హోండా యాక్టివాకు గట్టి దెబ్బ.. టీవీఎస్ జుపిటర్ ఎలక్ట్రిక్ వస్తోంది.. అదిరిపోయే ఫీచర్స్, తక్కువ ధర
కొత్త స్కూటర్ కొనాలని చూస్తున్నారా? అది కూడా మంచి మైలేజ్, తక్కువ ధరలో కావాలా? అలాంటి వాళ్లకు గుడ్ న్యూస్. టీవీఎస్ జుపిటర్ స్కూటర్ గురించి తెలియని వారుండరు. ఇది హోండా యాక్టివాకి గట్టి పోటీ ఇస్తూ మంచి సేల్స్‌తో దూసుకుపోతోంది.
ఇప్పుడు టీవీఎస్ ఈ జుపిటర్‌ని కొత్త అవతారంలో తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. అదే టీవీఎస్ జుపిటర్ ఎలక్ట్రిక్. ఇది తక్కువ ధరలోనే వస్తుందని వార్తలు వస్తున్నాయి. అలాగే, సీఎన్‌జీ మోడల్ కూడా వస్తోంది. మరి ఈ కొత్త మోడల్స్ స్పెషల్ ఏంటో తెలుసుకుందాం.

టీవీఎస్ జుపిటర్ ఒక పాపులర్ స్కూటర్‌గా మారింది. ఇది హోండా యాక్టివాకు గట్టి పోటీ ఇస్తూ మంచి సంఖ్యలో సేల్ అవుతోంది. ఇంకొన్ని రోజుల్లో జుపిటర్ సీఎన్‌జీ మోడల్ కూడా లాంచ్ కానుంది. ప్రస్తుతం, కంపెనీ సరికొత్త 'జుపిటర్' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది అని అంటున్నారు.
ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో టీవీఎస్ మోటార్, ఐక్యూబ్, ఎక్స్ (X) అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను సేల్ చేస్తోంది. ముఖ్యంగా 'ఐక్యూబ్' ఒక గేమ్ ఛేంజర్ స్కూటర్‌గా మారింది. కస్టమర్లు కూడా దాన్ని కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నారు.

అయితే, ఇప్పుడు టీవీఎస్ మోటార్ కంపెనీ ఇంకా ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను సేల్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకే ఎక్కువ మందికి తెలిసిన 'జుపిటర్'ను ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి ప్లాన్ చేసింది. ఇది రూ.1.2 లక్షల(ఎక్స్-షోరూమ్) ధరలో మార్కెట్‌లోకి వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అయితే, కొత్త 'జుపిటర్' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయడం గురించి కంపెనీ నుండి ఎలాంటి అఫీషియల్ డీటెయిల్స్ రాలేదు.
ఒకటి, రెండు నెలల్లో 'టీవీఎస్ జుపిటర్' సీఎన్‌జీ స్కూటర్ లాంచ్ అవుతుంది. ఈ స్కూటర్ పండుగల సీజన్‌లో అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మార్కెట్‌లోకి వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. రూ.90,000 నుండి రూ.లక్ష (ఎక్స్-షోరూమ్) ధరలో ఇది లాంచ్ అవ్వొచ్చని చెబుతున్నారు. ఇది 2 లీటర్ల పెట్రోల్, 1.4 కిలోల సామర్థ్యం గల సీఎన్‌జీ ఫ్యూయల్ ట్యాంక్‌ను కలిగి ఉంది.

అలాగే, కొత్త సీఎన్‌జీ స్కూటర్, చాలా పవర్‌ఫుల్ అయిన 124.8 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 226 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, యూఎస్‌బీ ఛార్జర్, టీవీఎస్ కనెక్ట్ అప్లికేషన్ వంటి చాలా ఫీచర్లను కలిగి ఉంది.
కొత్త 'జుపిటర్ 125' మోడల్, రూ.89,000 నుండి రూ.లక్ష (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉంది. ఇది 124 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. లీటరుకు 57 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. డ్రమ్/డిస్క్ బ్రేకులను కలిగి ఉంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్‌బీ ఛార్జింగ్ సాకెట్ వంటి చాలా ఫీచర్లను కలిగి ఉంది.
కొత్త జుపిటర్ 110 మోడల్ రూ.81,000 నుండి రూ.93,000 (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉంది. ఇది 113 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. లీటరకు 48 కిమీl వరకు మైలేజ్ ఇస్తుంది. డ్రమ్/డిస్క్ బ్రేకులను కలిగి ఉంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్‌బీ ఛార్జర్ వంటి చాలా ఫీచర్లను కలిగి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: టీవీఎస్ జుపిటర్ ఎలక్ట్రిక్, సీఎన్‌జీ మోడల్స్ లాంచ్ చేయడం చాలా మంచి నిర్ణయం. ఇది కస్టమర్‌లకు మరిన్ని ఆప్షన్స్‌ను అందిస్తుంది. ముఖ్యంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ స్కూటర్లు చాలా మందికి మంచి ఎంపిక అవుతాయి. ఈ కొత్త మోడల్స్ మార్కెట్‌లో మంచి సేల్స్ సాధిస్తాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications








