బరువు తక్కువ మైలేజ్ ఎక్కువ.. మరోసారి మార్కెట్లోకి ప్లాటినా 110.. ఈ సారి అంతకు మించి

బైక్ ప్రియులకు ఇది నిజంగా ఓ ఆశ్చర్యకరమైన వార్త అనే చెప్పాలి. ఇంకా విడుదల కాకముందే బజాజ్ ప్లాటినా 110 బైక్ డీలర్‌షిప్‌లకు చేరుకుంది. తక్కువ ధరలో విడుదల కానుందా? ఈ కొత్త బైక్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం!

బజాజ్ ప్లాటినా 110 ఒక పాపులర్ బైక్. ఇది ఆకర్షణీయమైన డిజైన్‌ను, ఫీచర్లను కలిగి ఉంది. తక్కువ ధరలో లభించనుండటంతో మధ్యతరగతి ప్రజల అభిమాన మోటార్‌సైకిల్‌గా పేరు పొందింది. బజాజ్ ఆటో ఈ సంవత్సరం ప్రారంభంలో దేశీయ మార్కెట్ నుండి ప్లాటినా 110 ఏబీఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్) మోడల్ అమ్మకాలను దశలవారీగా నిలిపివేసింది. అయితే 'ఏబీఎస్' ఫీచర్ లేని మోడల్ అమ్మకాలను కొనసాగిస్తోంది.

Bajaj Platina 110

తాజాగా, కంపెనీ 2025 'బజాజ్ ప్లాటినా 110' బైక్ మోడల్‌ను పరిచయం చేయడానికి వేగంగా సిద్ధమవుతోంది. ఎటువంటి ప్రకటన లేకుండానే, ఈ కొత్త మోటార్‌సైకిల్ మోడళ్లను దేశవ్యాప్తంగా విడుదల కాకముందే వివిధ డీలర్‌షిప్‌లకు చేరవేసే పనిని ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలను నిశితంగా పరిశీలిస్తే, 2025 బజాజ్ ప్లాటినా 110 మోడల్ డిజైన్‌లో పెద్దగా మార్పులేమీ చేయలేదు. ఇది హాలోజెన్ హెడ్‌లైట్లు, ఎల్ఈడి డిఆర్ఎల్‌లను కలిగి ఉంది. అంతేకాకుండా బ్లాక్ & గ్రీన్ అనే డ్యూయల్-టోన్ కలర్ థీమ్‌లో కూడా లభిస్తుంది. దీని అల్లాయ్ వీల్స్‌పై గ్రీన్ పిన్‌స్ట్రిపింగ్ ఉంది.

Bajaj Platina 110 Back

కొత్త బజాజ్ ప్లాటినా 110 బైక్ మోడల్‌ను ఒబిడి-2బి (OBD-2B) ప్రమాణాలకు అనుగుణంగా అప్ డేట్ చేసి విక్రయానికి తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఇది ఉద్గారాల సమయంలో ఏదైనా సమస్యలు తలెత్తితే రైడర్‌లను హెచ్చరిస్తుంది. ఇది కాకుండా, ఈ బైక్ పనితీరులో పెద్దగా మార్పులు చేయలేదు.

కొత్త బజాజ్ ప్లాటినా 110 మోటార్‌సైకిల్, ప్రస్తుత మోడల్‌లో ఉన్న 115.45 సిసి పెట్రోల్ ఇంజిన్‌నే కలిగి ఉంటుంది. ఇది 8.5 బిహెచ్‌పి హార్స్‌పవర్‌ను, 9.8 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉంటుంది. లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను ఇవ్వగలదని అంచనా వేస్తున్నారు.

Bajaj Platina 110 Price

ఈ బజాజ్ ప్లాటినా 110 బైక్ అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ ఛార్జ్ చేయడానికి USB ఛార్జింగ్ పోర్ట్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంది. కొత్త మోటార్‌సైకిల్ బరువులో కూడా ఎటువంటి మార్పు లేదు. ఇది 119 కేజీల బరువు ఉంటుంది. సేఫ్టీ కోసం ప్రస్తుత మోడల్‌లో ఉన్నట్లుగానే డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.

ప్రస్తుతం ఉన్న బజాజ్ ప్లాటినా 110 బైక్ ధర రూ.71,610 (ఎక్స్-షోరూమ్). 2025 మోడల్‌ను కూడా దాదాపు ఇదే ధరకు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మోటార్‌సైకిల్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత టీవీఎస్ రేడియన్, హోండా లివో, హీరో ప్యాషన్ బైక్‌ల నుండి గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, April 14, 2025, 17:27 [IST]
English summary
Spotted before launch new 2025 bajaj platina 110 reaches dealerships
Read more on: #bajaj #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+