ఈ స్కూటర్ కొంటే పదేళ్ల వరకు ఎలాంటి టెన్షన్ ఉండదు.. 64 కి.మీ మైలేజ్.. రూ.80 వేలు!

సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) భారత మార్కెట్లో ఒక సాధారణ స్కూటర్‌గా కాకుండా, ప్రపంచ ప్రఖ్యాత స్కూటర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. లాంచ్ అయినప్పటి నుంచి ఈ స్కూటర్‌కు ఉన్న క్రేజ్ తగ్గకుండా రోజురోజుకూ మరింత పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా నమ్మకమైన పనితీరు, సుజుకి బ్రాండ్ ఇమేజ్, అలాగే వినియోగదారులకు సరిపోయే డిజైన్ కారణంగా కొనుగోలుదారులు దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇదే ట్రెండ్ 2025 నవంబర్ నెలలో కూడా స్పష్టంగా కనిపించింది. ఈ ఒక్క నెలలోనే సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ మొత్తం 67,477 యూనిట్లు అమ్ముడవ్వడం గమనార్హం. గత ఏడాది ఇదే నవంబర్ నెలతో పోలిస్తే ఇది చాలా పెద్ద వృద్ధి. 2024 నవంబర్‌లో యాక్సెస్ 125 అమ్మకాలు 54,118 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఈ రెండు గణాంకాలను పోల్చి చూస్తే, సంవత్సరానికొకసారి అమ్మకాల్లో 24.68 శాతం వృద్ధి నమోదైనట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం రెండు చక్రాల వాహనాల మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, యాక్సెస్ 125 ఇంత బలమైన గ్రోత్‌ను చూపించడం నిజంగా చెప్పుకోదగ్గ విషయం. ఈ నవంబర్‌లో సుజుకి యాక్సెస్ 125 అమ్మకాలు ఇంతగా పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది రోజువారీ వినియోగానికి చాలా అనుకూలమైన స్కూటర్‌.

Suzuki Access 125 November 2025 Sales Recorded 24 68 Percent Growth Details

ఇది వినియోగదారుల మనసుల్లో స్థానం సంపాదించింది. ఆఫీస్‌కు వెళ్లేవారు, కాలేజ్ స్టూడెంట్స్, ఇంటి అవసరాల కోసం బయటికి వెళ్లేవారు అందరికీ సరిపోయే విధంగా దీని రైడింగ్ కంఫర్ట్, మైలేజ్, పనితీరు ఉన్నాయి. అంతేకాదు, నిర్వహణ ఖర్చులు కూడా ఇతర స్కూటర్లతో పోలిస్తే తక్కువగా ఉండడం యాక్సెస్ 125కి మరో పెద్ద ప్లస్ పాయింట్. డిజైన్ పరంగానూ ఈ స్కూటర్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. మహిళలు, పురుషులు ఇద్దరూ సులభంగా నడిపేలా ఉంటుంది.

ధర విషయానికి వస్తే, స్కూటర్ ధర రూ.80,891 నుంచి రూ. 97,084 వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. వేరియంట్‌ను బట్టి ధరల్లో తేడా ఉంటుంది. సుజుకి యాక్సెస్ 125ను కంపెనీ స్టాండర్డ్ ఎడిషన్, స్పెషల్ ఎడిషన్ డిస్క్ బ్రేక్, రైడ్ కనెక్ట్ ఎడిషన్, అలాగే అత్యాధునిక ఫీచర్లతో వచ్చే రైడ్ కనెక్ట్ TFT ఎడిషన్‌లలో అందిస్తోంది. దీనివల్ల వినియోగదారులు తమ అవసరాలకు, బడ్జెట్‌కు అనుగుణంగా సరైన వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

Suzuki Access 125 November 2025 Sales Recorded 24 68 Percent Growth Details

ఇంజిన్ విషయానికి వస్తే, యాక్సెస్ 125లో 124 సిసి పెట్రోల్ ఇంజిన్‌ను సుజుకి అందిస్తోంది. ఈ ఇంజిన్ 8.3 బిహెచ్‌పి హార్స్‌పవర్‌తో పాటు 10.2 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ పరంగా లీటరుకు సుమారు 64 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. 5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ ఉండటం వల్ల ఒకసారి ట్యాంక్ నింపితే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.

ఇందులో పలు ప్రీమియం సాంకేతిక అంశాలను జోడించారు. ముఖ్యంగా 4.2 అంగుళాల TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ హైలైట్‌. ఈ డిస్‌ప్లే ద్వారా స్పీడ్, ఫ్యూయల్ లెవల్, ట్రిప్ సమాచారం వంటి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. టర్న్-బై-టర్న్ నావిగేషన్ సపోర్ట్ ఉండటంతో నగరాల్లో కొత్త రూట్లలో ప్రయాణించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజువారీ వినియోగంలో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సమస్య రాకుండా USB ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందించారు.

Suzuki Access 125 November 2025 Sales Recorded 24 68 Percent Growth Details

రోడ్డుపై స్థిరత్వం, కంట్రోల్‌ను మెరుగుపరచడానికి యాక్సెస్ 125కు 12 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అందించింది. వీటితో పాటు మంచి గ్రిప్ కలిగిన టైర్లు ఉండటంతో మలుపుల్లోనూ, తడి రోడ్లపై కూడా స్కూటర్ గట్టి పట్టుతో నడుస్తుంది. సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో సింగిల్-షాక్ అబ్జార్బర్‌ను ఏర్పాటు చేశారు. ఇది గుంతలు, స్పీడ్ బ్రేకర్లు ఉన్న రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణించేలా చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 25, 2025, 11:18 [IST]
English summary
Suzuki access 125 november 2025 sales recorded 24 68 percent growth details
Read more on: #suzuki motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+