలర్‌షిప్‌లు ఉన్నాయి. దీంతో తన నెట్‌వర్క్‌ను పెంచుకోడానికి మొదట 150 షోరూమ్‌లు, 200 సర్వీస్ సెంటర్‌లను ఓపెన్ చేయాలని ప్లాన్ చేసింది.

Simple One Electric Scooter

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, February 12, 2025, 9:20 [IST]
English summary
Simple one electric scooter new updated model launched here price range and all details
Read more on: #simple energy #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+